Others

నైషధమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(హంస దౌత్యం)
(తెలుగువచనం)
*
ఈ భరతభూమి వేదభూమి. కర్మభూమి. ధర్మభూమి. పుణ్యభూమి. ఇక్కడ ఎందరో బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు, మునులు, యోగులు జన్మించి నేలను పునీతం చేశారు. వేదసారాన్ని బోధించారు. యజ్ఞయాగాదులను నిర్వహించారు. సర్వమానవ మనుగడకు, 3సర్వేజనా సుఖినోభవంతు2అనే వేదవాక్కుతో గట్టి పునాదులు వేశారు.
ఎందరో రాజులు మరియు షోడశ చక్రవర్తులైన అంగుడు, అంబరీషుడు, గయుడు, పరశురాముడు, పృథువు, భరతుడు, భగీరథుడు, మరుత్తుడు, మాంధాతృడు, యయాతి, రంతిదేవుడు, శ్రీరాముడు, శిబి చక్రవర్తి, శశిబిందువు, సుహోత్రుడు రుూ ధర్మభూమిని పాలించారు. ధర్మాన్ని నాలుగు పాదాల నడిపారు. చతుర్వర్ణాల వారిని సమభావంతో చూచారు. దండ నీతిని ప్రవర్తింపజేశారు. అనేక దానాలు చేశారు. ఎంతో కీర్తిని గడించారు. దేవతలను మెప్పించారు. స్వర్గాన్ని చేరారు.
అట్టి ఈ భారతదేశానికి పూర్వపు నామం 34అజనాభం. పురాణాల్లో దీనిని 34జంబూద్వీపమని, ఆర్యావర్తమని ప్రశంసించారు.
చతురదధివేలావలయితంబైనది 3జంబూద్వీపము. జంబూద్వీపము తొమ్మిది వర్షాలుగా విభజింపబడినది. అవి 3ఐరావతవర్షము2 (ఉత్తర సముద్రానికి శృంగవంతమనే పర్వతానికి మధ్యగల ప్రదేశం),3హిరణ్యయవర్షం2(శే్వత పర్వతం శృంగవం పర్వతాలకు మధ్యలోగల ప్రదేశం), 3రమణకవర్షం2 (నీలశైలానికి ఉత్తర దిక్కునగల ప్రదేశం),4ఇలా వృత్తవర్షం2 (హిమాలయ పర్వతానికి దక్షిణ దిక్కునగల ప్రదేశం), 4్భద్రాశ్వవర్షం (మేరు పర్వతానికి తూర్పు దిక్కునగల ప్రదేశము) కేతు మాల వర్షం (మేరుపర్వపతానికి పశ్చిమ దిక్కునగల ప్రదేశం) హరివర్షము (హేమకూట పర్వతానికి ఉత్తర దిక్కునగల ప్రదేశం),4కింపురుషవర్షం (హిమాలయపర్వతానికి ఆవల గట్టునయున్న ప్రదేశం), భరతవర్షం (హిమాలయ పర్వతానికి ఇవ్వలవైపున ఉన్న ప్రదేశం). అనబడిన తొమ్మిది వర్షాలు. మనది భరతవర్షము.
భరతుడు పాలించటంవలన దీనికి 3్భరతవర్షమని2 పేరువచ్చింది. ఈ భరతభూమి అనేక జనపదాలకు నిలయం. పేరెన్నికగన్న రాజులచేత పాలింపబడినవి. భౌగోళికంగా పాంచాల, బర్బర, వత్స, మత్స్య, మగధ, మళయాల, కుకుర, కొంకణ, కాశ, టేంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ(సాల్వ), శూరసేన, సుదేష్ణ, సుహ్మమ, కురు, కరూశ, కోసల (పూర్వ కోసల, ఉత్తర కోసల) యవన, యుగంధర, ఆంధ్ర, సింధు, చేది ఇత్యాదులు.
పూర్వం అత్రి వంశమున 3అత్రి2 3సమానుడైన 34అంగుడు22అనే ప్రజాపతి జన్మించాడు. ఈతడు 3ఉల్ముకుడు పుష్కరిణుల పెద్ద కుమారుడు.
అంగుని కుమారుడు 34వేనుడు2అనువాడు. వేనుడి తల్లి (అంగుని భార్య) మృత్యువు కుమారి అయన 34సునీధ. మాతామహ దోషంచేత వేనుడు 3సర్వ ధర్మమును వెనుకపెట్టి కామలోభియై ప్రవర్తించుచుండెను. ధర్మముయొక్క హద్దులను తారుమారుచేశాడు. వేద ధర్మములను అతిక్రమించాడు. వేనుని రాజ్యమున యజ్ఞములందు హవిస్సులు దేవతలకు దక్కలేదు. వారు ఆరగింపలేదు. పైగా రాజ్యములో యజ్ఞములను, హోమములను చేయరాదని శాసించెను. క్రూరమైన ప్రతిజ్ఞచేసెను. తానే యజ్ఞేశ్వరుడనని, యజ్ఞకర్తనని, యజ్ఞములు తననుగూర్చియే యుండవలెనని, హోమములు కూడా తనకొరకై ఆచరింపవలెనని శాసించెను.
కుమారుని అధర్మవర్తనమును చూచిన తండ్రియైన అంగుడు రాజ్యముని విడిచి

- ఇంకాఉంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము