Others

మసలుకో మనిషివోలె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తల్లిదండ్రుల యెడ దయలేని మనుగడ
మనుగడ కాదది మరణవౌను
అవ్వారి సేవయునావంత నెఱపక
బ్రతికెడి బ్రతుకది బ్రతుకుగాదు
వారి సేమము పట్ల బట్టనట్లుండిన
వారేల భూదేవి బాధనొందు
ప్రత్యక్ష దైవాలు వారల నివడచిన
జలనిధిలో జొచ్చి వారలనివిడిచిన

తే.గీ. అట్టి వారిని గణన సేయని తనయులు
సర్వనాశనమై పోదురుర్విలోన
నాశనము గొని దెచ్చుకున్నట్లు గాదె
పాపపంకిలమంటంగ వలదు సుమ్మి!

భావం: తల్లిదండ్రుల పట్ల దయలేని జీవితం మరణంతో సమానం. వారికి సేవచేయని బ్రతుకు బ్రతుకేకాదు. వారిక్షేమాన్ని పట్టించుకోని పుత్రులెందుకు ? అలాంటి వారిని మోయాల్సి వచ్చిందని భూదేవి బాధపడుతుంది. ప్రత్యక్షదైవాలైన తల్లిదండ్రులను లెక్కచేయనివారు తమ నాశనాన్ని తామే కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఇలాంటి పాపపంకిలం అంటకుండా అందరూ జాగ్రత్త పడాలి. అంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా సంరక్షించుకోవడం ప్రతివారు వారి వారి కర్తవ్యంగా భావించాలి..
ఆ.వె. తేనెలొలుకు నటుల దీయ తీయని పల్కు
చల్లనైన చూపుఁ జాలునయ్య
మంచితనము తోడ మనిన ఁ జాలయ వృద్ధు
లేమి కోరుకుందులేమి లేదు!

భావం: తీయ తీయని పలుకు మరియు చల్లని చూపు ఈ రెండింటితోపాటు మంచితనాన్ని ఆశిస్తారు. అంతకంటే వృద్ధులు కోరుకునేదేమీ లేదు.

ఆ.వె. ప్రేమ కలిపి ముద్ద పెట్టిన మురియుదు
రదియు కష్టమనక రంగరించి
భక్తినంత పుణ్య ఫలము గొలది కాదు
దేవతాళి యొసగు దీవెనలను!

భావం: ప్రేమతో పట్టెడన్నం పెడితే మురిసిపోతారు. అది కష్టమనుకోకుండా భక్తిని కూడా రంగరించి పెడితే కలిగే పుణ్యం ఇంతా అంతా కాదు. అలా చేసే సకల దేవతలు వచ్చి దీవిస్తారు.

తే.గీ. మనసు మార్గమ్ము ఁ దప్పించు మాట వినదు
మనల బలహీనపరచును మనసు కనగ
లోకుల ద్దాని వెంటను ఁ బోకనెఱిగి
మాట వినునట్లు మనసును మార్చవలయు

భావం: మనసు మహాప్రమాదకారి. మనల్ని పక్కతోవ పట్టిస్తుంది. బలహీనపరుస్తుంది. లోకులు దానివెంట పరుగులు తీయకుండా వాస్తవాన్ని గ్రహించి మన మాట వినేలా మనసును మార్చుకోగలగాలి.
తే.గీ. మనిషి మనిషిగా బ్రతికిన మాన్యుడగును
తెలివి పరునిగ మసలినఁ దేజుడగును
తిరిగి సేవయు ఁ జేయంగ దేవుడగును
సరకుఁ గొనకున్న జన్మ నిస్సారమగును

భావం: మనిషి మనిషితనంతో బ్రతికితే మహానుభావుడవుతాడు. తెలివి పరునిగా మసలుకుంటే తేజో వంతుడవుతాడు. సేవాభావంతో సమాజంలో తిరిగితే దేవుడవుతాడు. ఇవేవీ లెక్క చేయకుంటే మనుజ జన్మ సారవిహీనమవుతుంది.

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262