Others

దేశ ప్రజలారా! ఆలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనసంఘ్ 1952లో పుట్టింది. శ్యామప్రసాద్ ముఖర్జీ పార్టీ అధ్యక్షుడు. పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉండేవి. అందులో ఒకటి భూస్వాముల కాంగ్రెసు పార్టీ. 1955లో మొదటిసారి భారతీయ జనసంఘ్ ఐదు సీట్లల్లో పోటీచేసి ఐదు చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది. ఇది 2019వ సంవత్సరం. కాలగర్భంలో డెబ్బది సంవత్సరాలు గడిచిపోయాయి. ఐనా పార్టీ పరిస్థితిలో మార్పురాలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ తరఫున పోటీచేసేందుకు అభ్యర్థులు కరువైనారు. ఎందుకని? కాస్త స్థిమితంగా పార్టీ అధినాయకత్వం కూర్చొని ఆలోచించిందా?
ఆంధ్రలో కమ్మ, రెడ్డి కాపు రాజకీయాలు తెలంగాణా రెడ్డి-వెలమ కుల రాజకీయాలు ప్రాంతీయ భావనలు రాజకీయాలు గెలుపు ఓటములను శాసిస్తున్నాయి. భారత్ మాతాకీ జై అనడానికి గొంతు కోసినా నేను ఇష్టపడను అనిన అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)తో పొత్తు పెట్టుకోవడానికి అంత ఉవ్విళ్లూరుతున్నారు. ఎందుకని?
భారతీయ జనతా పార్టీ చేసిన తపస్సు మొత్తం ఏమయినట్లు?
రిపబ్లిక్ సి(్ఛనల్) నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలుచుకోవటం కష్టం అని తేల్చారు. అలాగే మరొక జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్లమెంటు సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. ఈ దుస్థితి ఎందుకొచ్చింది?
లోగడ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ గౌరవనీయులైన ఒసామాబిన్ లాడెన్‌గారు గౌరవనీయులైన హఫీజ్ సయ్యద్ సాబ్‌గారు అనటం గుర్తుందా? అమెరికాలోని ఎంపైర్ ఎస్టేట్ విధ్వంసానికి కారకుడైన ఒసామా బిన్‌లాడెన్‌ను ఆనాటి అమెరికా ప్రభుత్వం వెంటాడి వేటాడి చంపి శవాన్ని సముద్రంలో పడేసింది. ఇక బొంబాయి బాంబు ప్రేలుళ్లలో వందలాది అమాయకులను పొట్టనపెట్టుకున్నవాడు హఫీజ్ సయ్యద్. ఆనాడు సైన్యం ప్రతీకార చర్యకు సిద్ధపడితే అలాంటిదేమీ జరుగకూడదు అంటూ ఆనాటి కాంగ్రెసు ప్రభుత్వం ఆపివేసింది. 11 మార్చి సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గౌరవనీయులైన మసూద్ అజర్‌జీ అన్నాడు. పుల్వామాలో 45 మంది సి.ఆర్.పి.ఎఫ్. జవాన్లను ఆత్మాహుతి దాడితో హతమార్చిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్. ఇతడు గౌరవనీయుడు ఎలా అయినాడు? వీరజవాన్ల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. రాహుల్‌గాంధీ మాత్రం మసూద్ అజర్‌గారు బుద్ధిమంతుడు అంటున్నాడు. మరి బీజేపీ ప్రభుత్వం దేశద్రోహ చట్టం ఎందుకు ఉపయోగించలేదు? రంజాన్ మధ్యలో ఎలక్షన్లు పెడతారా? అని మమతా బెనర్జీ అల్లరి మొదలుపెట్టింది. రంజాన్ నెల రోజులా ముస్లిములు ఆఫీసులకు, కర్మాగారాలకు వెళ్లడం లేదా? అలాంటప్పుడు పోలింగ్ బూత్‌కు ఒక్క సెలవు రోజు వెళ్లడానికి ఏమి అభ్యంతరం? బెంగాల్‌లో 5 ముస్లిం మెజారిటీ పార్లమెంటు నియోజకవర్గాల వారు మరొక పది నియోజకవర్గాల్లో, ముస్లిం ఓట్లు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. వీటి కోసమే లోగడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆశపడుతున్నాయి. వీరికి దేశ శ్రేయస్సు పట్టదు. ఓట్లు వేయించుకొని అధికారం చేజిక్కించుకోవాలన్నదే ఏకైక తపన.
***
జయసుధ ప్రముఖ సినీ నటి.
చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంది.
సికిందరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎం.ఎల్.ఎ. గా విజయం సాధించింది.
ఈమె క్రైస్తవ మతం పుచ్చుకుంది.
అందువలన లోగడ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారికి ఆదర పాత్రమయింది.
ఇప్పుడు ఆమె జగన్ పార్టీలో చేరింది.
ఇది వ్యూహాత్మకమే.
జగన్‌రెడ్డి అధికారంలోకి రాగలడని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆలీ అనే మరో సినీ నటుడు ఈ పార్టీలోనే చేరాడు.
ఇంకా తెలుగుదేశం సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైకాపాలో చేరటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
ఎన్నికల ముందు ఇలాంటివి మామూలే అని సర్దిచెప్పుకోవాలి. శ్రీమతి సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిణిగా పనిచేశారు. ఆమె టిఆర్‌ఎస్‌లో చేరటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్. ఇలా ఎందుకు జరిగింది? ఐతే ఈమెకు మంత్రి పదవి ఇచ్చేందుకు కె.సి.ఆర్. ఇష్టపడటం లేదు. అందుకని ఆమె మనసు మార్చుకుందా? తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమ, సోదరుడు చంద్రశేఖర్ జగన్ పార్టీలో చేరి తనను తాను ‘విభీషణుడ’’నని వర్ణించుకోవటం సంచలనాన్ని సృష్టించింది. తప్పంతా టి.ఆర్.ఎస్.దే అనలేము. చేర్చుకునే వారితోబాటు చేరేవారు కూడా ప్రజాస్వామ్య సూత్రాలను పాటించటం లేదు. అత్తకోడలికి నీతుల చెప్పి తాను తెడ్డునాకిందని తెలుగు సామెత. కమ్యూనిస్టు సిద్ధాంతకర్త నోముల నరసింహయ్య సి.పి.యం. వదిలిపెట్టి ఎందుకో టి.ఆర్.ఎస్.లోకి చేరినట్లు? వార్ధక్య లక్షణమా? తెలుగునాట భక్తిరసం తెప్పలుగా మారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది అని కవిత్వాలు వ్రాసిన కామ్రేడ్ గజ్జల మల్లారెడ్డి స్వామి వివేకానందుని యతి గీతం గుండెలమీద పెట్టుకొని కన్నుమూశాడు. ఈ పరిణామానికి కారణం ఏమిటి? రాజకీయంగా మునిగే పడవలో ఎవరూ ఉండరు. బయటకు దూకి ప్రాణరక్షణ చేసుకుంటారు.
***
అయోధ్యలో రామాలయ నిర్మాణం నిమిత్తం సుప్రీంకోర్టు త్రిసభ్య సలహా సంఘాన్ని నిర్ణయించింది. ఇది సమస్య పరిష్కారానికి ముందడుగు అన్నారు. ఐతే ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధిపతి శ్రీశ్రీ రవిశంకర్ హిందూవాది కాబట్టి ఆయన ఈ త్రిసభ్య సంఘంలో ఉండటం అభ్యంతరకరం అని బహిరంగంగానే ప్రకటించారు.
ఇక్కడ మనం గమనింపవలసిన ముఖ్యాంశాలు కొన్ని ఉన్నాయి.
1) అయోధ్యలో రాముడు పుట్టాడు ఈ విషయం వాల్మీకికి తెలుసు. ఔననీ కాదనీ చెప్పే అధికారం ఒవైసీకీ కమ్యూనిస్టులకూ లేదు. ఇది ఇతిహాసం- ఇదే విశ్వాసం ఏసుప్రభువు బెత్లేహేంలో పుట్టాడో లేదో ఈ పోపుగారు చూచి వచ్చారా? లేదు. ఐనా బైబిల్ ఉంది కాబట్టి నమ్ముతున్నాము.
2) బాబరు సమర్‌ఖండ్ నుండి వచ్చిన దురాక్రమణదారుడు. అతనికి అయోధ్య మీద ఏం అధికారం ఉంది? హిందువులు అనుమతిస్తే అక్కడ అయోధ్యకు దూరంగా ముస్లిములు ఒక మసీదు కట్టుకోవచ్చు.
3) వివాద రహిత స్థలం కొంత ఉంది. దానిలో నిర్మాణం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఎందుకు ఇప్పటి వరకు యత్నించలేదు?
4) కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆర్డినెన్సు తీసుకురాలేదు? అశోక్‌సింఘాల్ వంటి వారి ఆత్మ ఇంకా క్షోభిస్తూనేఉంది. ఇది ధార్మిక సమస్యయే కాని భూవివాదం (లాండ్ డెస్‌ప్యూట్) కాదు.
***
కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మార్చి 12 నాడు న్యూఢిల్లీలో మాట్లాడుతూ ‘‘బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ హెడ్ ఆఫీసుపై దాడిచేయటం ద్వారా ఉగ్రవాద మూలాలను ధ్వంసం చేయగలిగాము’’ అన్నారు. ఇది అర్ధ సత్యం. ఎందుకంటే హఫీజ్ సయ్యద్ దావూద్ ఇబ్రహీం, మసూద్ అజర్ ముష్కరుడు. ముషారఫ్ వంటివారు పాకిస్తాన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికి అమెరికానుండి ఫాల్కన్- 16 యుద్ధవిమానాలు చైనా నుండి యురేనియం అందుతున్నాయి. కేరళలోని మలప్పురాలో సిమి-ఐసిస్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి అత్యుగ్ర సంస్థలు తమ రిక్రూట్‌మెంటు సెంటర్లను తెరిచాయి. ఇక్కడి కార్యకర్తలు కొలంబో మీదుగా సిరియా ఇరాక్‌లు చేరుతున్నారు. ఆక్రమిత కాశ్మీరులో 200 ఉగ్రవాద మదర్‌సాలు సక్రియగా ఉన్నాయి. హిజుబుల్ ముహాయుద్ధాన్ వంటి 40 సంస్థలు వాహిబ్ జీహాదీ యిజం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మహబూబా ముఫ్తి, మమతాబెనర్జీ, మణిశంకర్ అయ్యర్, పినరాయ్ విజయన్‌లు ఈ ఉగ్రవాద సంస్థలకు బహిరంగంగా మద్దతును అందిస్తున్నారు. అలాంటప్పుడు అరుణ్‌జైట్లీ ఉగ్రవాద మూలాలను పెకిలించి వేశాము’ అని చెప్పుకోవటం అతిశయోక్తి అవుతుంది. దేశ విభజన జరిగిన డెబ్బది సంవత్సరాల తర్వాత కూడా ఆలిగఢ్ ముస్లిం యూనివర్సిటీ కోర్టు హాల్‌లో మహమ్మదాలీ జిన్నా ఫొటో అలాగే ఉంది. దానిని తొలగించడానికి యూనివర్సిటీ అధికారులు అంగీకరించటం లేదు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్