Others

ఆమని శోభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిగురాకుల చెక్కిలి మీద
చిరుగాలి పెట్టెను ముద్దు

వగలొలికే పువ్వుల సొగసులు
చెలరేగెను తుమ్మెద తలపులు

కుసుమంపై వాలెను భ్రమరం
మధుజలమున చూసెను తన రూపం

సొగసరి పువ్వుల రేకులు
గడసరి తుమ్మెద రెక్కలు
చెట్టాపట్టాలేసినవి
వలపుల తలుపులు తీసినవి

తాకెను తుమ్మెద పెదవులు
కందెను పువ్వుల బుగ్గలు
విరిసెను మరుమల్లెలు
వెదజల్లెను నవ్వులు

వలపంతా తమ సొంతం
వనమంతా తన్మయత్వం
కోయిల కళ్లలో విరిసెను వసంతం
హాయిగ పాడెనె ఆమని గీతం

సాగించెను శుకపికాళి
జగమంతా వసంతకేళి

ధనమే జీవితమైన నరజాతి గుండెలో
చిగురించేనా ఆమని శోభలు
బతుకే పోరాటమైన నిరుపేద గుడిసెలో
రవళించేనా కోయిల గానం.

-చిరమన వెంకట రమణయ్య 9441380336