Others

హరి స్మరణం.. పాపహరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథులన్నింటిలోను ఏకాదశి తిథి చాలా పవిత్రత చేకూరింది. దీనికి కారణం ఒకసారి మహావిష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో పోరుకు సిద్దమయ్యాడు. అతడు చ లా బలవంతుడు. అతడితో యుద్ధం చేస్తూ కొంత తడువు గరుడవాహనారూఢుడైన మహావిష్ణువు పడు కున్నాడట. అపుడు ఆయన శరీరం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి వెలువడింది. ఆ స్ర్తిమూర్తి మురాసురునితో యుద్ధం చేసి విజయం సాధించింది. యుద్ధం తరువాత మహావిష్ణువు మేల్కాంచాడు. అపుడు జరిగింది తెలుసుకొని నీకేం వరం కావాలో కోరుకొమని ఆ స్ర్తిని అడిగితే ఆమె అందరూ నన్ను గుర్తించుకునేట్టు వరం ప్రసాదించమని కోరుకుందట. అపుడు అక్కడికి వచ్చిన దేవతలంతా ఆమెను ఏకాదశి అని పిలిచారు. కనుక ఆమె పేరు ఏకాదశి అయంది. మహావిష్ణువు వరం ప్రకారం పదిహేను రోజులకొక సారి వచ్చే తిథిగా ఈ ఏకాదశిని దేవతలంతా తిథిగా తీర్చారట. దానివల్లనే ఏకాదశి పరమ పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. సంవత్సరంలో 24 ఏకాదశులున్నా కూడా ఈ ఆషాఢమాస ఏకాదశిని తొలైకాదశిగా వ్యవహర్తం. ఈ ఏకాదశి నాడే నరులను పాలించే నారాయణుడు క్షీరాబ్దివాసుడు శయనిస్తాడు. యోగనిద్రలోకి వెళ్లే ఏకాదశి నే శయనైకాదశి అని పిలుస్తారు. . మునులు, సిద్ధులు, సాధ్యులు సాధువులు సత్పురుషులు అందరూ హరి శయనించిన మహావిష్ణువును కీర్తిస్తారు కనుక, పైగా హరి దగ్గరే కాలయాపన చేస్తున్నారు గనుక హరి వాసరమనీ, ఈరోజు మంచినీరైనా సేవించకుండా కటికోపాసం చేస్తారు కనుక నిర్జలైకాదశి అనీ రకరకాల విశేషాలతో విష్ణు భగవానుని అనుగ్రహాన్ని పొందిన ఏకాదశిని స్తుతిస్తారు. ఈరోజునే ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు దక్షిణం వైపుకు తిరిగినట్టుగాను కనిపిస్తాడు. ఈ ఏకాదశి గురించి వివరాలు భవిషోత్తర పురాణం బ్రహ్మవైవర్తన పురాణం చెప్తున్నాయ. పండరిపురంలో తొలైకాదశి నాడు పండరినాథునికి మహోత్సవాలు జరుపుతారు. రుక్మాంగద మహారాజు, అంబరీషుడు ఈ ఏకాదశీ వ్రతా చరణంతో విశేషఖ్యాతిని ఆర్జించారు.
నారాయణ మంత్రాన్ని అనునిత్యం జపించిన వారికి ఈ లోకపు సంపదలతో పాటుగా వైకుంఠప్రాప్తి లభ్యమవుతుందని మహావిష్ణువు వరాన్ని ఇచ్చారు. ఈ ఏకాదశి తర్వాతవచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలూ లభిస్తాయ. మహా విష్ణువుకు కోసం పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. జాజిపూలతో స్వామికి పవళింపుసేవోత్సవం విశేషంగా చేస్తారు. ఈ జాజిపూల పవళింపు సేవ ఆలయాల్లో విశేషాకర్షణగా ఉంటుంది. ఈరోజు నుంచే వ్యవసాయదారులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడ్తారు ఆంధ్ర ప్రాంతంలో తొలి ఏకాదశిరోజునే పాలెర్ల పండుగగా చేస్తారు. పాలేర్లకు పంచభక్షపరమాన్నలతో విందుచేయడం, కొత్తబట్టలను ఇచ్చి గౌరవించడం లాంటివి చేస్తారు. సాధువులు చాతుర్మాస్య దీక్షల ను కూడా ఈరోజు ప్రారంభిస్తారు. ఈ చాతుర్మాస దీక్ష మార్గశీర్షం లోని మోక్షైకాదశి వరకు కొనసాగిస్తారు. ఈ ఏకాదశిన గోపూజ కూడా పరమ పవిత్రంగా భావిస్తారు. గోశాలను శుభ్రం చేయడం, గోవుకు మంచి పచ్చికను ఆహారంగా ఇవ్వడం గోపూజ చేయడం తమ విధిగా విష్ణ్భుక్తులు చేస్తుంటారు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి