Others

హరి భక్తి నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టుకకు ముందే నారదుని వల్ల హరినామస్వరూపాన్ని వూహించుకున్నాడు. పుట్టీ పుట్టగానే తండ్రి క్రోధావేశంతో హరి రూప సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు. హరి లేనిదే ప్రపంచం లేదు అని నెమ్మదిగా తాను దిన దిన ప్రవర్థమాన మయనట్లే హరి గురించిన విశేషాలను చాలానే తెలుకున్నాడు. రాజమందిరంలో తల్లి ప్రియకుమారుడిగా, వారస్వతసంపదను పుణికి పుచ్చుకోవాలనుకొనే తండ్రి ముద్దు బిడ్డడుగా ఎదుగుతున్నాడు ప్రహ్లాదుడు. రాజ సౌధంలో తన ఈడు వారు లేకున్నా ఎన్నడూ చిర్నువును వీడ కుండా సదా హరినామాన్ని జపిస్తూ, హరి పూజలు చేసుకుంటూ నడుస్తున్నా, కూర్చున్నా హరి నామాన్ని వదలకస్మరించే వాడు. ఇతడినిచూచి నా నామస్మరణ చేస్తూ ఉండాల్సిన నా కొడుకు నా శత్రువును గురించి మాట్లాడు తున్నాడు. శత్రువిశేషాల గురించిన వివరాలు సేకరిస్తున్నట్టు నాకు తెలుస్తుంథి. నా కుమారుడిని నా వైపుకు తిప్పుకునే మార్గం ఏమిటి? ఏదైనా మాయ చేసి ఆ హరి నా కొడుకు ను నాకు వ్యతిరేకం చేసేట్టు ఉన్నాడు. కనుక నేను గురుదేవుల దగ్గరకు పంపించి విద్యను నేర్పివ్వమంటాను. నాకొడుకు రాక్షస విద్యలన్నీ నేర్చు కుంటే నా ప్రతిభావిశేషాలు తెలుసు కొంటాడని అనుకొన్నాడు హిరణ్యకశిపుడు.
గురువులకు కబురు పంపించాడు. గురువులకు తన కుమారుడికి సర్వ విద్యలు నేర్పివ్వమనీ అభ్యర్థించాడు. వారు సరే నని వెళ్లారు. గురుకులంలో ప్రహ్లాదుడు తోడి బాలురతో స్నేహం చేశాడు. వారికి హరి గురించిన నిజాలను చెప్పాడు. ఈ గురువులు నేర్పించే విద్యలన్నీ ఒకరోజు నశించిపోతాయ. మనకే నిలకడలేదు. అసలైన విద్యను గురువులు మనకు బోధించడంలేదు. శాశ్వతమైందీ సత్యమైందీ హరి ఒక్కడే అని వారికి చెప్పాడు.
మనమంతా ఆ హరి గురించి ఆలోచించాలి. హరినే నిత్యమూ స్మరించాలి. అశాశ్వతమైన ఈ జీవితంనుంచే శాశ్వతమైన హరి పథానికి అడుగులు వేయాలి అని వారికి హితబోధ చేశాడు. వారికి హరికథలను వినిపిచాడు. వారంతా ఆ తీయని హరికథలను సమ్మోహితులయ్యారు. అందరూ కలసి హరినామస్మరణ, హరిభజన చేయసాగారు. ఇది అంతా చూసిన గురువర్యులు హతాశుతుల య్యారు.
అయ్యా మమ్ము కాపాడండి. మీ కుమారుని వల్ల మన వంశం నాశనం అవుతోంది. రాక్షస పిల్లలంద రికీ మన శత్రువు అయన హరి మార్గదర్శకుడని చెబుతున్నాడు. హరినే నిత్యము సత్యమూ అని వారిని తప్ప మరొక రి ధ్యాస లేకుండా ఈ జీవితాన్ని గడపాలని చెబుతున్నాడు. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా కూడా మీ కుమారుడు హరి ని భజించడం మానడంలేదు. మేము కనుమరుగు అవగానే హరి విగ్రహాలను మట్టితో చేసి పూలతో చక్కగా పూజచేస్తున్నాడు. హరి తప్ప అన్యమంతా అశాశ్వతమేనని వారికి తెలియచెబుతున్నాడు. ఇక మా మాటలను పిల్లలెవరూ లెక్కచేయడంలేదు అని హిరణ్య కశపునకు మొరపెట్టుకున్నారు గురువులు.
పాపం ఆ ప్రహ్లాదుని వల్లే వారి వంశం కీర్తించ బడుతుందని హిరణ్యకశిపునకు మోక్షం పొందడానికి , శాపవిముక్తికి ప్రహ్లాదుడే కారణమని ఎరుగని అమాయక చండామార్క గురువులు వెర్రిత్తిపోయారు.
అంతకంటే అమాయకుడైన హిరణ్యకశిపుడు తనకు ఇంటా బయట కాక, పొద్దునా సాయంత్రంకాక నరుడు, మృగమూ కాక ఉన్నవారి చేత నా మరణం సంభవించాలి కానీ మరొకరిచేత మరణం సంప్రాప్తించకూడదు అని వేడుకున్నాడు కదా. ఆ కోరికను తీర్చేయడానికే తనకు ప్రహ్లాదుడు పుట్టాడని, ఆ ప్రహ్లాద రక్షణార్థమే తన కోరికలకు అనుగుణంగా మహావిష్ణువు నారసింహుడై సాయంసంధ్యా సమయంలో తన ప్రాణాలను తన జీవాత్మ పరుడైన పరమాత్మలో లీనం చేసుకొంటాడని తెలుసుకోలేని హిరణ్యకశుపుడు అయ్యో నా కొడుకు మతి తప్పి దారి తప్పు తున్నాడు. ఎలా నాదారికి తెచ్చుకోవాలని ప్రయాస పడు తున్నాడు. ప్రహ్లాదుడు మాత్రం స్థిర చిత్తంతో అచంచల మైన హరిభక్తిని మనసున వేళ్లూనించుకున్నాడు.

- డా.ఎ. రాజమల్లమ్మ