Others

వందే గోస్వామి కోకిలమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ హనుమాన జ్ఞాన గుణసాగర... హనుమాన్ చాలీసా ప్రతిరామ మందిరంలోను హనుమద్దేవాలయంలోను ప్రతిదినం వినిపిస్తుంటుంది. ఈ హనుమాన్ చాలీసా, రామచరిత్ర మాసన్ ను , తులసీ మంజరీ రచించిన తులసీ దాసు గురించి తెలుసుకుందాం.
శ్రీ రామ చరిత్ర అమోఘము. అదే విధంగా శ్రీరామ భక్తుల చరిత్రలు కూడా ఆచంద్రార్కము నిలిచి ఉంటా య. వాల్మీకి మహాముని రచించిన రామాయణ గాధ ఎంత మాధుర్యమో ఆతరువాత వచ్చిన రామాయణ గాథలు అంత ప్రాచుర్యం పొందాయి.
ముఖ్యంగా ఉత్తర హిందూదేశంలో తులసీదాసు శ్రీరామ భక్తాగ్రేసరుడు. ఆత్మారాందుబే హులసీ అను దంపతులకు క్రీ.శ. 1493లో జన్మించాడు. ఇతను పుట్టినపుడు ఏడవలేదట. రామనామం అతని నోటివెంట వెలువడిందట. పుట్టిన నక్షత్రం మంచిది కాదని పలువురు అంటే తల్లిదండ్రులు భయపడి తమ శిశువును ‘చునియా’ అనే దాసికి అప్పగించారట. ఈ దిగులుతో ఈ శిశువు తల్లిదండ్రులు గతించారట. చునియా దగ్గర ఐదేండ్ల వరకూ తులసీ దాసు కాలం గడిపాడు. ఆతరువాత ఆమె కూడా దివంగతురాలైంది. ఆ తరువాత రామశైలాశ్రమ నివాసి ఐన అనంతానందుని శిష్యుడు నరహరిదాసు ఈ బాలుని చూసి జాలితో పెంచి ‘రామబోలా’ అని పేరు పెట్టాడు. నరహరి దాసు పెంపకంలో రామబోలాకు రామకథా సాహిత్యం పై మంచి అభిరుచి కల్గింది. అభినివేశం ఏర్పడింది. ఏ పూర్వజన్మ సుకృతం చేతనో రామనామాంకితమైన తన జిహ్వాపై నిరంతరం సాగిపోతుండగా చారారోజుల పాటు రామాయణం పురాణంగా చెప్తూ రామ కథాకాలక్షేపం చేస్తున్న రామబోలా క్రమముగా తులసీదాసుగా కీర్తిప్రతిష్టలు సంపాదించారు. ఈ యువకుని చూసి ఇతని తెలివితేటలకు మురిసి ఒక సద్బ్రాహ్మణుడు తన కూతురినిచ్చి వివాహం జరిపించాడు. మొదట తులసీదాసుకు ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి కూతురి అందచందాలకు వ్యామోహం చెంది ఒక్క క్షణం కూడా ఆమెని వదలి ఉండని పరిస్థితి తులసీదాసుకు ఏర్పడింది. ఇది ఇలా ఉండగా ఒక సారి ఆయనకు చెప్పకుండా అన్నగారితో కలసి తులసీదాసు భార్య పుట్టింటికి వెల్లింది. ఆరాత్రే జోరున వాన కురుస్తోంది. కాళరాత్రిలో భార్యావ్యామోహంతో అత్తగారింటికి ఆ జోరువానలో కూడా అష్టకష్టాలు పడి చేరుకున్నాడు.. అపుడు జోరున వాన కనుక వారంతా ఇంటి తలుపులు మూసుకొని పరుండినారు. తలుపు తీసే పరిస్థితి తెలియక తులసీదాసు గోడలపై పొడవుగా వేలాడే దాన్ని చూసి అది తాడు అనుకొనిపామును పట్టుకుని తన భార్య ఉన్న గదిలోకి వెళ్లాడు. ఆమె తులసీదాసును చూసి ఇంత వర్షంలో ఎలా వచ్చారని అడిగితే ‘నిన్ను విడిచి ఉండలేక ఎద్దుకళేబరం సహాయంతో ఏటినీటిలో ఈదుకుంటూ ఈవలి గట్టుకు వచ్చాను. ఇక్కడ ఏదో తాడు వేలాడుతుంటే దాని పట్టుక వచ్చేశాను అని ఎంతో ప్రేమగా చెప్పాడు తులసీదాసు. కానీ ఆ భార్య మాత్రం ఒకనాటికి నశించిపోయే ఈ దేహంపైన ఇంతటి వ్యామోహం ఎందుకు? ఎప్పటికీ సదా శాశ్వతంగా నిలిచి ఉండే ఆ శ్రీరాముని పైన లవ లేశమైనా ఆ శ్రీరామ చంద్రునిపై ఉంటే జీవితం తరించేది గదా అని ఆమె తులసీ దాసును హెచ్చరించిందట. అంతే అప్పటినుంచి తులసీదాసు మనస్సు వికలం చెంది అశాశ్వతమైన వాటిని వదిలి నాకు జ్ఞానోపదేశం చేశావంటూ తన భార్య కాళ్లకు నమస్కరించి ఇంతటితో మన శారీరిక సంబంధం తెగి గురుశిష్య సంబంధం ఏర్పడింది. నేను ప్రయాగకు వెడుతున్నానని చెప్పి అక్కడ్నుంచి ఆరాత్రే ఆయన ప్రయాగకు బయలుదేరాడు. చిత్రకూటంలో ఒకసారి తులసీ దాసు కూర్చుని ఉండగా ఇద్దరు పిల్లలు ఆయన దగ్గరకు వచ్చి ‘తాతా! మాకు చందనం తీసి ఇస్తారా?’ అని అడిగారట. తులసీదాసు వారిద్దరూ రామ లక్ష్మణులను కొన్నాడు. అపుడే రామచిలుక కూడా అవును అని పలికిందట. హనుమంతుడే ఆ చిలక అనే రహస్యాన్ని తెలుసుకొని తులసీదాసు పరవశముతో మేను పులకరించి చందనం తీస్తున్న చెయ్యి అలా చందనం తీస్తూనే ఉండిపోయిందట. తులసీ దాసు భక్తి పారవశ్యమును గమనించి బాలక రూపంలో ఉన్నరామలక్ష్మణులు తులసీదాసు తీసిన గంధాన్ని తీసికొని వెళ్ళిపోయారట.
ఇలాంటి కథలు కథలు గురించి ఎన్నో పచారంలో ఉన్నాయి. సాధుహృదయడు ఈ తులసీడుతాను స్వయంగా దర్శించుకున్న తులసి దాసు సామాన్య ప్రజల హృదయంలో సీతారాములను ప్రవేశ పెట్టాలని అనుకొన్నారు భక్తి అనే చెట్టుపైన కూర్చుని సీతారామ సీతారామ అని పంచమమస్వరంతో మధుర గీతాలను వినిపింప చేసిన ఆ తులసీదాసు అనే కోకిలకు సర్వదా వందనం చేద్దాం.

-కొలనుపాక మురళీధరరావు 9247159203