Others

తలరాత తప్పించుకోలేం! (పురాణ వ్యక్తులు - పూర్వజన్మలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వజన్మలో చేసిన పాపమైనా పుణ్యమైనా అనుభవించితీరవలసిందే. పశుజన్మలో పాపపుణ్యాలు సంపాదించేవీలు అంతగా ఉండదు. ఆ పశుజన్మను నెత్తినా కూడా ఏ దేవాలయానికి ఇటుకలు మోయడమో లేక దుంగలు మోయడమో, భూమిని దున్నడం లాంటి పనులు నిర్వర్తించినపుడు ఆ పశుజన్మలో పుణ్యరాశిని భగవంతుడు పెంచుతాడు.
దేవతలు కూడా పాపపుణ్యాలను ఆర్జించుకునే శక్తి తక్కువ కలవారే. ఎందుకంటే వారికి పుణ్యరాశి పెంచుకునే శక్తి లేదుకానీ వారి చేతల వల్ల పాపం గుట్టలుగా పేరుకుపోతుంది. దేవతలై ఉండి కూడా ఇతరులకు కీడు కానీ చేస్తే లేక సజ్జనులు, సాధువులు తపస్సు చేసుకొంటూ ఉన్నపుడు భంగం చేయడమో లేక ఏవిధంగా నైనా వారిని బాధించితే వారికి పాపం తప్పక చుట్టుకుంటుంది. ఇంద్రునికి చుట్టుకున్న పాపాలను మనం పురాణ ప్రవచనాల్లో వింటూ ఉంటాం కదా. ఇలా వచ్చినవే ఆ పాపాభాండాలు. మానవ జన్మలో మాత్రమే వివేకంతో పనులు చేస్తే పుణ్యపాపమూ పెరగడమో తరగడమో జరుగుతుంది. వ్యాసుడు మానవులను జాగృతులుగా ఉంచడానికి పరులను పీడించడమే పాపమని, ఇతరులకు మేలు చేయడమే పుణ్యమని చెప్పాడు. కానీ కొందరు అజ్ఞానం వల్లనో, అవివేకంవల్లనో జన్మతః వచ్చిన వాసనవల్లనో ఇతరులను నొప్పిస్తారు. కాలంతరంలో వారిని విధి నొప్పించక మానదు. ఇది తెలిసినా వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తాం అంటే అది వారి పూర్వజన్మ కర్మేసుమా అనుకోక తప్పదు.
అట్లాంటి ఓ జీవి గురించి ఈరోజు తెలుసుకొందాం.
పూర్వం క్షీరసాగర మధనం జరుగుతున్న కాలంలో కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి వచ్చాడు. రాక్షసుడు కనుక ఆ కాలనేమిని మహావిష్ణువు సంహరించివేశాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడు దీనిని చూశాడు. అసురులను రక్షించే బాధ్యత నాది అనుకొన్న శుక్రుడు తనకు తెలిసిన మృతసంజీవని విద్యద్వారా కాలనేమి బతికించాడు. శుక్రాచార్యుని వలన బతికిన కాలనేమిలో విష్ణువును జయించాలన్న దురుద్దేశం కలిగింది. సజ్జనులను సాధువులను వాళ్లేకాదు సృష్టిపాలనాకార్యాన్ని చేసే పరమాత్మను జయించాలనుకోవడం - అసుర బుద్ధి! ఆ బుద్ధితో బాగా ఆలోచించి బ్రహ్మ కోసం తపస్సు ఆచరించాడు. కఠినమైన తపస్సు చేయాలన్న దృక్పథం కలిగింది. వెంటనే కేవలం గరిక రసం మాత్రమే ఆహారంగా తీసుకొంటూ కాలనేమి అనేక వేల యేండ్లు తపస్సు బ్రహ్మకోసం తపస్సు చేశాడు. చివరకు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు.
కాలనేమి ని వరం కోరుకోమంటే నేను మృత్యుంజయుడు కావాలని కోరుకున్నాడు.
ఇంకావుంది...

- డా. రాయసం లక్ష్మి. 9703344804