Others

జ్ఞానానంద రూపిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మలేనిదే సృష్టిలేదు. అమ్మ జగదాంబ. అఖిల భువనములను పాలించే తల్లి. ఆ తల్లి కనుసన్నులల్లో లోకాలన్నీ సుభిక్షంగా సాగు తుంటాయ. అమ్మను దర్శించాలనుకొంటే జరుగుతున్న ప్రతిక్షణంలో, జీవిస్తున్న ప్రతి ప్రాణిలో, కదిలే ప్రతి కణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, తల్లి శక్తి వ్యక్తమవుతుంది. పాంచభౌతికమయిన మన శరీరమే జగన్మాత ఆలయం. విశ్వమంతా ఆమె చైతన్యమే. -అశాశ్వతమైన దేహభ్రాంతిని తొలగించుకొంటేనే ఆత్మతత్త్వం బోధపడుతుంది. ఆ ఆత్మతత్త్వమే శ్రీ లలితా పరమేశ్వరి. అమ్మను ఏ పేరుతో పిలిస్తే ఏ భావనతో పూజిస్తామో ఆ భావనలో ఆమె మనకు వ్యక్తమవుతుంది. బాలా త్రిపుర సుందరిగా భావన చేసి పూజిస్తే ఆ అమ్మనే కూతురుగా దర్శనమిస్తుంది. చందోలు శాస్ర్తి అనే మహానుభావుడు బాల మంత్రాన్ని అనుష్ఠానము చేస్తే ఆతల్లి ఆయనకు కుమార్తె గా దర్శనమిచ్చేదట. వారింటికి ఎవరైనా వస్తే వారికి ఆ తల్లి శాస్ర్తీ గారి కూతురుగా కనిపించేదట. వారు ఆ సంగతిని ఆ శాస్ర్తిగారికి చెబితే నాకు కూతురా అంతా ఆ తల్లే దయనే అని నిస్సంతు అయన ఆయన అనేవారట. ఇలా ఎంతోమందికి ఈ కలియుగంలోనూ తల్లి అనుగ్రహం లభిస్తూనే ఉంది భగవంతుడు ఒక్కడే. ఆ పరమాత్మ ఆ పరమతత్త్వానికి రెండు రూపాలు మాత్రమే ఉంటాయ. నిరాకారమూ, నిర్గుణమూ అయన పరమాత్మను మనం సగుణ సాకారంగా, నిర్గుణాకారంగా పూజించవచ్చు. సగుణ నిర్గుణాకారాల్లో రెండూ వేరు వేరుగా కనపడినా, చిన్మయ దృష్టితో తన్మరుూభావంతో తరచి తరచి భావన చేస్తే, రెండింటిలోనూ ఒకే సత్యం దర్శనమిస్తుంది. ఆ ఆనందమయ, పరమానందమయ సత్యమే ‘శ్రీ లలితా పరమేశ్వరి’. ఆ దేవియే శ్రీలలిత త్రిపురసుందరి.ఆమె జగన్మాత. అఖిలురకు తల్లి. చరాచర వస్తుజాలమంతా ఆ తల్లి సృష్టిలోనిదే.
శోభ, విలాసము, గాంభీర్యము, లాలిత్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, ఔదార్యము, సౌకుమార్యము- అన్నీ ఒక రాశిగా పోస్తే- లలితా పరమేశ్వరీ రూపం. భవ భయ బాధలను తొలగించి, భవాన్ని విభవంగా రూపుదిద్దగల మహాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి. అందుకే భక్తులు ఆ ‘శక్తి’ని అనే్వషిస్తూ వెడతారు. జగన్మాత అనుగ్రహాన్ని పొంది, కుండలినీయోగ శక్తితో యోగ సమాధిలో అమృతతత్త్వాన్ని పొందుతారు.శ్రీలలితా పరమేశ్వరీ దేవికి సంబంధించిన విషయమలు బ్రహ్మాండ పురాణంలో, లలిత లలిత పదములతో వివరింపబడినాయి.
జగన్మాత ప్రాభవాన్ని, ప్రాదుర్భావాన్ని చెప్పి, హయగ్రీవుడు అగస్త్య మహర్షి కోరికపై లలితా నామాలను చెప్పాడు. అదే లలితా సహస్రం. అంతేకాదు, వాటిని రహస్య నామ సహస్రం అన్నాడు. దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో కూడా ‘రహస్య యోగిని, పరాపర రహస్య యోగిని..’ అని చెప్పబడింది. అంటే, ప్రతి ఒక్క నామాన్ని భక్తితో భావన చేస్తూ నామ సంకీర్తనం చేస్తే తల్లి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. రహస్యం తెలియకపోయినా, లలితాంబను ప్రతి పదంలో భావిస్తూ నామపారాయణ చేస్తే సంతుష్టురాలై మనసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది.

- చివుకుల రామ మోహన్