Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనమ్మే నియమమాయె- క్షమయే ఆభరణమాయె
అందువలన ఆ దుష్టుల- ఆగడములు మించిపోయె.

పట్టలేను ఆయుధమ్ము- ఇవ్వలేను శాపమ్మును
నా నియమమె వారికిపుడు- ఆయుధమ్ముగా మారెను.

తిరుగుచుంటి నేనిట్టుల- కత్తిచ కత్తి కొరకు
అర్థించితి నిన్నిట్టుల- రక్షచ రక్ష కొరకు’’.

అనగా ముని కొయ్యబారి దశరథుండు కూలెను
క్రుంగె భూమి ఆకసమ్ము కూలెననగ తలను.

సొమ్మసిల్లి రాజప్పుడు ఒరిగె నేలపైని
భూమియె భరియించెనంత భూమి నేలువాని.

భృత్యులెల్ల చుట్టుజేరి పరిచర్యల సలిపిరి
వైద్యులెల్ల వెనువెంటనె వైద్యమ్ముల జేసిరి.

నిశ్శబ్దం రాజ్యమేలె నపుడాతని కొలువునను
కాని ప్రజల మనములందు పెనుతుఫాను రేగెను.

లేచెనంత దశరథుండు- కలత నిదుర చెదరినటుల
మున్నీరై పోయెనంత- కన్నుల కన్నీరుల.

పుత్త్రప్రేమ యొక ప్రక్కన- రాజధర్మమొక ప్రక్కన
పోక చెక్కవలె నల్గెను- ఆ రెంటికి నడుమన.

‘‘వలదు! వలదు! ఓ మహాత్మ! వలదోరుూ స్వామీ!
నేవత్తును నా సైన్యము- మీ వెంటను స్వామీ!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087