Others

ఔషధమే కాదు అవినాభావమూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చేసుకొనే పండుగల్లో దాదాపుగా అన్ని పండుగలు ఏదో వృక్షంతో ముడిపడి ఉంటాయి. ఉగాది నాడు చేదు వృక్షం అనుకొనే వేప పూవును కూడా ఉపయోగిస్తాముకదా. దసరా దశ విధ విజయాలనిచ్చే పండుగ దసరా అని మనం జరుపుకునే దసరా నాడు కూడా జమ్మి చెట్లును పూజిస్తాం. కార్తికంలో ఉసరిచెట్లును పూజించడం తెలిసిందే. బతకమ్మ పండుగలో ప్రతి పూవును, ప్రతిరోజు దేవాలయాల్లో చేసే పుష్పయాగాల్లో పూవుల ప్రత్యేకత తెలసింది. వినాయక చవితినాడు అనేక రకాల పత్రాలతో పూజించమని చెప్పి ఈ లోకంలో ఉన్న ప్రతిచెట్లు వైద్యానికి ఉపయోగపడేదే. మనిషి మనుగడకు అవసరమైనదే అని చెప్పక చెప్పారు.అందుకే అధర్వణ వేదంలోని శాంతి మంత్రం ‘వనస్పతయః శాంతి’ అని అనమని చెబుతుంది. ఈజగత్తుకు కారణమైన జగన్నాథుడు కూడా దారువురూపంలో జగన్నాథ స్వామిగా పూజలందుకుంటున్నాడు కదా.
ప్రళయకాలంలో అంతా నీరు నిండిపోయినా ఆ నీటి ఉపరితలంపై వటపత్రంలో శేషశాయి ఉన్నట్లు చెప్పేకథ విన్నపుడు అంతా ప్రళయకాలం వచ్చినా మఱ్ఱిచెట్టు ఉన్నట్టు ఆ చెట్టు ప్రతంపైనే పరమాత్మ పవళించినట్టు చెబుతున్నారు అంటే సృష్టి ఆవిర్భావ ఘట్టంలో వృక్షాల పాత్ర ఉన్నట్లే కదా.
రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు శక్త్యాయుధంతో మూర్ఛిల్లినపుడు జాంబవంతుడు హిమాలయాల్లో ఉన్న మృతసంజీవిని, వికల్యకరిణి, సంధాన కరిణి, సావర్ణ్య కరిణి అనే ఔషధులను తెమ్మని ఆంజనేయుణ్ణి పంపిస్తాడు. హనుమంతుడు తెచ్చిన ఔషధ చెట్లను ఉపయోగించి మూర్ఛిల్లిన లక్ష్మణుడు లేచి కూర్చుంటాడు. అంటే వానరులకుకూడా చెట్లల్లోని ఔషధగుణాలు తెలుసన్నమాటేగా. ఆవులు, బర్రెలు, మేకలు ఇలాంటి పెంపుడు జంతువులుకూడా కొన్ని సార్లు వాటికి వచ్చిన అజీర్ణం, నాలుక దురద లాంటి జబ్బులను పోగొట్టుకోవడానికి ఎవరూ చెప్పకుండానే కొన్ని రకాల ఆకులను తింటాయట. అపుడు ఆయా జబ్బులనుంచి అవి బయటపడుతాయి. ఈ సంగతి ఎందరో జానపదులు చెబుతుంటారు. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా వాటి వాటి మనుగడకు అవసరమైన జ్ఞానాన్ని కలిగే ఉంది.
వ్యవసాయదారుల్లో ఎంత నష్టం జరిగినా ఆఖరికి ప్రకృతి విలయతాండవం సృష్టించి తమ పండించుకున్న పంటనంతా నీటిపాలు చేసినా తనలో శక్తిని కోల్పోకుండా తిరిగి ఆహారోత్పాదనకు చెట్లనే నాటడానికి ఉద్యుక్తుడవుతాడుఅంటే అంతటి సంయమన శక్తి ని చెట్లు మనుష్యులో ప్రచోదితం చేస్తాయి. హత్యలు, అత్యాచారాలు చేసిన నేరగాళ్లను పచ్చని చెట్ల మధ్య నివసించేట్లు చేస్తే వారిలోని దుర్గణాలు దూరం అవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. ఈ దిశలో మన వైద్యులు పరిశోధనలకు పూనుకొంటున్నారు. పిల్లల్లో మేధోసంపత్తిని వృద్ధి చేయడానికి, సృజనాత్మక ఆలోచన్లు కలిగించడానికి కూడా చెట్లు దోహదపడుతాయి. దీనికోసమే పూర్వకాలంలో గురుకులాల్లో విద్యార్థులకు చెట్లు పెంచడం కూడా ఒక విధిగా ఉండేది. వారు చదువుకునే ప్రదేశాలు కూడా పచ్చని చెట్ల కిందే కదా. ఎన్నో పురాణ కథలు చెట్ల ప్రాధాన్యతను సంకేతాల ద్వారా చెబుతున్నాయి. ఒక సారి సురాసురల యుద్ధం జరిగినపుడు శివుడు బిల్వవృక్షంలోను, విష్ణువురావి వృక్షంలోను, సూర్య భగవానుడు వేపచెట్టులోను ఇంద్రుడు తామర తూడులోను దాక్కున్నారట. ఈ కథ ఈ చెట్ల ప్రాధాన్యాన్ని తెలుసుకోమని చెబుతోంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి