Others

పాహిమాం పరమేశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. మల్లికార్జున స్వామి సేమమ్ము నిడగ
శ్రీగిరీ భ్రమరాంబికా శీస్సులంది
పద్య సమమాలనల్లితి భక్తితోడ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శ్రీశైల మల్లికార్జున స్వామీ! నీవు క్షేమాన్ని ప్రసాదించగా ఆ భ్రమరాంబికాదేవి ఆశీస్సులందుకుని భక్తితో పద్య సుమమాలలనల్లి సమర్పించుకుంటాను.
తే.గీ. కనులు నీకప్పగించంగఁ గాంచనేను ఁ
దిన్నడినిఁ గాకపోతినే దేవదేవ
శక్తికొలదిగ నీ నామ జపము దప్ప
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నా కన్నులు నీకప్పగిద్దామంటే నేను తిన్నడంతటివాడను కాను. శక్తి వంచన లేకుండా నీ జపం మాత్రం జేయగలను స్వామి.
తే.గీ. బుద్ధి పుట్టెను నిను ఁ గూర్తి పొత్తమొకటి
వ్రాయవలెనంచు గౌరీశ! బహువిధాల
పద్యములనల్లనలవోక బ్రతిమనిడుమ
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: గౌరీ శంకరా! నినే్న స్మరిస్తూ పుస్తకం వ్రాయాలనే బుద్ధి పుట్టిందయ్యా. అలవోకగా పద్యాలు అల్లేశక్తిని ప్రసాదించుముస్వామీ!
తే.గీ. కట్టిపడవేసే నన్ను ఁ జీకట్లు కట్లు
విప్పినను విముక్తుడఁ జేతు వీశ్వరుండ
నీ మనంబు నెఱుంగదా నా మనంబు
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఈశ్వరా! అజ్ఞానమనే చీకట్లు నన్ను కట్టిపడవేసాయి. ఆ కట్లు విప్పి నన్ను బంధ విముక్తుడను చేయవయ్యా. నీ మనస్సెలాందో నాకు తెలియనిదా స్వామీ.
తే.గీ. మూర్తి త్రయమందు నొకడివై మోకరిల్లు
వారికండగ నిలుచుండి వరములమిత
ముగ నొసంగెడి లయకారి మునిహృదయుడ !
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ లయకారీ మునిమానస సంచారీ! మూర్తి త్రయంలో ఒకడివైన నీవు నీముందు మోకరిల్లే వారికి అండగా ఉండి వరాలను అధికంగా ఇచ్చే దయామయుడివి నీవేనయ్యా.
తే.గీ. ఎట్టి యవతారములను నీవెన్నడైనఁ
దాల్చలేదాయెఁ గాని నా తలపుఁగాంచి
యవతరించితివే హృదినావహించి
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: శంకరా! నీవెన్నడూ ఎలాంటి అవతారాల నెత్తలేదు. కానీ నా మనసులోని భావాన్ని గ్రహించి నా హృదయమంతా ఆవహిస్తూ అతవరించిన మహానుభావుడవు నీవే స్వామి.
తే.గీ. ప్రజల రక్షణ భారమావశ్యకముగఁ
దలచి యాశ్మశానంబునే వలచినావు;
నీకు సాటెవ్వరును రారు నీలకంఠ!
పాహిమాం పరమేశ్వరా! పార్వతీశ!
భావం: ఓ నీలకంఠా! ప్రజలను సంరక్షించడమే థ్యేయంగా ఇష్టపడి నివాస స్థావరంగా శ్మశానాన్ని ఎంచుకున్న నీకు సాటెవ్వరూ రారు స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262