Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అనుగ్రహాన్ని ఎంతగా పొందింది అంటే, పులో మజార్బితా అని ఆమె పేరును కలుపుకొని తాను నామధారణను చేసింది అమ్మవారు.
ఇక్కడ లంకలో విభీషణ ధర్మపత్ని సరమ ఉన్నది. ఆమె సీతను సేవించుకొంటున్నది. అందుకని లంక అమరావతి. అది స్వామి దృష్టి. నగర సౌందర్యాన్ని చూడటం బాహ్యదృష్టి. ఈ తత్త్వాన్ని దర్శించడం అంతరదృష్టి.
ససాగర మనాధృష్యమతిక్రమ్య మహాబలః
త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ
స్వామి స్వస్థుడు. త్రికూట శిఖరంమీద కూర్చుని లంకా దర్శనం చేస్తున్నాడు. ఒకేమాట. దానిలో ఎంత విషయ వైవిధ్యం. అది ఋషి వాక్కు లక్షణం.
స్వామి త్రికూట పర్వతంమీద కూర్చున్నాడు ఎలా!
సుఖంగా కూర్చోలేదు. కూర్చున్నట్లున్నాడు.
మహర్షి ‘హ’ అంటారు.
ఇది బాహ్య దృష్టి. మరి ఆంతర్యమేమిటి!
కూటం అంటే అజ్ఞానం. సంసార కారణ అహంకార మమకార రూప అజ్ఞానంలో పడవేసేది. అదీ కూటము. ఈలక్షణం సత్వ రజస్తమోగుణాల విలక్షణత్వం వలన కలుగుతుంది.
అది త్రికూటం. స్వామి ఈ వేళ ఇటువంటి అజ్ఞానానికి అధ్యక్త్యం వహించి కూర్చున్నాడు. అందుకే అపుడు వెనక్కి తిరిగి చూస్తే శతయోజన విస్తీర్ణమైన తాను దాటి వచ్చిన సముద్రం కనబడింది.
ఒక్కసారి తనను చూసుకొంటే-ఇంత శ్రమను ఓర్చి చెమటను కూడా ఎరుగని తన శరీరం కనబడింది.
సముద్రాన్ని దాటినశరీరంమీద అహంకారపుట్టింది.
అంత శ్రమను తట్టుకొన్న శరీరంమీద మమకారం పుట్టింది.
శతాన్యపి యోజనానాం క్రమేయం సుబహూన్యపి - అనుకొన్నాడు.
అజ్ఞానంవలన అహంకారం, అహంకారం వలన బుద్ధి నాశనం, బుద్ధి నాశనంవలన దుఃఖమూ పుడతాయి. అందుకే లంకను చూడగానే స్వామి-
ఆగత్యాపీహ హరయో భవిష్యన్తి నిరర్థకాః
నహియుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి
కోతులు ఇక్కడకు వచ్చినా నిరర్థకమే అవుతుంది. యుద్ధం చేసి లంకను జయించడమనేది దేవతలకు కూడా సాధ్యంకాదు. అంతేకాదు వీనియందు సామదాన భేద దండములైన నాలుగు ఉపాయాలు కూడా పనిచేయవు. ఎందుకంటే-
అవకాశో న సాంత్వస్య రాక్షసే ష్వభిగమ్యతే
నదానస్య నభేదస్యనైవ యుద్ధస్య దృశ్యతే
స్వభావం చేత వీడు రాక్షసుడు. అందువలన సామం (మంచి)గా చెబితే వినడు. పోనీ దానం చేత లొంగుతాడా! వాని దగ్గర లేనిదానికి కదా! లొంగడం. వాని దగ్గర లేనిదేమున్నది. వీని దగ్గర లేనిది ముల్లోకాలలోనూ లేదు. కనుక దానానికి లొంగడు. మరీ భేదం పనిచేస్తుందా! ఎవరితో భేదాన్ని కల్పించటం, వీనంతటివాడు మరొకడుంటే కదా! భేదం. కనుక అదీ కుదరదు. యుద్ధానికి అసలే లొంగడు. అంతేకాదు, రావణ పాలితమైన ఈ లంకను -ప్రాప్యాపి సమహాబాహుః కింకర్యిఃతి రాఘవః- అంటాడు. పరాక్రమవంతమైన రామచంద్రమూర్తి కూడా ఆ లంకకు వచ్చి ఏం చేయగలడు? ఎంత విచిత్రం. అజ్ఞానం వలన పుట్టిన దుఃఖం తన స్వామి సామర్థ్యాన్ని కూడా ప్రక్కన పెట్టించింది.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ