Others

జేగంట కొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. సర్వ సమానత్వ సాధనే లక్ష్యమై
మేల్కొల్పువాడవై మెఱయవలయు
అవినీతి మృగ్యమే యవని నీకర్తవ్య
మని యెంచి కడదాక మనగవలయు
ప్రేమామృతపు ధార ఁబృధ్విపై నిరతమ్ము
గురిపింప లోకులు మురియవలయు
తలలోని నాల్కవై మెలగుచు పదిమంది
కాదర్శమూర్తివై కదల వలయు

తే.గీ. భారమనుకోక నితరుల బాగు ఁగోరి
దేవునికి మారు మనుజల ఁదిరుగవలయు
జనుల నీరాజ నాలంది జగతి నిలచి
కొట్టవలె నీవు జేగంట కువలయాన!

తాత్పర్యం : సమానత్వ సాధనే లక్ష్యంగా జనజాగృతిని కోరేవాడివై ప్రకాశించాలి. అవినీతి నిర్మూలనే నీకర్తవ్యంగా కడదాకా జీవించాలి. నువ్వు కురిపించే ప్రేమామృత ధారలలో తడుస్తూ లోకులంతా మురిసిపోవాలి. అందరిలో తలలోని నాలుకవై మెలగుతూ ఆదర్శప్రాయునిగా కదలాలి. భారమనుకోక ఇతరుల మేలు కోరుకుంటూ దేవునికి మారుగా మనుషులలో తిరుగాడాలి. ప్రజల నీరాజనాలందుకుంటూ ఈ భూవలయంలో నువ్వు జేగొంట కొట్టాలి.

సీ. అన్నార్తులనుఁగని యన్నంబుఁమెట్టిన
భగవంతునకుఁ బెట్టు ఫలముగల్గు
మూగ జీవుల పట్ల రాగ రంజిత మొప్ప
వంశంబు వర్ధిల్లు పదితరాలు
దాన ధర్మాలను దండిగ ఁ జేసిన
జన్మ జన్మాలలో సౌఖ్యమబ్బు
గోమాతలకు సేవఁ గొలదియైనను ఁ జేయ ఁ
బ్కులంబుగఁ గల్గుఁ బుణ్య పలము

తే.గీ. మాటయే మంత్రమనియెంచి మసలవలయు
గౌరవం బిచ్చి పుచ్చుగల్గవలయు
గల్మషంబించుకైనను ఁ గలుగ రాదు
సత్ప్రవర్తన విడనాడి సాగరాదు !

తాత్పర్యం : ఆకలితో బాధపడేవారికి అన్నం పెటితే భగవంతునకి నివేదించిన ఫలితం కలుగుతుంది. మూగ జీవాలను ప్రేమగా చూస్త పదితరాలు వంశం వర్ధిల్లుతుంది. దానధర్మాలను విరివిగా చేసినచో జన్మ జన్మాలలో సుఖం అలవడుతుంది. గోసేవ కొద్దిగా చేసినా పుణ్యం పుష్కలంగా కలుగుతుంది. మాటే మహామంత్రమని గ్రహించి నడుచుకోవాలి. గౌరవన్నా ఇచ్చి పుచ్చుకోగల్గాలి. కల్మషభావాలను తావివ్వరాదు. సత్ప్రవర్తనను విడిచి పెట్టి నడుచుకోరాదు.

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262