Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆతని గుర్తించుచు
రాజదర్శనమ్మె దైవదర్శనముగ నెంచుచు

అపుడా దశరథుని ధనువు ఇంద్రధనువు బోలె
అతడు విడుచు బాణమ్ములు మెరుపులనే పోలె

ఒక దిశనే తన తేరును నడిపించెను ఇనుడు
దశదిశలను తన తేరును నడిపె దశరథుండు

నింగినుండి ఏమాత్రం భూమికి దిగడినుడు
నింగిని నేలను దున్నుచుతేరు నడుపు నృపుడు

అతడు జీల్చు తిమిరమ్ముల నీతడు మృగములను
అతడు బ్రోచు తన జీవుల నీతడు తన ప్రజలను.

సాగె సాగె! రథం సాగె! సాగెను రారాజు
సాగె కంటి చూపులంటి సాగెను బాణాలు!

కూలె పులులు సింహమ్ములు! కూలె నడవిపందులు!
చిరుతల తలలే చిట్లెను! చీలెను దేహమ్ములు!

రక్తసిక్తమైన నోళ్ళ మొరుగుచు గ్రక్కుచు నురగల
జవనాశ్వముల మించి నురికె వేట కుక్కలు.

భూమిని ఆనదు రథమ్ము- వింటిని నిలవదు బాణము
అలుపన్నది నృపుడెరుగడు- హడలెత్తెను విపినమ్ము

దర్మమ్మే తన బాటను- ధర్మమ్మే తానను
ఊరైనను, అడవియైన- యుద్ధమైన, వేటైనను.

తన ధర్మం దశరథ మహరాజెంతకు వీడబోడు
ధనువువోలె ధర్మమ్మును పిడికిలించెనతడు
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087