Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఇష్టదైవ సంబంధమైన జపం చేయడానికి కూర్చున్నప్పుడు జపప్రారంభానికి ముందు ఆ దైవానికి సంబంధించిన ధ్యన శ్లోకం ఒకటి ఉంటుంది. దాన్ని మనం చదువుతాం. అంటే- మంత్రార్థమైన ఆ దైవం యొక్క రూపం ఇలా ఉండి నామనోగోచరం కావాలి అని మన భావన స్వామి సాధకుడు కనుక. ఇది ఆయన ధ్యానశ్లోకం. స్వామి సేవింపబోయే లలితా రూపమైన సీతాస్వరూపం ఇందులో ఉంది. దానిని వాల్మీకి మహర్షి బీజ రూపంగా నిక్షేపించేరు.
ఆ తల్లికి
నవ చంపక పుష్పాభ నాసాదండ విరిజాతా
అని పేరు. ఆమె నాసిక అప్పుడే వికసించిన సంపెంగ పూవు వంటిదిట. సంపగ పూవు కాదు. దాని రేక. అది ఆదిలో తప్పడగా ఉండి మధ్యలో ఉన్నతంగా ఉండి చివరలో కొనదేలి ఉంటుంది. అదీ ఔన్నత్యం. అలాగే- శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా అని పేరు. విద్యలు మూడు రంగాలు. అవి తామస రాజస సాత్వికాలు. ఇది సాత్విక విద్య. దానికి శుద్ధ విద్య అని పేరు. అదే షోదశీ విద్య ఆ విద్యయొక్క అవికారమైన అంటే వికృతినెరుగని రూపమే అంకురం. ఆసాత్విక స్వరూపం తెలుపు. అటువంటి విద్యారూపమైన దంత పంక్తి కలది. ఆ తల్లి సీత పాండురదన్త అగుట అందులకు. అమ్మవారికి నిరవద్యా అని పేరు. శుద్ధ తేజోమయమైన భగవంతునకు అలంకారాలు వ్రణాలు. అట్టి తేజస్స్వరూపంగా సీత కనబడాలి. సీతను ఆవ్రణగా భావించటం అందుకు. చారుహాసా అని అమ్మవారికి పేరు. శుబిస్మితా అంటే అదే అర్థం. పుష్కరేక్షణా పద్మనయనా అని అమ్మవారి పేర్లు. పద్మ పలాశలోచనా అని అని సీతను అనటంలో అదే భావం. ఆర్యా అని అమ్మవారి నామము. ఇక్కడ సీతను గురించి ఆ మాటే అన్నారు. అటువంటి తల్లి కథన్ను మే దృష్టి పథే‚ద్య సాధభవేత్- అనుకొంటాడు. స్వామి ఈ విధంగా భావించే-
జ్యాముక్త ఇవనారాచః పుప్ణువే వృక్షవాటికాం.
నారి నుండి వదలిన బాణంలో వనవాటికకు ఎగిరేడు. అమ్మవారి ముందు నిలబడి ఏమీకోరుకొనకు. నీవేమి కోరిన అది ఆమె ఈయదలచుకొనిన దానికంటె తక్కువే అవుతుంది. - అని శంకరులు అంటారు. అలాగే స్వామి బయలుదేరేముందు మహేంద్రగిరిపై నుండి తోటి వానరులను చూస్తూ-
యధా రాఘవనిర్ముక్తః శరశ్శ్వసన విక్రమః
గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితామ్- అంటాడు
శ్రీరాముడు తథా‚స్తు అన్నాడు. కనుక లంక ఒడ్డుకుచేరేడు. అప్పుడే సీత యెక్కడుందో అక్కడ వ్రాల్తాను. అని అనుకొని ఉంటే రాత్రంతా ఈ అనే్వషణ ఉండి ఉండకపోవచ్చు సరే- ఇప్పుడు స్వామి మళ్ళీ- వదలిన బాణంలా అశోక వనాన్ని చేరేడు. చంపక వృక్షాలతో చందన వృక్షాలతో రమ్యమైన రుూ అశోక వనం రావణునిదే. సీత యెక్కడ ఉంటుంది. అనుకొన్నాడు.
ఇంకావుంది...