Others

సమదృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా సమానం అని అందరూ చెబుతుంటారు. సమదృష్టిని కలిగి ఉండాలి అంటారు. అంతా సమానమైనపుడు దృష్టి మళ్లా సమంగా ఉండాలని ఎందుకంటారు? అక్కడే అసలైన విషయం ఉందన్నమాట. మనుషులందరూ సమానమైనా వారి వారి పూర్వజన్మలను బట్టి కొందరు ధనవంతులు, మరికొందరు దారిద్య్రావస్థలో మునిగివారు, మరికొందరు పెద్ద ఉద్యోగస్తులు, మరికొందరు నిరుద్యోగులు, ఇంకొందరు అటు తినడానికి, నివసించడానికి సరిపడని డబ్బు గలవారుగా ఉంటుంటారు.
కొందరు శ్రమ చేస్తారు. వారికి ఫలితం వచ్చింది అంటారు. మరికొందరు శ్రమ చేస్తారు. కానీ ఫలితం రాలేదు అంటారు. అందుకే మనుషులు సమానమైనా వారి కర్మలు వారిరాతల్లో సమానం కాదు.
ఇపుడు కూడా మనుష్యులు సమానం అని చెప్పలేము. కొందరు సంపూర్ణ ఆరోగ్యంతోను, మరికొందరు అనారోగ్యంతోను ఉంటుంటా రు. మరికొందరు అవయవలోపంతో ఉన్న వారు ఉంటారు. మరికొందరు అవసరానికి మించిన అవయవాలు కలిగిన వారు ఉంటారు. ఇట్లాంటపుడు అందరూ సమానమని ఎలా చెప్పగలం?
కొందరు కొంత పని చేయగానే అలసి పోతుంటారు. మరికొంతమంది ఎంత పని చేసినా అలసట ఏమంత లేదు అని చెబు తుంటారు. అంటే మనుష్యుల్లో అంతర్గతంగా ఉండే శక్తిలోను సమానత లేదన్నమాట.
ఇట్లాంటి అసమానతలున్నాయ కనుకనే సమదృష్టి అలవర్చుకో అన్నారు. తనకు అన్నీ ఉన్నా ఎదుటివారికి లేకపోతే ఎద్దేవ చేయడం కానీ ఎగతాళి చేయడం కానీ చేయకూడదు. దీనికి ఒక కారణం ఉంది. ఈరోజున ఏమీ లేకపోవచ్చు. కానీ రేపొద్దున వారిని భగవంతుడు కరుణించవచ్చు. వారి కుబేరులు కావచ్చు. లేదా సంపూర్ణఆరోగ్యవంతులు కావచ్చు. ఇలా ఏదైనా జరగవచ్చు. జరగడం అనేది మనచేతుల్లో అంటే మనుష్యుల చేతుల్లో ఏదీలేదు. కనుక ఎవరినీ ఎందుకూ నొప్పించకూడదు.
అదేకాదు మనుషుల్లో స్వభావరీత్యాకూడా మనిషికీ, మరో మనిషికి మధ్య తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ప్రధాన కారణం మనిషి తనను తాను అర్థం చేసుకోలేకపోవడమే! ఆలోచనల్లో సరళీకృతం లేకపోవడం, ఆలోచనల్లో నేనే అధికురాలిని అనడం, ఆలోచనల్లో అన్నీ నాకే తెలుసు అనుకోవడం, ఆలోచనల్లో ఎదుటివారి మాట నేను వినడం ఎందుకు అనుకోవడం ఇట్లాంటి వన్నీ మనిషి స్వభావాన్ని మార్చివేస్తాయ. అనుకొన్నది జరగకపోతే వెంటనే కోపం వస్తుంది. ఆ కోపం మనిషి స్వభావాన్ని మార్చివేస్తుంది. దానితో జరగాలనుకొన్నది వూహించింది, లేదా అనుకొన్నది కాక మరొకటి ఎదురవుతుంది.
అందుకే చుట్టూ సమస్యలు చుట్టుముట్టినా, ఎందరు కావాలని కష్టనష్టాలు కలిగిస్తున్నా, పనిగట్టుకొని హేళన చేస్తున్నా పుట్టెడు దుఃఖం ఉబికి వస్తున్నా, వారి ఆలోచనలన్నీ పరపీడన తప్ప మరొకటి కాదని సుస్పష్టంగా తెలిసినపుడు బాధపడడం మానేసి వారి నుంచి దూరంగా వెళ్లిపోయ తనపని ఏదో తాను చేసుకోవడం ఉత్తమం. సమదృష్టి అంటే ఎదుటివారు ఏం చేసినా సరే తాను మాత్రం దోషాలు చేయకుండా ఉంటున్నానా అని పరి శీలించుకుంటూ పోతే ఎవరికీ అపకారం చేయకుండా ఉంటే చాలు అదే సమదృష్టి అను కోవచ్చు. ఒకరికి మేలు చేయగలిగే స్థితిలోను ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉండేవిధంగా జీవితాన్ని మలుచుకోగలిగితే చాలుసమదృష్టి ఉన్నట్టే లెక్కపెట్టుకోవచ్చు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు