Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచనం- పరీక్షగా చూశాడు హనుమ. చుట్టూ మగువలు! మధ్యన ఓ మన్మథాకారుడు! దేవతల చేత పరివేష్టితుడైన మహావిష్ణువులా వెలుగుల చిరునవ్వుల్ని చిందిస్తున్నాడు! ఆపై అతని వంక ఆరాధనాభావంతో చూస్తూ ఇలా అన్నాడు హనుమ.

హనుమ:
ఏమయ్యా! రామయ్యా! ఏమిటి ఈ తీరు?
నా రాముడు ఈ రామల నడుమ నుండుటేమి?

ఓంకారమ్మును బోలెడు నీ చేతను ధనువేదీ?
హ్రీంకారమ్మును చేసెడి కిరణమంటి శరమ్మేది?

అమ్మలకే అమ్మయన్న అమ్మ ఏది సీతమ్మ?
నీడవోలె నిన్నంటుకు తిరుగు లక్ష్మణుండేడి?

తల్లులేరి? తండ్రి ఏడి? తమ్ములెచటనున్నారు?
ఎయ్యది అయోధ్యానగరమ్మెచ్చట సింహాసనం?

అనుచుహనుమ
నలుదెసలను
వెదకసాగెనంత

శ్రీకృష్ణుడు:
శ్రీకృష్ణుడనేనిప్పుడు శ్రీరాముడ గాను
ద్వారకనేలెడి వాడను దారలోయి వీరలు

హనుమ:
వింటినయ్య! నా తండ్రీ! వింటలెన్నొ వింటిని!
నన్ను నేనె నమ్మనట్లు నా కన్నుల గంటిని!
నా రాముడె కృష్ణుడౌచు మరల అవతరించెనంట
అష్టగ్రహములే ఆతని అష్ట పత్నులైరంట

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087