Others

శిష్టులను కాపాడే నారసింహస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వృషభే స్వాతి నక్షశ్రీతే చతుర్దవ్యాం శుభ దినే సంధ్యాకాలే నిశాయుక్తే స్థంభో ధ్భూతం నృకేసరి’’ వైశాఖ శుక్ల పక్ష చతుర్దశి నరసింహ జయంతిగా పురాణాలు చెబుతున్నాయి.
విష్ణుసేవా తత్పరులైన జయవిజయములు ఒకసారి సనకసనందాది మునుల చేత శాపం పొందారు. మహాత్ముల వారి శాపాలు కూడా లోకకల్యాణార్థాలే అవుతాయి కదా. మునిగణం చేత శపించబడినా విష్ణుమూర్తినే వారు శరణుపొందారు. ఆ విష్ణుమూర్తి మునిగణాల శాపాన్ని నేను దూరం చేయలేను కానీ కాస్త ఉపశమనం పొందేట్లుగా చేస్తానని చెప్పి వారిని హిరణ్యాక్ష, హిరణ్యకశిప,రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా పుట్టారు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. అతని కొడుకు ప్రహ్లాదుడు విష్ణుదేవుని మహాభక్తుడు.
తల్లిలీలావతి గర్భవాసాన ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణ్భుక్తి రుచి మరిగినాడు. ఆ రుచి ఎరిగినవారెవరైనా మరిచిపోతారా! అందుకే పుట్టిన క్షణం నుంచి మహావిష్ణువు భజన ఏమరక చేసేవాడు. తండ్రి విష్ణు వైరి. వీరిద్దరి మాటల యుద్ధంలోనే మహావిష్ణువు నృసింహునిగా అవతరించాడు. దుష్టుడైన హిరణ్యకశిపుని శిక్షించాడు. భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించాడు. ఆనాటి నుంచి నేటి వరకు నృసింహభక్తులకు రక్షణ అందుతూనే ఉంది. ఆ నరమృగ రూపంలోని నృసింహమూర్తిని భక్తజనులు కోరి కొలుస్తూనే ఉన్నారు. వారిని ఇక్కట్లనుండి కాపాడమని కోరుకుంటునే ఉన్నారు. నృసింహుడు తనను ఆర్తితో పిలిచిన వారి చెంత వెంటనే నిలబడుతాడు. వారి దుఃఖాన్ని దూరం చేస్తాడు.తన రక్షణనిచ్చి వారిని అక్కున చేర్చుకుని ఇహలోక సుఖాలు పొందిన తరువాత అంత్యమున వారిని పరంధామానికి చేర్చుకుంటాడు.
వైశాఖంలో నృసింహుని కోరి కొలిచిన వారి కోర్కెలను ఈడేరుస్తాడని భక్తజనుల విశ్వాసం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి పెట్టిన ఇడుముల్లాంటే కలి ఇక్కట్లని వాటి నుంచి తమను రక్షించమని వేడుకుంటారు. అన్నీ అవతారాల్లో నరసింహుని అవతారం మహాద్భుతమైందని భక్తులు నారసింహునికి చందనాది సుగంధ ద్రవ్యాదులను సమర్పించి పూజ చేస్తారు.

- కూచిబొట్ల