Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది బ్రహ్మ నాకిచ్చిన వరం. కనుక నీవు నన్ను దాటి వెళ్ళలేవు.
అంతటి స్వామి కూడా బ్రహ్మ పేరెత్తితే కుంచించుకు పోతాడు.
ఆయనకు బ్రహ్మ వాక్యమందంత గౌరవం.
బ్రహ్మ వాక్యానికి సత్యత్వాన్ని కల్పించటం కోసం.
తాను లొంగిపోతూ ఉంటాడు.
సృష్టికర్త వాక్యాన్ని సృష్టి పాలకులు సత్యం చేయాలి.
అందుకనే - బ్రహ్మ వాక్యాన్ని సత్యము చేయటం కోసం విష్ణువు అవతారాల్ని ఎత్తుతూ ఉంటాడు. అలాగే - గృహయజమాని వాక్యాన్ని గృహస్థులు సత్యం చేస్తూ ఉండాలి. సరే -
ఆవిడ నోరు తెరచింది. స్వామి తప్పుకొని వెళ్ళడానికి సావకాశం లేనంతగా నోటిని పెంచింది. స్వామి శరీరాన్ని సంకోచింపచేసేడు.
అంగుష్ఠమాత్రుడయ్యేడు. ఆమె నోట్లో ప్రవేశించేడు.
అంతటి నోటిని మూసే లోపున బయటకు వచ్చేడు. ఆకాశంలో నిలిచేడు.

ప్రవిష్టో‚స్మిహి తే వక్త్రం దాక్షాయణి నమో‚స్తుతే
నీ వడిగినట్లు నీనోట్లో ప్రవేశించేను. నీవరాన్ని సత్యమూ చేసేను అంటాడు - అలా
బుద్ది వైభవంతో ఆమెను గెలుస్తాడు. తృప్తి పరుస్తాడు.
ఇదీ శ్రీమంతుని లక్షణం.
అందుకే ఆమె కూడా.
అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యధా సుఖం
అని ఆశీర్వదిస్తుంది.
ఇది ‘‘తృతీయ కర్మ సుదుష్కరం’’
ఇక్కడ స్వామికి మోహం లేదు. జితక్రోధుడు.
స్వామి ప్రయాణిస్తున్నాడు. ఇంతలో గమనం ఆగిపోయింది. ఎవరో తనను బలవంతంగా లాగుతూన్నట్లనిపించింది.
పైకి చూసేడు ప్రక్కకు చూసేడు క్రిందకు చూసేడు. ఏదో మహాసత్వం సముద్రంలో కనిపించింది. ఇంతలో తన ప్రభువు సుగ్రీవ వాక్యం జ్ఞాపకం వచ్చింది.
ఛాయాగ్రాహిణి సింహికను చూసేడు. నోరు తెరచి వున్నదాని యందు సూక్ష్మరూపంతో ప్రవేశించేడు. శతధా దాన్ని ఛేదించేడు. సముద్ర జలాలలో తేలించేడు. ఇపుడు దేవతలు నాలుగవ సుదుష్కర కర్మను చూసేరు. ఇపుడు స్వామి యందు
ధృతి ర్దృష్టిర్మతి ర్దాక్ష్యం స్వకర్మ సునసీదతి అని వారికనిపించింది.
సముద్రాన్ని దాటాలని అనుకొనటంలో-దృతి, మైనాకుని కాదనటంలో దృష్టి, సురసను తృప్తిపరచటంలో మతి, సింహికను భేదించటంలో దాక్ష్యం ప్రస్ఫుటమైనవి. ఇవి దేవీ ఉపాసకులకు నిజమైన సాధకులకు అలవడే లక్షణాలు. ఎందుకంటే-
తుష్ట్యై నమః పుష్ట్యై నమః
మత్యై నమః ధృత్యై నమః అని.
ఈ మొదలుగా మనం లలితా స్వరూపాన్ని సేవిస్తూ ఉంటాం. ఈ శక్తులన్నీ అమ్మవారి స్వరూపాలు. సాధకునకు ఈ లక్షణాలను ఆమెయే అనుగ్రహిస్తుంది. అందుకే-
యాదేవీ సర్వభూతేషు తుష్టి రూసేణ సంస్థితౌ
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ