Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిప్పునె వణికించునతడు- నిప్పునె దహియించును
సర్గమ్మే తలక్రిందుల సేయనోపు నతడు.

సృష్టికి ప్రతి సృష్టిసేయ గలిగినట్టి తపోధనుడు
బొందితోడ స్వర్గమ్మున కంపగలుగు ఘటికుడు.

అయిననేమి? అహంకార మతనినెంతొ కాల్చెను
అది తెలియుట కొరకాతని కాయె జన్మపర్యంతము.

అయిన పట్టువిడువనట్టి గట్టివాడు వౌని
దీర్ఘమైన తపము సేసి- దివ్యర్షిగ నాయెను.

కాని లేశమైన స్వార్థచింత లేనివాడు
ప్రజల కొరకు ప్రాణాలను పణము పెట్టువాడు.

గౌరవానికేమి కొరత కోసల రాజ్యమ్మున
కాళ్ళు కడిగి పాలతోడ కనుల కద్దుకొనెను రేడు.

కలియలేని భిన్నమైన ధ్రువము లొక్కటైన యట్లు
కౌశికుండు వసిష్ఠుండు- కవుగిలించినారంతట.

వెలిగిపోయె విశ్వమ్మే వేవెలుగుల తోడ
కరిగిపోయె కఠిన శిలలు కరుగవె హృదయాలు?

పూలె అక్షతలాయెను అక్షతలే పూలాయెను
పూల రాశులందు మునిగి పూవాయెను వౌని.

మంగళవాద్యాల వేద మంత్రమ్ముల తోడను
ఆతని తోడ్తెచ్చె రాజు అతనిగద్దె నుంచెను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087