Others

స్వార్థ రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం దాదాపు వేయి సంవత్సరాలు విదేశీయులైన విజాతీయుల పాలనలో మ్రగ్గినది. సామాజికంగా, సంస్కృతిపరంగా, ఆధ్యాత్మిక పరంగా, భాషాపరంగా, సాహిత్యపరంగా సనాతనమైన భారతీయతను విదేశీ పాలకులు అస్తవ్యస్తం చేసినారు. అఖండ భారతంలోని అనేక భూభాగాలు విజాతీయ భూభాగాలుగా మారినవి. మిగిలిన ఖండిత భారతదేశం 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికపై పాకిస్తాన్, హిందూస్తాన్‌లుగా రెండు ముక్కలుగా చీల్చబడినది. ‘లడ్‌కే లియే పాకిస్తాన్’ ‘హస్తే లేంగే హిందుస్తాన్’ అని ఆనాడు పాకిస్తాన్ ఆవిర్భావానికి కారకుడైన మహ్మద్ అలీ జిన్నా పేర్కొన్నాడు. జిన్నా మాటల కొనసాగింపుగానే విడిపోయిన పాకిస్తాన్‌లోని మైనారిటీలు అక్కడే ఉండవచ్చు. హిందుస్తాన్‌లోని ఇస్లాం మతస్తులు హిందుస్తాన్‌లోనే ఉండవచ్చని ఆయా దేశాలలోని మైనారిటీలకు ఆయా దేశాల ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సి ఉంటుందని ఆనాటి మన పెద్దమనుషులు భారతదేశంలోని హిందువులను తడిగుడ్డతో గొంతు కోసినారు.
విడిపోయిన పాకిస్తాన్‌లో మైనారిటీలు ఆనాడు 22%, బంగ్లాదేశ్ ప్రాం తంలో మైనారిటీలు 28% ఉండగా ఈనాడు వారి సంఖ్య 2%, 8%గా దిగజారింది. ఆనాటి భారతదేశంలో ముస్లింలు 7% ఉండగా ఈనాడు 18%గా వృద్ధి చెందినారు. ఈ తేడా 70 సంవత్సరాలుగా పాలిస్తున్న మన పాలకులకు ఎంతమాత్రం పట్టదు. ప్రజలకు సైతం చీమకుట్టినట్లుగా కూడా అనిపించదు. భారతదేశంలో మాకు రక్షణలేదని కోట్లు గడించి ఉన్నత స్థానాలను అధిరోహించి, గౌరవాన్ని పొందుతూ సుఖమైన జీవనాన్ని గడుపుతున్న ముస్లిం పెద్దమనుషులు కొందరు వాపోతుంటారు. దేశంలో పెరుగుతున్న ఇస్లాం మతస్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొనే- ‘15 నిమిషాలు సైన్యం పక్కకు తప్పుకుంటే హిందువులను లేకుండా చేస్తాన’ని శాసనసభ్యుడుగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ హూంకరించినాడు. అక్బరుద్దీన్ హూంకారం ఫలితం అన్నట్టుగా ఇటీవల తెరాసకు చెందిన మహ్మద్ అలీ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కాగలిగాడు.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలుండగా, తమ పార్టీ అభ్యర్థులను 16 చోట్ల గెలిపించాలని తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కోరుతున్నాడు. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ హిందుగాండ్లు, బొందుగాండ్లు, ఈ దిక్కుమాలిన దరిద్రంగాండ్ల చేతిలోపడి మన దేశం విలవిలలాడుతోందన్నాడు. ఇది 100 కోట్ల హిందువులను అవమానించడం కాదా? దీని ద్వారా చంద్రశేఖర్‌రావు నిజస్వరూపం బయటపడింది. ముస్లింల ఓట్ల కోసం హిందువులను అవమానపరచడం, కులాల పేర్లతో గొఱ్ఱెలు, బఱ్ఱెలు, చేపలు ఇస్తామంటే వారే ఓట్లువేస్తారనే ధీమాతో హిందువులను దూషిస్తాడా? అంటే దొరలు మాత్రమే పరిపాలకులుగాను, అణగారినవారు మాత్రం గొఱ్ఱెలు, బఱ్ఱెలు కాచుకోడానికే పరిమితం కావాలా? తెలంగాణ హిందూ ప్రజలారా.. ఆలోచించండి..!
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య పాలన పేరుతో రాజరికమైన నిజాం పాలన- దొరల పాలన- అంటే రెండు కుటుంబాల పాలనను నేడు చవిచూడాల్సి వస్తోందని తెలుసుకోవాలి, జాగ్రత్తపడాలి. లేకుంటే రజాకార్ల కాలం నాటి బతుకమ్మలనాడాల్సి వస్తుంది మన తల్లులు, అక్కలు, చెల్లెండ్లు, బిడ్డలు. ఒక ఎంపీ సీటును మజ్లిస్‌కు అప్పగించి, ముఖ్యమంత్రి కేసీఆర్ 16 ఎంపీలను గెలిపించినా ఏమి చేయగలడు? 272 ఎంపీల మెడలొంచుతాం, నిధులను వరదల్లా పారిస్తామనడం విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద సినిమాలోని డైలాగ్‌లా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి బిజెపి పక్షాన నిలబడిన వారిని గెలిపించి, కేంద్రంలో మరోసారి ఏర్పడబోయే నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భాగస్వామ్యం చేస్తే బంగారు తెలంగాణ కాదు దేశానికే తెలంగాణ రాష్ట్రం మణికిరీటంగా నిలుస్తుంది. దొరల పాలనకు చరమగీతం పాడినట్లవుతుంది.
1947లో దేశ విభజన జరిగిన కారణంగా పాకిస్తాన్‌కు 55కోట్లు ఇవ్వాలన్నది ఒప్పందం. కాని 1948లో భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌లో మూడవవంతు భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొంటే దాన్ని ప్రస్తావించకుండా పాకిస్తాన్‌కు ఇస్తామన్న 55 కోట్లు ఇవ్వాల్సిందేనని అలనాడు గాంధీజీ నిరాహార దీక్షకు సిద్ధమైనాడు. ఆయన మాటను గౌరవిస్తున్నట్లుగా పాకిస్తాన్ ఆక్రమించుకొన్న భూభాగాన్ని అడగకుండానే- 55 కోట్ల రూపాయలను ఆనాటి పెద్దమనుషులు పూలల్లో పెట్టి పాకిస్తాన్‌కు ధారాదత్తం చేసినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ కొమ్ముకాస్తూనే ఉన్నారు. దేశ ప్రజలను అవమానిస్తూనే ఉన్నారు.
1962 నాటి యుద్ధంలో చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తే పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత ‘చైనా మన భూభాగాన్ని ఎంత ఆక్రమించుకొన్నదన్న’ ప్రశ్నకు ఆనాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ చైనా ఆక్రమించుకొన్న భూభాగంలో గడ్డికూడా మొలవదు పోతే పోనీలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినాడు. ‘డోక్లామ్’లో 76రోజులు చైనా సైన్యంతో పోరాడిన భారత సైన్యం ఒక్క తూటా పేల్చకుండా, రక్తం బొట్టు చిందకుండా, ప్రాణనష్టం జరుగకుండా భారత గడ్డపై బ్రొటనవ్రేలు కూడా పెట్టనీయలేదు. భారత సైనికులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛా స్థైర్యాలు ఇందుకు కారణాలు.
మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే యత్నంలో- 15 దేశాలలో 14 దేశాల మద్దతు కూడగట్టిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యనీతిని గుర్తించకుండా చైనా అధ్యక్షుడిని చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసమర్థ, అపరిపక్వత రాజకీయ నాయకుడని ప్రజలు గుర్తించారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదుల తండాలను సర్జికల్ స్ట్రైక్ ద్వారా మన సైనికులు మట్టుబెట్టినారు. పుల్వామా జిల్లాలో సైనికులపై దాడిచేసి 40మంది ప్రాణాలను బలిగొన్న అనంతరం, తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైనికులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి బదులు- సర్జికల్ స్ట్రయిక్ గురించి సాక్ష్యాలు చూపించగలరా? అని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు పాకిస్తాన్ తీవ్రవాదుల పక్షాన మాట్లాడడం దారుణం. సైనికులను, దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను అపహాస్యం చేస్తున్న వీరి చర్యలను భారత ప్రజలు అసహ్యించుకొంటున్నారు.
జాతీయ నిష్ఠ, దేశశ్రేయస్సు, ప్రజాసంక్షేమం కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకొని సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీయే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేదే దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి ప్రధానమంత్రిని కాంగ్రెస్ నాయకులు బరితెగించి- మసూద్ అజార్, ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, ఐఎస్‌ఐ అంటూ తీవ్రవాదులతో పోల్చడం 130 కోట్ల భారత ప్రజలను అవమానపర్చడమే. దీన్ని కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతిగా దేశ ప్రజలు గుర్తించినారు. కాంగ్రెస్ నాయకులు నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో చేస్తున్న దాడికి ఓ వైపుపాకిస్తాన్ సంబరపడుతోంది. ఇది చూసి కాంగ్రెస్ వారు పైశాచికానందం పొందుతున్నారు. కాంగ్రెస్ నాయకులు దేశ గౌరవాన్ని, మర్యాదను ఏనాడు గుర్తించిన వారు కాదు.
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం చేసి పాకిస్తాన్ భూభాగాన్ని విభజించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అపర కాళికగా కీర్తి పొందారు. భారత సైనికుల చేతిలో బందీలుగాచిక్కిన తొంభైవేల మంది పాకిస్తాన్ సైనికులకు 30 రోజులు రాచమర్యాదలు చేసి ఆ దేశానికి తిరిగి అప్పగించారు. కానీ, పాకిస్తాన్ సైనికుల చేతిలో బందీలైన 54 మంది భారత సైనికులను విడిపించలేదు. వారి జాడ ఈనాటికి కూడా తెలియరాలేదు. దేశ ప్రజలు ఈ విషయం గుర్తించాలి.
పాకిస్తాన్ భూభాగాన్ని ముక్కలు చేయగల సమర్ధ నాయకురాలు ఇందిరాగాంధీ- పాకిస్తాన్ ఆక్రమించుకొన్న కశ్మీర్ భూభాగాన్ని మాత్రం తిరిగి పొందాలన్న ఆలోచన చేయకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటన్నది భారత ప్రజలకు ఈనాటికి శేషప్రశ్నగానే మిగిలింది.
ఫ్రెంచ్ జ్యోతిష శాస్తవ్రేత్త నాస్ట్రోడ్రామ్ భారతదేశానికి పునర్ వైభవం ప్రారంభమవుతుందని చెప్పినట్లు 2014నుండి జాతీయ నిష్ఠ, దేశభక్తి, ప్రజాక్షేమం, ధర్మబద్ధ జీవనం, కఠోర పరిశ్రమ చేయగల నరేంద్ర మోదీ ఈ దేశానికి అందిన నాయకుడు. ఆయనే మరోసారి ప్రధానమంత్రి కావాలన్నదే దేశప్రజల ఆకాంక్ష. ప్రపంచ దేశాధినేతల తలంపు ఇదే. ఇదే ఈశ్వరేచ్ఛ కావాలి.

-బలుసా జగతయ్య 90004 43379