Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతన్ని పలకరించడానికీ, వౌనభంగం చేయడానికీ వారికెవ్వరికీ ధైర్యం చాలలేదు.
అప్పుడా స్థితిలో, అతన్ని చూస్తోంటే, శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి లోకోద్ధరణకై, ధర్మసంస్థాపనార్థమై బుద్ధునిగా అవతరించాడా? అని అనిపించక మానదు. అతనివైపు చూస్తోంటే-
ఒక మహదాకాశం తన సూర్యచంద్ర నేత్రాలను తన మబ్బుల కనురెప్పల మాటున మూసికొన్నట్లుగా ఉందా దృశ్యం. ఆ మూసిన కనురెప్పల మాటు నుండి మంద్రమంద్రంగా స్వర్ణకాంతులు ప్రసరిస్తూన్నాయి.
అలా తపోముద్రలో కూర్చున్నట్లుగా కూర్చున్నాడు కృష్ణుడు.
పర్వతంచుట్టూ వేరే అల్లల్లా, నుదుటిపై ముసిరే అలకల్లా ఆతనిచుట్టూ చేరారువారు. ఏంచేయాలో తోచక, ‘‘నీవే మాకిక శరణ’’మంటూ మహాసాధ్వి రుక్మిణిని ఆశ్రయించారు. సలహా చెప్పమంటూ అభ్యర్థించారు.
ఆమె ఒక చిరునవ్వు నవ్వింది. ఆమె నవ్వితే కలువలు విరిసినట్లే! వెనె్నలలు కురిసినట్లే!
ఆపై, ఆమె కరుణించి ఓ తరుణోపాయం చెప్పింది. భక్తిప్రపత్తులతో రాధామాధవుల ప్రేమకథని గానం చేయమంది.
వారలాగే చేశారు.
సాక్షాత్కారం
అప్పుడు, అందరూ చూస్తుండగానే, ఒక మహాదివ్య ప్రకాశం అంతరిక్షంలోంచి, నక్షత్ర మండలంలోంచి, నెమ్మదిగా, నింపాదిగా, భూమిపైకి దిగివచ్చింది. తన వెలుగుల వెల్లువలో శ్రీకృష్ణున్ని ముంచెత్తింది.
అప్పుడు శ్రీకృష్ణుడు కోటి ప్రభలతో వెలిగిపోయాడు.
‘‘రాధా! రాధా’’!అంటూ, కళ్ళుమూసుకునే పలవరించాడు. పరితపించాడు. రాధానామాన్ని జపించాడు.
రుక్మిణీదేవి లేచి నిల్చుంది. చేతులెత్తి నమస్కరించింది. కళ్ళుమూసికొని ప్రార్థించింది.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087