Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రకామేష్టి
*
అది రాత్రివేళ. అది సాకేతపురం. అంతఃపురంలో దశరథ మహారాజు తన శయ్యపై దొర్లాడుతున్నాడు. ఎంతకూ నిద్రపట్టడం, లేదు.
శ్రవణ కుమారుని మరణం. అతని తల్లిదండ్రుల మరణం, వారు తనకిచ్చిన శాపం, అతని కళ్ళముందే కదలాడుతున్నాయి ఒక దృశ్యకావ్యంలా! తన భవిష్యత్తు తనని భయపెడుతోంది!
ఇది వరమా?... శాపమా?...
తనకు పుత్ర వియోగమట!... ఆపై దుర్మరణమట!... అంతా విచిత్రంగా ఉంది!... అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది!
ఇంతవరకు తనకు సంతన్నదే లేదు! ముసలితనం కొండలా పైబడుతోంది. బ్రతికినన్నాళ్ళు తానింక బ్రతకడు కదా!...
మొదట తనకు సంతానం కలగాలి. ఆపై పుత్ర వియోగం!... ఆపై తాను వ్యథతో మరణించాలి!... ‘‘జాతస్య మరణం ధ్రువమ్!...’’ తాను చచ్చినా సంతోషమే!... తనకో వంశాంకురం కలగాలి. తన సూర్యవంశం ఆచంద్రతారార్కం నిలవాలి. యశశ్చంద్రికల్ని వెదజల్లాలి!... అదే తన కోరిక. తన వారల కోరిక. తన ప్రజల ప్రగాఢ వాంఛ. ఆపై ఏమైతేనేం?... అంతకన్నా వరం మరొకటుంటుందా?... కానీ, ఇది నిజవౌతుందా?... తన అంతఃపురం పసిపాపలా బోసి నవ్వుల్తో, కేరింతలతో మార్మోగనుందా?... నిజమా?...
అవును ఋషి శాపం రిత్తవోదు కదా?...
వేచి చూడాలి!... కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అనుకున్నాడు.
ఆయనకెంతో ఆనందంగా ఉంది. మనస్సు సాగరంలా ఉప్పొంగిపోతోంది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. కళ్ళుతెరిచేసరికి తెల్లతెల్లగా తెల్లవారుతోంది. దాసదాసీజనం పరుగులు తీస్తున్నారు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087