Others

లోక రీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. కనుల కెదురుగఁ గన్పట్టు కన్నవారు
తలుప దైవంబుల వ్వారి ఁ దలుపఁబోరు
సేవ మాటెత్త ఁ జిర్రెత్తి చిందులేయుఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్య దేవ!

భావం: ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను ఈ కాలంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సేవ పేరెత్తితేనే అంతెత్తు లేచి చిందులేస్తుంటారు. కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా చూడవయ్య.
తే.గీ. బంధముల వీడి ధనమునే బంధువుగనుఁ
దలచి వలచియు కడకు నీ వలసిసొలసి
కూలిపోతువా క్షణమందుఁ గూడ రాదె
చూడుమో కర్మసాక్షి యో సూర్య దేవ!

భావం: అన్నిబంధాలను త్రెంచుకుని ధనానే్న సమీప బంధువుగా భావించి ఇష్టపడి చివరకు అలసిపోయి కూలిపోతావు. కూడబెట్టిన ధనం వెంటరాదుకదా. కర్మసాక్షివైన ఓ సూర్య దేవా చూడువయ్య.
తే.గీ. శ్రీల నార్జించుటకు సదాకాతిన
మిగుల యోచించు వారలే జగతియుందు
గడ్డి పరకైన దమవెంటఁ గదలి రాదె
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం: నేటి కాలంలో ఎల్లపుడూ ధనార్జనను గూర్చి ఆలోచిస్తున్నారే కానీ ఒక గడ్డిపరక కూడా తమ వెంట రాదనువిషయాన్ని గ్రహించలేకపోతున్నారు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడుము.
తే.గీ. ఒకటి వేసియు ఁ బదిలాగునొకడుఁ గాంచ
నదియు వేయక వందలనందునొకడు
వారి పంచన చిల్లర నేరునొకడు
చూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం: ఒకటి వేసి పదిలాగే తత్వం ఒకడిదైతే, అ ఒక్కటి కూడ వేయకుండా వందలనందుకునేవాడు వేరొకడు. అలాంటి వాళ్లదగ్గర చిల్లర నేరుకునే వాడు మరొకడు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్య!
తే.గీ. ప్రాణములఁ దీయు వేగంపు పయనమేల?
మెడలసందుల చరవాణి మెఱయ నేల?
కోరి మరణాలనందెచ్చు కొనెదరేల?
చూడుమో కర్మసాక్షియోసూర్యదేవ!
భావం: ప్రాణాలను తోడేసే వేగవంతమైన ప్రయాణాలెందుకు? వాహన చోదకులు మెడలు వంచి ఆ సందున చరవాణి ని ఇరికించుకుని ప్రయాణ సమయంలో మాట్లాడుతూ కోరి మరణాలను కొని దెచ్చుకోవడం ఎందుకోగదా కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!
తే.గీ. బ్రతికి యుండగ రాచి రంపానఁబెట్టి
పిమ్మట త్యంత శ్రద్ధతోఁ బిండములను
పెట్టువారలు లోకానఁ బెచ్చు పెరిగెఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్య దేవ!
భావం: బ్రతికినంతకాలం కష్టాల పాలు చేసి, చనిపోయిన తరవాత అత్యంత శ్రద్ధాసక్తులతో పిండాలను పెట్టేవాళ్లుల అధఇక సంఖ్యాకులు. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య!
తే.గీ . మంచి చెడులను భావాలు మరలిపోయె
దుష్టకార్యాలు లోకాన ఁ దోరమయ్యె
నేను నాదను భావన నింగిఁ దాకెఁ
జూడుమో కర్మసాక్షి యో సూర్యదేవ!
భావం: మంచి, చెడు అనే భావన లేకుండా పోయింది. లోకంలో చెడుపనులు పెచ్చుపెరిగిపోయాయి. నే నాదనే స్వార్థపూరిత భావన పెరిగిపోయింది. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్యా!

- ఇంకాఉంది

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 94924 57262