Others

ప్రచారం అక్కర్లేదు! (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గొప్ప ధనవంతుడు చివరి రోజుల్లో చాలా నిరాశతో ఉండేవాడు.అనేక విజయాలు సాధించినతరువాత సహజంగా నిరాశే మిగులుతుంది. ఎందుకంటే, విజయం ఓడినంతగా ఏదీ ఓడిపోదు. మీరు ఓడినపుడే విజయానికి ప్రాముఖ్యత లభిస్తుంది. అయితే విజయం సాధించిన తరువాత ఈ ప్రపంచం, సమాజం, మనుషువల్ల మీరుఎలా మోసపోయారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అందుకే దానికోసం ఆరాటపడడం ప్రారంభించాడు. అమెరికాలో జరుగుతున్నది అదే.
మనశ్శాంతికోసం ఆరాటపడే మనుషులు అమెరికాలో ఉన్నంతగా ఎక్కడా ఉండరు. మనశ్శాంతి కోవసం అంతగా ఆరాటపడే మనిషి భారతదేశంలో నాకు ఎక్కడా కనిపించలేదు. ముందు కడుపు కాలకుండా చూసుకోవాలి.తరువాతమనశ్శాంతి గురించిఆలోచించవచ్చు. ఎందుకంటే, అది కడుపు మంటకు అనేక లక్షల మైళ్ళ దూరంలో ఉండే విషయం.
అయినా అమెరికలా మాత్రం అందరూ మనశ్శాంతి కోసం ఆరాటపడేవారే. ఒకవేళ నిజం మీరు మనశ్శాంతి కోసం ఆరాటపడుతున్నట్లయితే దానిని ఎలా సాధించాలో చెప్పేందుకు అనేకమంది సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే, ఎక్కడ గిరాకీ ఉంటుందో అక్కడ సరఫరా ఉంటుంది. ఇది సాధారణ ఆర్థిక సూత్రం. ఇది తెలిసిన తెలివైన మోసగాళ్ళు ఒక అడుగు ముందుకేసి ‘‘గిరాకీ వచ్చేవరకు నిరీక్షించవలసిన పనిలేదు. దానిని మనమే సృష్టిద్దాం’’ అంటారు. కాబట్టి, గిరాకీని సృష్టించడమే ప్రకటన పరమార్థం. అది రానంతవరకు ఆ వస్తువు చాలా అవసరమని మీకు ఏ మాత్రం తెలియదు. కానీ, అది వచ్చిన వెంటనే ‘‘అరె, ఇంతవరకు అది ఉన్నట్లే తెలియదు’’ అని మీకు అనిపిస్తుంది. అందుకే రెండు, మూడేళ్ళ తరువాత వచ్చే వస్తువు గురించి ఇపుడే ప్రచారాన్నిప్రారంభించి, దాని వివరాలను మీ మనసులో నింపేసి, అది వచ్చేలోగా దానికి కావలసిన గిరాకీని సృష్టిస్తారు. ఎందుకంటే, అలాంటి వస్తువు ఇంతవరకు విపణిలోలేదు కాబట్టి. అయితే, మీకు సరఫరా అయిన దాని నుంచి మీకు లభిస్తున్నది ఏమిటని ఎవరైనా పట్టించుకున్నరా లేదా అనేది ముఖ్యం కానీ, మీరుకోరుకున్నది నిజంగా మీకు అవసరమా కాదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఒకవేళ అది నకిలీ ప్రకటనలో, ప్రచారమో కావచ్చు లేదా అందులో ఎంతో కొంత వాస్తవం ఉండవచ్చు.
తన తొలి పుస్తకాన్ని తానే ప్రచురించిన ‘‘బెర్నాడ్‌షా’’ దానికి మంచి గిరాకీని సృష్టించేందుకు పుస్తకాలు అమ్మే ప్రతి దుకాణానికి వెళ్ళి ‘బెర్నాడ్‌షా రాసిన పుస్తకాలున్నాయా?’అని అడిగేవాడు. వెంటనే వారు ‘‘లేవు. ఇంతవరకు ఆయన పేరు మేము ఎప్పుడూ వినలేదు’’అనేవారు.
‘‘అంత గొప్ప రచయిత పుస్తకాలు మీదగ్గర లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. వెంటనే ఆయన పుస్తకాలు తెప్పించండి. రెండురోజుల తరువాత వస్తా’’అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అలా కేవలం పుస్తక దుకాణాలకు మాత్రమేకాకుండా, అనేక గ్రంథాలయాలకు, సాహిత్యాభిరుచి ఉన్న సంఘాలకు వెళ్ళి ప్రచారంచేశాడు. తాను రాసినది ఒక్క పుస్తకమే అయినా రకరకాల వేషాలతో అనేక పుస్తకాలు రాసిన రచయితగా ప్రచారం చేసుకుని, తన తొలి పుస్తకానికి చక్కని గిరాకీని సృష్టించుకున్నాడు ‘‘బెర్నాడ్‌షా’’. ఆ పుస్తకం అందరికీ నచ్చడంతో ఆయనకు గొప్ప రచయితగా పేరువచ్చింది.
విజయాన్ని సాధించినప్పుడు మనశ్శాంతికి గిరాకీ సృష్టించవలసిన అవసరముండదు. ఎందుకంటే, విజయం సాధించగానే మీరు మనశ్శాంతిని కోల్పోతారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.