Others

అనుభూతుల రాశి షిరిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విల్లేపార్లేకు చెందిన న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ దీని నిర్మాత. ఇతనికి రైలు ప్రమాదంలో కాలికి గాయమైంది. బాబాను దర్శించుకుని కాలి అవిటితనాన్ని పోగొట్టుకొమ్మని ఇతనికి స్నేహితుడైన నానాసాహెబు సలహానిచ్చాడు. కానీ దీక్షిత్ బాబాను దర్శించుకున్న మరుక్షణం మానసిక పరిణితిని పొంది ‘బాబా! నా కాలి కుంటితనం కాదు... నా మనసులోని అవిటితనాన్ని పోగొట్టు’అని ప్రార్థించాడు. బాబా అనుమతితో ధనవంతుడైన దీక్షిత్ 1910లో వాడా నిర్మాణానికి పునాదివేశాడు. దీని నిర్మాణం ప్రారంభమైన రోజే చావడి ఉత్సవం ప్రారంభమైంది. 1911లో శ్రీరామనవమి రోజున దీక్షిత్ వాడా ప్రారంభమైంది. ఇది కూడా శిరిడీ వచ్చే భక్తులకు వసతి గృహంగా ఉపయోగపడేది.

మారుతి మందిరం
శ్రీ సాయి ఎందరో భక్తులకు ఎన్నో రూపాల్లో దర్శనం ఇచ్చారు. వాటిలో మారుతి రూపం ఒకటి. బాబా హృదయంలో హనుమంతునికి ప్రత్యేక స్థానం ఉంది. బాబా లెండీ వనానికి వెళ్లే ముందు ముందుగా మారుతికి వందన సమర్పణ చేసి తరువాత వనానికి వ్యాహ్యాళికి వెళ్లేవారు. ఈ మందిరం చాలా శతాబ్దాల నాటిదని చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. ఈ మందిరంలో మహాత్ములైన జానకీదాసు, దేవీదాసు శాశ్వత నివాసులుగా ఉండేవారు. బాబా రోజులో ఏదో సమయంలో ఇక్కడకు వచ్చి వీరితో కబుర్లు చెప్పేవారు. అప్పుడప్పుడు గంగాఘీర్ అనే మహాత్ముడు శిరిడీకి వచ్చినపుడు ఈ మారుతీ మందిరంలోనే బసచేసేవారు. బాబా వీరు కలిసి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకునేవారు.

అబ్దుల్‌బాబా కాటేజి
అబ్దుల్ బాబా బాబాకు ప్రియ భక్తుడు. ఈయన 1889లో సాయివద్దకు వచ్చారు. నిత్యం బాబావద్ద కూర్చుని ఖురాన్ పఠించేవారు. బాబావద్ద అబ్దుల్‌కు విశిష్టస్థానం ఉండేది. ఎల్లప్పుడు అబ్దుల్ ‘అల్లాసాయి’అనే నామాన్ని పఠిస్తుండేవారు. అబ్దుల్ సమాధి లెండీవనంవద్ద ఉంది. చావడి ఎదురుగా అబ్దుల్‌బాబా కాటేజీ అనే బోర్డు ఉంటుంది. అందులోకి ప్రవేశిస్తే అబ్దుల్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ సాదరంగా లోనికి ఆహ్వానిస్తారు. బాబా వివిధ సందర్భాల్లో పలికిన పలుకులు, చేసిన ఉపదేశాలు, చెప్పిన మాటల్ని అబ్దుల్లా పుస్తకంలో రాసుకునేవాడు. అవసరమైనప్పుడు ఆ పుస్తకాన్ని ప్రశ్నల పుస్తకంగా ఉపయోగించుకునేవాడు. ఉదాహరణకు ఏదైనా సమస్య ఎదురైతే తను రాసుకున్న పుస్తకంలోని బాబా పలుకుల్ని సమాధానంగా పొందేవాడన్న మాట. అబ్దుల్ 1954లో నిర్యాణం చెందారు. కాగా, ప్రస్తుతం అబ్దుల్ కాటేజీగా పిలువబడుతున్న ఇంటిలో రాధాకృష్ణ మాయి అనే బాబా భక్తురాలు కూడా నివాసం ఉండేది.

లక్ష్మీబాయి షిందే సమాధి
షిండే పాటిల్ భార్య లక్ష్మీబాయి. సాయినాథుని భక్తులలో ఈమె అగ్రగణ్యురాలు. ఎంతో ఐశ్వర్యవంతురాలైనప్పటికీ అన్నిటినీ వదలుకుని బాబా సేవకే అంకితమైన గొప్ప పుణ్యాత్మురాలు. తన జీవితాన్ని బాబా సేవకే అంకితంచేసిన భక్త శిఖామణి. ఈమె బాబాకు నిస్వార్థమైన సేవల్ని అందించారు. ఈమె సేవలకు సంతుష్టి చెందిన బాబా తన అంత్యకాలంలో లక్ష్మీబాయికి తొమ్మిది వెండి నాణములను ప్రసాదంగా బహూకరించారు. మారుతి మందిరానికి ఎదురుగా దక్షిణం వైపునకు సాగే వీధిలో లక్ష్మీబాయి సమాధి ఉంది.

మహల్సాపతి గృహము
సాయినాథుని భక్తుల్లో అగ్రగణ్యుడు భక్తమహల్సాపతి అనే విషయం సాయి భక్తులకు తెలిసిందే. బాబా ఈయనను ప్రేమగా ‘్భగత్’అని పిలిచేవారు. బాబావద్ద మహల్సాపతికి ఉన్న స్థానం విశిష్టమైనది. మహల్సాపతి రేయింబవళ్లు బాబానే అంటిపెట్టుకుని ఉండేవాడు. బాబాను ‘సాయి’అని పిలిచి మనందరికీ కల్పవృక్షం వంటి నామాన్ని పరిచయంచేసిన భాగ్యశీలి మహల్సాపతి. ఖండోబా మందిరానికి ప్రధాన పూజారిగా ఉండేవాడు. ఈయన సమాధి కుమ్మరి వాడలో ఉంది. బాబా ఈయనకు స్వయంగా ప్రసాదించిన మూడు నాణెములు, పాదుకలు, కఫనీ, బెత్తము మహల్సాపతి ఇంట్లో నేటికీ చూడవచ్చు. ఈ వస్తువులనే బాబా తరచుగా తన ఆస్తిగా పేర్కొనేవారు. అటువంటి గొప్ప ఆస్తి పొందిన మహల్సాపతి మిక్కిలి అదృష్టవంతుడు. వారి వంశస్తులు నేటికీ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. సాయిభక్తులు వెళ్లి అడిగితే వారు వాటిని చూపిస్తారు. మారుతి మందిరానికి ఎదురుగాగల వీధిలో మహల్సాతి ఇల్లు ఉంది. లక్ష్మీబాయి షిండే సమాధి దాటాక వంద అడుగుల లోపే ఈయన ఇంటిని చూడవచ్చు. బాబా, మహల్సాపతి ఒకే గుడ్డపై నిద్రించేవారు. బాబా దేహాన్ని విడిచిన నాలుగు సంవత్సరాలకు పవిత్ర ఏకాదశి సోమవారంనాడు మహల్సాపతి భౌతిక శరీరాన్ని విడిచారు.

శ్యామా ఇల్లు
బాబా ప్రియ భక్తుల్లో శ్యామా ఒకరు. ఈయన అసలుపేరు మాధవరావు దేశ్‌పాండే. బాబా ముద్దుగా శ్యామా అని పిలవటంతో ఆ పేరుతోనే ప్రసిద్ధులయ్యారు. సదాచార సంపన్నుడైన శ్యామా బాబాతో ఎంతో చనువుగా ఉండేవాడు. భారీ విగ్రహంతో చూడగానే ఆకట్టుకునే రూపం ఆయనది. శిరిడీలో కొద్దిరోజులు శ్యామా ఆయుర్వేద వైద్యాన్ని చేసేవాడు. బాబావద్ద ఎన్నో వైద్య చిట్కాలు నేర్చుకున్నాడు. సాయిని అచంచల విశ్వాసంతో ఇరవై సంవత్సరాలపాటు శ్యామా సేవించాడు. బాబా శ్యామాకు బహూకరించిన నల్లరాతి విఘ్నేశ్వరుని విగ్రహాన్ని ఈనాటికీ శ్యామా ఇంట్లో సాయిభక్తులు చూడవచ్చు.

తాత్యాకోతే సమాధి
బాబా ఇతనిని తాత్యా అని పిలిచేవారు. తాత్యా బాబాను మామా అని సంబోధించేవాడు. బాబాకు అత్యంత సన్నిహితులైన వారిలో తాత్యా ఒకడు. తాత్యా తల్లి బాయిజా బాయిని బాబా సోదర సమానురాలిగా, తల్లిగా భావించేవారు. బాబా శిరిడీకి వచ్చిన కొత్తలో ఆయనలో భగవంతుడిని దర్శించిన పుణ్యాత్మురాలు బాయిజాబాయి. బాబాను వెతికి వెతికి బాయిజా అన్నం తినిపించేది. ఆమె కొడుకును తన ప్రాణ సమానంగా చూసుకొంటానని బాబా ఆమెకు మాటిచ్చారు. అన్నట్టే తాత్యాను బాబాను ఎంతో ప్రేమాస్పదంగా చూసేవారు. తాత్యా 1945లో ప్రాణం విడిచాడు. ఈయన ప్రాణం నిలబెట్టేందుకే బాబా ప్రాణత్యాగం చేశారని చెబాతారు.
--ఇంకావుంది...

-- దీక్షిత్ వాడా