Others

పాతివ్రత్యానికి నిలువెత్తు సాక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ప్రాచీన సంస్కృతికి, హైందవ సనాతన సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి, ప్రధానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రైమూర్త్య నిలయమై, వరదాయినియై, భక్తి ముక్తి ప్రదాయినియై, పరమ పావనియైన పవిత్ర గోదావరినదీ తీరాన వెలసి, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుని, హిందూ ముస్లిం మత సామరస్యానికి అనాదిగా ప్రతీకగా, దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా రాష్ట్రంలో వాసికెక్కి, నిత్య భక్త జన సందడితో, నిరంతర దైవనామ స్మరణలతో విరాజిల్లుతున్న పవిత్ర తీర్థం - ప్రాచీన ధర్మపురి పుణ్య క్షేత్రం. రాష్ట్రంలోనే గాక, వేరెచ్చటనూ లేని విధంగా, ఈక్షేత్రంలోగల దేవాలయాలు, ఒక్కొక్కటి ప్రత్యేక ప్రతిపత్తిని, ప్రత్యేకతను, వైశిష్ట్యాన్ని కలిగియుండడం విశేషం. అలాంటి ఆలయాలలో అత్యంత వైశిష్ట్యాన్ని సంతరించుకుని, పౌరాణిక, చారిత్రక నేపథ్యాన్ని కలిగిన పతివ్రతా శిరోమణి అయిన సత్యవతీ దేవి ఆలయం, ఆ సాధ్వీమణి పాతివ్రత్యానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలిచిన సైకత (ఇసుక) స్థంభం, దేశంలో వేరెక్కడా లేని విధంగా శివ పానవట్టంమీద నారసింహ విగ్రహం కలిగి శివకేశవాద్వైత సాంప్రదాయానికి ప్రతీకయైన అరుదైన విగ్రహాలు ఉన్నాయి. ఒకనాడు మహోజ్వలంగా వెలుగొంది, సనాతన హిందూ స్ర్తిల ధర్మాచరణ సాంప్రదాయంలో భాగంగా, నారీలోకానికి ఆదర్శమూర్తిగా నిత్య పూజలనందుకున్న సత్యవతీదేవి, ఆదరణ కరువై, నిర్లక్ష్యానికి గురవుతున్నది.
వేదవ్యాస విరచితంగా భావించబడే బ్రహ్మాండ, స్కాందాది పురాణాంతర్గతమైన ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం గ్రంథంలో సత్యవతీదేవి పాతివ్రత్య వృత్తాంతం వర్ణించబడింది. నైమిశారణ్యంలో, శౌనకాది మహర్షులకు, సూత పౌరాణికుడు వివరించిన ప్రకారం, నారద మహర్షి పృథుచక్రవర్తికి చెప్పిన విధంగా, పూర్వము సింధు దేశమును పాలించిన వీరసేనుడను రాజు ఆఙ్ఞ ప్రకారం, జయుడను ఆయన పురోహితుడు, యుక్త వయస్కురాలైన రాకుమారికి, సర్వలక్షణ సమన్వితుడైన రాకుమారుని వరునిగా చేయ సంకల్పించి, ఎన్నో దేశాలు తిరిగి చిత్ర పటములు తెచ్చినా, ఆమె మెచ్చకుండిన కారణంగా విసుగుచెంది, మంత్రోపాయముచేత ఒక సర్పమున బంధించి తెచ్చి, పేటికయందుంచి, కులాచార ప్రకారం, వరుని చూడకయే యుక్త సమయమున వివాహమాడమని చెప్పి, దేశము వదలి వెడలిపోయెను.
- ఇంకాఉంది

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494