Others

మహిమల నిలయం .... బిజిలీ మహాదేవుని ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాస నాథుడైన పరమేశ్వరుడు హిమాచల ప్రదేశ్ లోని కులూ జిల్లాల్లో బిజిలీ మహాదేవ్‌గా కొలువైనాడు. కులూ జిల్లాకు పదకొండు కి.మీ. దూరంలో బియాస్, పార్వతి నదుల సంగమ స్థానంలో మహాదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి సమారుగా 2,455 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయంలోని మహాదేవ్ మహిమ ను చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉరుములతో మెరుపులతో పిడుగులు పడుతూ భయంకరమైన వర్షం తరుచుగా సంభవిస్తూ ఉంటుంది. ఒకసారి ఆ వర్షం పడే సందర్భంలో పిడుగుల ధాటికి ఆలయంలోని శివలింగం కాస్తా ముక్కలైపోయిందట. మరునాడు పూజారి ఆలయంలోకి ప్రవేశించి శివలింగానికి పూజాకార్యక్రమాలు చేయడానికి వచ్చేసరికి శివలింగం ముక్కలు ముక్కలుగా పగలిపోవడం చూసి ఆయన చాలా బాధపడ్డాడు. హర హర మహాదేవ శంభో శంకర శివా శంకరా అనే శివనామాలను జపిస్తూ ఆ శివలింగం ముక్కలన్నీ ఒక్కదరికి చేర్చి వాటిని తిరిగి శివలింగ ఆకారంలో సిమెంటు సాయంతో అతుక బెట్టాడట. ఆ తరువాత శివాభిషేకం చేశాడట. ఆ తరువాత లింగాన్ని అలంకరిద్దామని చూసేసరికి ధవళ కాంతులీనుతూ శివలింగం దేదీప్యమానంగా కాంతులు విరజిమ్ముతూ ఉందట. ఆ శివలింగాన్ని చూసి పరవశం చెందారట ఆ పూజారి. ఆయనతో పాటు అక్కడ జరుగుతున్న తతంగమంతా చూస్తున్న భక్తకోటి ఇది ఎలా జరిగిందని అంతా శివమాహాత్మ్యమే నని శివభజన మిన్నుముట్టేట్టు చేసారట.
ఆతరువాత చాలమంది వచ్చి ఇది ఎలా సాధ్యమైందనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చారట. కాని వారెవరూ అసలు రహస్యం కనుగొనలేకపోయారట. వాతావరణ పరిశోధకులు, పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఇలా చాలామంది వచ్చి చూసి కూడా ఇది అంతా దేవుని మహిమనే అని ప్రస్తుతించి వెళ్లారట.
పురాణ కథనం: పూర్వం ఇలా పిడుగులు పడడం, శివలింగం ముక్కలు కావడం చూసి వశిష్ఠమహాముని శివుని గూర్చి తపస్సు చేసి ఆ పరమేశ్వరుడిని ఇలా పిడుగుపాటుకు శివలింగం భేదం కాకుండా చూడమని అభ్యర్థించారట. అపుడు ఆ వశిష్ఠునికి పరమేశ్వరుడు పిడుగుపాటుకు శివలింగం ఛిన్నాభిన్నం అయినా కూడా తిరిగి యథారూపంలోకి ఎవరు ప్రయత్నించినా వస్తుంది. దేదీప్యమానమైన కాంతులను విరజిమ్ముతుంది అని వరం ఇచ్చాడట. అందుకే ఈ పూజారి శివలింగం ముక్కలను ఒకచోటకు చేర్చగానే అవి అన్నీ కూడి పూర్వ రూపంలోకి మారిపోయాయి అని భక్తులు నమ్ముతారు.
ఈ ఆలయం బౌద్ధమతస్థుల సంప్రదాయమైన పగోడా ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో స్వామికి ఎదురుగా రెండు నందీశ్వరులు కొలువై ఉంటారు. ఇదే ఇక్కడి విశేషం. ఈ స్వామి వారి దేవేరైన అమ్మవారు బిజిలీ మహేశ్వరిగాపూజలందుకుంటుంది. యోగాగ్ని లో దహించబడిన సతీదేవి శరీరభాగాల్లోని కర్ణ్భారణం ఈ ఆలయానికి సుమారు 45కి.మీ దూరంలో పడిందట. ఆ ప్రదేశానే్న పార్వతీ లోయ అని పిలుస్తారు. ఈలోయలో పడిన సతీదేవి కర్ణ్భారణాన్ని ఆనాడు ఒక సర్పరాజం తీసుకొని వచ్చి ఇక్కడి మహాదేవునికి సమర్పించినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈప్రదేశం అంతా చల్లని మంచుతో కప్పబడి ఉంటుంది. నీరు గడ్డకట్టుతున్నట్టుగా ఉంటాయి. ఇట్లాంటి ఈప్రదేశంలో ఒక వేడినీటి బుగ్గ ఉంది. గినె్నలో బియ్యం, తగినని నీరు పోసి ఈ నీటిపై వదిలితే కేవలం 20 నిముషాల్లో అన్నం ఉడికిపోతోందని ఇక్కడి వారు చెబుతారు. అంటే అంత వేడినీరు ఈ బుగ్గలో ఉంటాయి. ఇట్లా ఉండడం కూడా సృష్టి చిత్రమని పర్యాటకులు,్భక్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. పిడుగులకు ముక్కలై తిరిగి యథారూపాన్ని సంతరించుకునే ఈ పరమేశ్వరుణ్ణి బిజిలీ మహాదేవ్‌గా ఇక్కడి వారు పిలుస్తారు. అనేక మహిమలను చూపే ఈ బిజిలీ మహాదేవ్‌ను చూచి తీరాల్సిందే.

-బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్