Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాముని తోకన బోలుచు లక్ష్మణుండు వచ్చెను
భరతుని తోకన బోలుచు శత్రుఘు్నండేతెంచెను.

వినయమ్ముల ప్రోవులనగ వారలటకు వచ్చిరి
వచ్చిరొ, లేదో భక్తిని మునిపదమ్ములంటిరి.

రాముని పైకెత్తు నెపము నంటె నతని పదముల
అతని పాదరజమంటగ తేలెను పులకింతల.

ఆ వింతల పులకరింత- అతడెరుగును ఆతండును
కాంతులలో కాంతిచ- కాంచె దివ్యప్రభలను.

ఒక సవితృ మండలమ్ము- తోచెను ముఖమండలాన
గాయత్రీ మంత్రవౌచు- తిరిగె వౌని సుడులలోను.

‘‘రాముడు కావలయునాకు! రాముండే వలయు!
రామునితోనారామం నేనేగగ వలయు!’’

అనగా ముని బిత్తరపడి- చిత్తరువును బోలె రేడు
‘‘రాముడేల నో మహాత్మ? పసిబాలుండాతడు!’’

అని వినయము ననియె నృపుడు
నవ్వసాగె మునియప్పుడు.

‘‘లోకుల కల్యాణమెంచి చేపట్టితి జన్నమ్మును
రక్కసులందరు గూడుచు కలిగింతురు విఘ్నములను.

కాలమేఘముల బోలుచు కారు కూతలను గూతురు
రుధిర మాంసములను వారు జన్నమ్మున బోతురు.

మారీచుడు, సుబాహువు వారలలో ముఖ్యులు
దశకంఠుని పనుపుననే చేతురు వారట్టులు.

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087