Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపత్నులు:
నిజమేలే! మీ సాయం శ్లాఘనీయమేలే!
నిజమేలే! మీరబలల పాలిటి దైవమ్మే

కాని పరుల తప్పిదాలె కనంబడును మనకు
మన తప్పులు, మన వీపులు మనకెట్టుల కనబడు?

శ్రీకృష్ణుడు:
ఇది ఏమిటి? నా పైననె నిష్ఠురంపు మాటలు?
ఇది ఏమిటి? నా తప్పిదమున్నతోడ నుడువుడి!

కృష్ణపత్నులు:
ఏమున్నది? మీ గొప్పల మేమెరుంగ బోమె?
ఏమున్నది మీ కథలను మేము చెప్పుకొనమె?

కృష్ణవలువ లూడదీయ నికృష్టుండని అందురే?
కృష్ణుడె ఆ పని చేసిన నిలదీయగనెవరు?

కనె్నలు తానమ్ములాడ తమరు దూరలేదే?
వారల చీరెల గ్రహించి పారిపోవలేదే?

ఎంత వేడినా ఈయక ఎంత వేచినారొ?
ఒకరు చేయ తప్పిదమ్ము? మనము చేయ ఒప్పిదమ్మొ?

రాజే యిటు లొనరించిన ప్రజలెట్టుల నుందురు?
కృష్ణవలువ లేమి ఖర్మ? మా వలువలె వొలుతురు!
కృష్ణుడు:
గోపికలూ తానాలని దీర్ఘాలను తీతురేల?
ఇవి ఎన్నటి మాటలోయి? ఇది ఎప్పటి విషయం?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087