Others

ధారణ.. యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు : H.No. 7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079
====================================================
ధారణకు, ధ్యానానికి చాలా దగ్గర సంబంధమున్నది. లోతైన ధ్యానస్థితికి చేరటానికి ధారణ అతి ముఖ్యమైనదిగా చెప్పబడింది. ఇతర విషయములపైకి మనసును పోనీయకుండా, ధ్యేయ వస్తువుపైనే మనస్సు నిలిపి ఉంచుటను ధారణయని సామాన్యార్థము. లౌకిక వ్యవహారములో మనము చూచిన వస్తువునో, చదివిన లేక వినిన విషయమునో ఎక్కువకాలము జ్ఞప్తియందుంచుకొనుటను ధారణాశక్తిగా అనుకుంటున్నాము. ధారణకు ముఖ్య లక్ష్యము, సద్యఃస్ఫురణయే, పరీక్షలు వ్రాయు విద్యార్థులకు, అవధానము చేయు పండితులకు ఇది చాలా అవసరము. అభ్యసించిన విద్య లేక చదివిన విషయము జ్ఞప్తికి వచ్చుటయే సద్యఃస్ఫురణము. ఇట్టి సద్యఃస్ఫురణకు ధ్యానమత్యవసరము. మన భారతీయ పురాణేతిహాసములలో ధారణ, సద్యఃస్ఫురణలకు సంబంధించి అనేక ఐతిహ్యాలను మనం గమనించవచ్చును. ఉదాహరణకు, మహాభారత యుద్ధములో కర్ణుడికి, భార్గవాస్తమ్రు స్ఫురణకు రాలేదు. ‘‘పరశురామ దత్తమయిన భార్గవాస్త్రంబను పేరిటి మహనీయ సాధనంబప్పుడు, రాధేయునకుం బ్రతిభాసింపకుండె’’ అంటే పరశురాముడంతటి గురువు వద్ద విద్య నభ్యసించినను, కర్ణునకు సద్యఃస్ఫురణ లేకపోవుటచే కావలసిన అస్త్ర విద్య స్ఫురణకు రాలేదని అర్థము. దీనికి శాపాది కారణములుండవచ్చును. ఇక్కడ అర్జునుని విషయం మనకు స్ఫురణకు వస్తుంది. ఆయన ధారణశక్తి చాలా గొప్పది. సైంధవుణ్ణి సూర్యాస్తమయంలోపు సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసినపుడు శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో, పరమేశ్వర ప్రసాదితమైన పాశుపతాస్త్ర సంబంధిత మంత్రములను స్ఫురణకు తెచ్చుకుని, బాగుగా ధారణ చేయమని హెచ్చరిస్తాడు. అప్పుడర్జునుడు, పాశుపతాస్త్ర మంత్రములను, చక్కటి సద్యఃస్ఫురణతో బాగుగా ధారణ చేసి పరమేశ్వరానుగ్రహాన్ని పొందిన విషయం, మహాభారతమును చదివినవారికి వినినవారికి విదితమే కదా!యోగాచార్యుడైన పతంజలి మహర్షి ‘్ధరణ’ విషయమై వేరొక విధంగా వివరించారు. అట్టి విషయాన్ని పరిశీలిద్దాము. ఇంద్రియ నిగ్రహంతో మనసును విషయాసక్తతలేని దానిగా నియంత్రించినపుడు, మనసు అంతర్ముఖమై తన మూలమైన స్వరూపాన్ని తెలుసుకొనుటకు ప్రయత్నించును. ఆ విధంగా ప్రయత్నించగా, ప్రయత్నించగా, పంచ జ్ఞానేంద్రియాలు, సాధకుని వశమవుతాయి. అప్పుడు సాధకుడు తన మనస్సును తనకిష్టమైన వస్తువు లేక విషయముపైన స్థిరముగా నిలుపగలగటాన్ని ధారణ అని పతంజలి మహర్షి వివరించారు. ఒక వ్యక్తి భగవన్నామంపైన మనసును నిలిపి ఉంచితే, మనసు, అట్టి భగవన్నామానే్న ధ్యానిస్తూ కూచుంటుంది. దీనిని ధారణ అంటారు. ఆ విధంగా స్మరణ చేస్తూ ఉండిపోతే, దానిని ధ్యానమంటారు. ఈ విధంగా, ధారణ, ధ్యానముల సంబంధం, బహు సూక్ష్మమైనది. ఇది చంద్రుడు, వెనె్నల సంబంధము వంటిది. మనస్సును ఒకే అంశముపై నిలిపి స్మరణ చేయడాన్ని ‘దారణయని పతంజలి మహర్షి’ చెప్పారు. ఇట్టి ధారణ ‘్ధ్యనమునకు బాగా ఉపకరిస్తుంది.
- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014