Others

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిను నా వాకిలిఁగావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చి తిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా?
భావం: ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా కాయమన్నానా? దేవతా స్ర్తిలపై మోహపడి, వారి వద్దకు రాయబారిగా వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాంసం పెట్టి, తింటేగానీ వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా! నా ప్రార్ధన వినిపించుకోవేమి?

ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్ము రమ్మంచునే
చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁగాను, నా
శీలంబేమని చెప్పనున్న దిగ నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా!
భావం:అజ్ఞానియైన ఒక కిరాతకుడు పూలు లేవని రాళ్ళతో పూజించినట్లు నేను చేయలేను. సిరాయళునిలాగా కుమారుని పిలిచి చంపి వంట చేసి జంగమదేవులకు పెట్టలేను. తిన్నడులాగా కన్నులు పీకి నీకు సమర్పించలేను. ఇంక నా భక్తి గాడమైనదని ఎలా చెప్పగలనుర? ఈ మాత్రము భక్తికి నీవు హృదయములో సంతోషపడినచో అదే నాకు మహాభాగ్యము

రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు సం
బోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యధా
బీజంబుల్, తదపేక్ష చాలుఁ, పరితృప్తింబొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము, దయతోశ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! రాజులు ఐశ్వర్యముతో మదించినవారు. వారి సేవ నరకము వంటిది. వారు దయతో ఇచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మొదలగునవి సంసార బంధముల పెంచి దుఃఖమును కలిగిస్తాయి. వీటన్నింటినీ అనుభవించి సంతృప్తిపడ్డాను. ఇంక వాటిపై వ్యామోవహము చాలు. జ్ఞాన సంపదను, దానివల్ల కలిగే మోక్షమును నాకు ప్రసాదించుము.

నీ రూపంబు దలంపగాఁ తుదమొదల్నేగాన, నీవై నచో
రా రా రమ్మని యంచుఁ చెప్పవు, వృధారంభంబు లింకేటికిన్
నీరన్ముంపుము పాలముంపు మిక నినే్న నమ్మినవాడం జుమీ
శ్రీరామార్చిత పాదపద్మయుగళా! శ్రీకాళహస్తీశ్వరా!
భావం: ఈశ్వరా! నీ రూపము ఊహించాలంటే, దాని మొదలు, చివర నాకు తెలియవు. పోనీ, నీవైనా నన్ను రమ్మని పిలుస్తావా? పిలవవు. ఇంక దయకై ఎన్ని పాట్లుపడినా ఏమి ప్రయోజనం?

హితవాక్యం

ఆరంభగుర్వీ క్షయిణీ క్రమేణ
లఘ్వీ పురా వృద్ధి ముపైతి పశ్చాత్!
దినస్య పూర్వార్థ భిన్నా
ఛాయేయ మైత్రీ ఖలసజ్జనానమ్!!
‘‘సృష్టిలో తియ్యనిది స్నేహమేనోయ్’’! ఎందువలన? మనిషి మనసు నెరిగి మసలుకోవడాన్ని నేర్పే విద్య స్నేహకళ. అంతరాలు లేని ఆనందరసధుని స్నేహమయ జీవనం. అట్టి స్నేహాన్ని చిరకాలం రక్షించుకోవటం సంస్కారవంతుల లక్షణం. ఆ భావాన్ని భర్తృహరి యిలా వివరించాడు.
‘‘దుష్టుల స్నేహం పగటి పూర్వార్థంలో ప్రసరించు నీడ వంటిది’’. అంటే ఉదయాన పెద్దదిగా ప్రారంభమైన నీడ మధ్యాహ్నవేళకు క్రమక్రమంగా క్షీణించిపోతుంది. అలాగే దుష్టుల స్నేహం కూడా మొదట ఘనంగా ఉంటుంది. రోజులు గడుస్తున్నకొద్దీ విభేదాలతో, ఈర్ష్యాద్వేషాలతో వారి స్నేహ సౌధం బీటలు వారిపోతుంది.కాని సత్ఫురుషుల మైత్రి అలా కాదు. అది పగటి ఉత్తరార్థంలో ప్రసరించు నీడ వంటిది. అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గల సమయంలో నీడ క్రమంగా వృద్ధి చెందుతుంది. అలాగే సజ్జనుల స్నేహం కూడా మొదట అల్పమై పిమ్మట దినదినాభివృద్ధి చెందుతూ పవిత్ర భావనలతో, శుభ కామనలతో సుదృఢమై సుందరమై అలరారుతుంది. ఆదర్శవౌతుంది.
కాబట్టి నీటి బుడగ వంటి స్నేహం వద్దు. చిరకాల మైత్రి కావాలి. ప్రతి హృదయం స్నేహారుణమైనప్పుడు విశ్వశాంతి శతపత్ర పద్మమై పరిమళిస్తుంది.

-వ్యాఖ్యాత: డి.ఎన్.దీక్షిత్