Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రూర మృగమ్ములనె జంపు- విడిచు సాధుమృగముల
పారనిచ్చు ముసలి ముదక- వీడును పసికూనల

ఎంత ఊరమటులరిగెనొ? ఎంత ప్రొద్దుగడిచెనొ?
ఎరుగబోడు ఆ నృపుండు! ఏ దెస పయనించెనొ?

సూర్యరథం పశ్చిమాన అంబుధిలో మునిగె
లోకమెల్ల కానరాని చీకటులను మునిగె

దివిటీలను వెలిగించుచు సాగెను సైన్యమ్ము
భూమిపైన చుక్కలనగ వెలిగెను సైన్యమ్ము

కాగడాల వెలుగులలో కాగడాలు కనులు!
నరుడు నడిచె మున్ముందుకు తానె కాగడాయనంగ!

వేవేగమె డేరాలను అంత సేన వేసె
అలసిసొలసినట్టి సేన యచట విశ్రమించె

వేటాడిన మృగమ్ములే వారికి ఆహారము.
బహుచక్కని విందాయెను అతి చిక్కని మదిరమ్ము

రాత్రి కునికెనేమొగాని రాజు కునుకబోడు
సేన కునికెనేమొగాని రాజు కునుకబోడు

వేటకంచు చీకటిలో ఒంటరియై వెడలెను
కనులె కాగడాలయెను- తనువే రథమాయెను.

తమసా నది తీరమ్మునకేగినాడు రేడు
రేడే నెరరేడై యచట మాటువేసినాడు

గాలి వీచె, నీరుపారె, కాని మృగం రాదు
రేతిరి సగమును గడిచెను రేడు నిదురవోడు

వచ్చెనంత నీటిలోన ‘బుడబుడ’మని ధ్వనులును
వచ్చెనంచు మృగమొక్కటి ఎత్తె రాజు ధనువును.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087