Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
ఈ మొదలుగా దేవతలు ఆ తల్లి గుణ కీర్తనను చేస్తూ ఉంటారు.
బుద్ధిః కీర్తి ర్ధృతిర్లక్ష్మీః శక్తి శ్శ్రద్ధామతి స్సృతిః
సర్వేషాం ప్రాణినాం సాంబ ప్రత్యక్షం తన్నిదర్శనం
అని చెప్పినట్లు ఆ స్వరూపాన్ని మనం భావన చేస్తూ ఉంటాం. అందుకే ఆంజనేయస్వామి కూడా- సురసను చూసి ఆమె ఆశీర్వరచనాన్ని పొంది ‘దాక్షాయణి నమోస్తుతే’ అంటాడు.
ఈ నామాన్ని వ్యాఖ్యానిస్తూ పరదేవతాయః కృత్య విశేష నామకమిదం అని అంటారు భాష్యకర్తలు.
దాక్షాయణి అంటే అమ్మవారే కదా! ఈ విధంగా స్వామికి సీతానుగ్రహం మార్గమధ్యంలోనే కలిగింది. దాన్ని ఆయన కాపాడుకొనాలి.
భగవదనుగ్రహం కలగటం వేరు, దాన్ని కాపాడుకొనటం వేరు. స్వాతంత్య్రం రావటం వేరు, దాన్ని నిలుపుకోగలగటం వేరు. కొంతమంది సాధించిన స్వాతంత్య్రాన్ని కొన్ని వందల సంవత్సరాలపాటు ఆ తరువాత తరాలు అనుభవించినట్లే, ఒక సాధకుడు సంపాదించిన భగవదనుగ్రహాన్ని ఆ వంశంలో కొన్ని తరాలు అనుభవిస్తాయి. ఆంజనేయస్వామి పొందిన పరదేవతారూప సీతానుగ్రహం సర్వవానరులను పునరుజ్జీవితులను చేసింది.
ఈ విధంగా అనుగ్రహీతుడైన స్వామి లంకా తీరాన్ని చేరుతున్నాడు. వనాల్ని చూస్తున్నాడు. ఆ తరువాత విభక్తములవుతున్న మలయాది వృక్షాల్ని చూస్తున్నాడు. ఆ తరువాత వృక్షాల మొదళ్ళనుండి ముందుకు వస్తూన్న ‘సాగరస్య చపత్నీనాం ముఖాన్యపి విలోకయన్- సాగర పత్నులయిన నదీ ముఖాల్ని చూస్తున్నాడు. త్రికూటాద్రిమీద అడుగుపెట్టేడు.
ఇదీ కవిత్వమంటే- ఉపమాసౌందర్యమంటే-
స్వామి సాగర పత్నుల ముఖాల్ని చూస్తున్నాడు.
సాగరసంగమం చేసే నదీ స్వరూపాన్ని ‘నదీ ముఖం’ అని పిలుస్తాం. స్వామి ఆ ముఖాల్ని చూస్తున్నాడు. ఈ ముఖాల్నే కాదు లంకలో ప్రవేశించిన తరువాత తనకు కనబడే స్ర్తిల ముఖాల్నే చూస్తాడు. తనకు సీతా ముఖ దర్శనం కలగాలి. తక్కిన శరీర స్థితి తనకు కానిది.
ఆమె ముఖ శోభను తాను విన్నాడు. లీలగా చూసేడు. ఆమె ఆభరణాలు తనకు తెలుసు. తెలిసినవాటి కోసమే చూస్తాడు. ఇలా సీతను చూసేవరకూ ఆ అలంకారం ప్రవహిస్తూనే వుంటుంది. ఋషుల మాట ఇలా ఉంటుంది. సరే- స్వామి త్రికూటంమీద చేరేడు. మళ్లీ తన మామూలు ప్రకృతికి వచ్చేసేడు.
సహస్రారాన్ని పొందిన సాధకుడు కూడా ఉపాధి ధర్మం చేత అక్కడ స్థిరంగా ఉండలేడు. మళ్లీ మూలాధారానికి వస్తూ ఉంటాడు. అలాగ-సరే అక్కడినుండి-
దదర్శ లంకాం అమరావతీమివ
త్రికూటంమీద కూర్చుని లంకా నగరాన్ని చూస్తూ అందులో అమరావతిని చూస్తున్నాడు. ఏమిటి అమరావతి విశేషం. అది దేవేంద్రుని నగరం. అందులో ఆయన పట్టమహిషి శచీదేవి ఉంటుంది. ఆమె పరాశక్తిని సేవించుకొంటూ ఉంటుంది. ఆమె పరాశక్తి అనుగ్రహాన్ని పొందిన సాధకురాలు.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ