Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమ:
అమ్మా! నీవిటనుంటివె? నే గానకనుంటిని!
నీ బిడ్డను చూడకుండ నీ వెట్టుల నుంటివి!

అనుచునతడు సత్యభామ పదములపై బడెను
పిల్లడేడ్చినటులాతడు గొల్లుమంచు నేడ్చెను

తల్లి ఏడ్చె, పిల్లడేడ్చె- ఏడ్చినారు ఎల్లరు
రిక్కలె కన్నీళ్ళు నింపి వెక్కివెక్కి ఏడ్చెను

తల్లిని మరచిన వాడొక తనయుండెటులగును?
తనయుని మరచిన తల్లియు తల్లియెట్టులగును

అంతట ఆయమ్మలంత కరిగిపోయినారు
ఆ తల్లిని, ఆ తనయుని అనునయించినారు

పిదప హనుమ ఊరడిల్లి వారినెల్ల చూచెను
కరములు జోడించి వారి కుశలము లరసేను
వచనం: అపుడు హనుమ ఆనందానికి అవధుల్లేవు. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. ఆ దంపతుల్ని అభిషేకిస్తూనే ఉన్నాయి.
అప్పుడొక పడతి మబ్బుతునకలా కడవనిండా నీటిని తెచ్చి యిచ్చింది. వాళ్ళ కాళ్ళు కడగడానికి! మరో పడతుక ఒక అప్సరభామినిలా తాను కప్పుకున్న పైవస్త్రాన్ని అందించింది, సత్యాకృష్ణుల పాదాలనొత్తి తుడవడానికి. మరో పడతి తన పైట చెరగుతో వీవెన వీచసాగింది.
ఆనందబాష్పాలతో ఆ దంపతులు వాళ్ళని ఆశీర్వదించారు. ఆ తరువాత సేదదీరాక కొంత సేపటికి ఇలా అడిగాడు హనుమ
హనుమ:
ఎవరు పిలిచినారు నన్ను? ఏల పిలిచినారు?
ఏ రక్కసియైన మిమ్ము? ఏడ్పించెనొ తెలుపుడి!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087