Others

తృప్తి ఉంటేనే సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసింది మానవ జీవితం. జీవితంలో కొన్ని సుఖాలు మరికొన్ని దుఃఖాలు ఉంటా య. దుఃఖం కలిగినపుడు వెంటనే భగవం తుడిని స్మరిస్తారు. ఈ కష్టాలు దాటించమని మొక్కుబడులు మొక్కుకుం టారు. అదే సుఖాలు కలిగినఫుడు భగవంతు డిని అనుకొనే వారు బహు తక్కువ మంది ఉంటారు. స్థిత ప్రజ్ఞత కలిగిన వారు మాత్రమే ఇదంతా భగవంతుని అనుగ్రహం అనుకొం టారు. సామాన్యులకు విజయమో సుఖమో రాగానే వెంటేనే ఎంత శ్రమించాను అందుకే నాకీ ఫలం వచ్చింది అంటారు. ఇది సహజమే.
కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. వెంటనే నా శ్రమకు వచ్చిన ఫలితం అనుకొంటే చాలు అసంతృప్తి ప్రారంభ మవుతుంది. ఇది దిన దినమూ పెరుగుతుంది. నేను వారి కంటే ఎక్కువ పనిచేశాను. వానికేమీ రాదు. కానీ నాకు తక్కువ ఫలితం వచ్చింది. వానికి ఎక్కు వఫలితం వచ్చింది అనడం మొదలు.
అదే భగవంతుడు ఇచ్చిన ఫలమే ఇది అనుకొంటే తృప్తి కలుగుతుంది. ఎదుటి వారిపైన దృష్టి ఉండదు. వారితో పోల్చి చూసు కోవడం ఉండదు. వారిపై ద్వేషం మొదలు కాదు. తృప్తి ఉంటేచాలు దేనినైనా సాధించ వచ్చు.
మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే ప్రాప్తానికి కట్టుబడి ఉంటుంటాయి. కష్టసుఖాలు, కలిమిలేములు భూమిపై జన్మించినవారికి దాదాపు అన్ని వర్గాలవారికి వర్తిస్తాయి. ఏదీ మన చేతిలో ఉండదన్న విషయం అందరూ తెలుసుకోవాల్సిన విష యం.
ఎవరి పని వారే చేసుకుంటే, ఆనందంగా తృప్తిగా ఉండవచ్చు. మనకు లభించనవి, వేరొకరిలో వుంటే సంతోషిస్తూ, చేతనైన సహాయంతో వారిని అభినందించడంలో తృప్తే వేరు. ధనికులు పేదలకు సౌకర్యాలు కల్పించాలి. ధనాన్ని సద్వినియోగం చేయాలి కానీ ఇంకా ఇంకా పెట్టుబడులతో పైకి రావాలనుకోవడం దురాశ. ఇందులో తృప్తి లభించదు. పైగా రక్షణ ఉండదు. అనుక్షణం భయంతో కాలం గడపాలి. ఫలితం అనారోగ్యాలు. ఉన్నది చాలు, ఎక్కువ ఉంటే దానధర్మాలు చేయాలి అని ఆలోచించేవారికి దుఃఖం దరికిరాదు. ఎట్టఎదుట ఈతిబాధలు పడేవారికి, భాగవతులు బాసటగా నిలవాలి. ధర్మో రక్షిత రక్షతగా, మనం చేసే మంచి పనులు సత్ఫలితాలు ఇస్తాయి. ఆపదలో మనిషే భగవంతుడై కాపాడవచ్చు. శ్రమ విలువతో, నిత్య జీవనంలో, పరులకోసం పాటుపడేవారికి తృప్తిరూపంలో భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు ఇచ్చిన బతుకును సార్థకం చేసుకునేవారికి అందని అదృష్టం ఉండదు.అదే తృప్తి.

- జి. వివేక్