Others

ఎడతెగని కర్‌‘నాటకం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న కర్నాటకలో మళ్లీ తీవ్ర రాజకీయ సంక్షోభం రాజుకొంది. దీనికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్-జేడీఎస్, భాజపా నేతలు పరస్పరం నిందారోపణలకు దిగారు. కర్నాటకలో గత కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి సంక్షోభాలు వస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కుతామని, ఇదంత భాజపా చేస్తున్న కుతంత్రమని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు అంటున్నారు.
మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ‘కన్నడ కంఠీరవ’ బిరుదాంకితుడైన సినీ హీరో రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. కుమారస్వామి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ జీవించేవాడు. ఉన్నట్టుండి రాజకీయ అరంగేట్రం చేసి కులం బలంతో అంచెలంచెలుగా ఎదిగి గతంలో భాజపా నేత యడ్యూరప్ప సాయంతో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించాడు. భాజపా-జేడీఎస్ చెరో రెండున్నర సంవత్సరాలు పాలించాలని ఒప్పందం చేసుకోగా, పదవీకాలం ముగిసినప్పటికీ కుమార స్వామి సీఎం పీఠాన్ని వదలలేదు. గత ఏడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌కు ముప్పై సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, భాజపాను రాజకీయాధికారానికి దూరంగా ఉంచాలనే దురాలోచనతో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జేడీఎస్‌కు మద్దతు పలికేలా తన పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించాడు. కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కుమారస్వామి మరోసారి సీఎం కాగలిగాడు. ఆయన పదవిని చేపట్టిన మరుక్షణం నుంచే కాంగ్రెస్‌లో లుకలుకలు బయలుదేరాయి. పదవులు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలకపాన్పు ఎక్కడం రివాజుగా మారింది. దీంతో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు మనుగడ దినదిన గండంలా మారింది.
క్యాంపు రాజకీయాలు నిత్యకృత్యంగా మారాయి. ఎమ్మెల్యేలకు పదవులు, డబ్బు ఆశ చూపి ప్రసన్నం చేసుకొంటున్నారు. ముమ్మాటికీ ఇది ప్రజాస్వామ్యం కాదు. రౌడీ రాజకీయం అనాలి. రాఘవేంద్రుడు, బసవన్న వంటి మహాపురుషులు పుట్టిన భూమిలో రాజకీయ దుర్మార్గులు ఎలా పుట్టారో తలచుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అనూహ్య రీతిలో ఘన విజయం సాధించి రెండోసారి ప్రధాని పదవిని చేపట్టడంతో కర్నాటక, గోవా వంటి రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ముదురుపాకానపడ్డాయి. అధికార పార్టీలోకి ఇతర పార్టీల వారు చేరడం జాతీయ స్థాయిలోనే కాదు, పలు రాష్ట్రాల్లోనూ ఆనవాయితీగా మారింది. తెలంగాణలో మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అధికారానికి దూరంగా ఉండలేని నేతలు నిర్లజ్జగా పార్టీలను ఫిరాయిస్తున్నారు.
‘ భారతీయులు వారి దేశాన్ని పాలించుకోవడానికి అయోగ్యులు’’ అని 1946లో విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన మాట నిజమేనని అనిపిస్తున్నది. రాజకీయ పునరేకీకరణ ఫలితంగా మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవచ్చు. కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతినడంతో ఇపుడు భాజపా మాత్రమే ఏకైక జాతీయ పార్టీగా మిగిలిపోయింది. ప్రజాస్వామ్యం అంటే బలమైన మరొక జాతీయ ప్రతిపక్షం కూడా ఉండాలి కదా? దురదృష్టవశాత్తూ దేశంలో రెండు పార్టీల విధానం ఏర్పడలేదు. ఇప్పుడు కర్తవ్యం ఏమిటి? ‘వీలైనంత త్వరగా ప్రాంతీయ పార్టీలు అంతరించిపోయి మరొక జాతీయ పార్టీగా ఏర్పడాలి.. ఏపీలో తెదేపా ఇక భాజపాలో విలీనం కాబోతున్నది’ అని మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి ప్రకటించడాన్ని విశే్లషిస్తే అది కొంతవరకూ వాస్తవమేనని అనిపిస్తుంది. ఇదే నిజమైతే ఒకప్పుడు ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి, మోదీకి నల్లజెండాలు చూపించిన తెలుగుదేశం అధినాయకుణ్ణి భాజపా ఎలా స్వాగతిస్తుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
***
‘జై శ్రీరామ్’ అనేది బెంగాలీ సంస్కృతి కాదన్నాడు అమర్త్య సేన్ అనే కమ్యూనిస్టు ఆర్థిక శాస్తవ్రేత్త. ఆయన ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నాడు. నరేంద్ర మోదీ మూర్ఖుడు అని లోగడ ఈయన నోరు పారేసుకున్నాడు. పురాణ పురుషుడు శ్రీరాముడు వంగభూమికి చెందడా? రాముడు, కృష్ణుడు కలిస్తేనే రామకృష్ణ పరమహంస అయినాడు. శివాంశతా స్వామీ వివేకానందుడు జన్మించాడు. దశాబ్దాల పర్యంతం బెంగాల్‌ను చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు పాలించి స్థానిక సంస్కృతిని నిర్మూలించారు. ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్‌లో హిందువుల పూజలపై ఆంక్షలను విధిస్తున్నారు. రాముడు తమ సంస్కృతిలో అంతర్భాగం కాదని అంటున్నాడు అమర్త్య సేన్. దేశ సంస్కృతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్న ఇలాంటి మేధావులను కేంద్రం నియంత్రించాలి.
***
భారతపై అల్‌ఖైదా త్వరలో ఉగ్రవాద దాడులను జరుపుతుందా? ఈ విషయం ఆ సంస్థ అధినేత జవహరీ ఇటీవల ఒక వీడియో ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. హిజ్‌బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఆత్మాహుతి దళాలను కాశ్మీరులో ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించాడు. దీనిని కేంద్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతున్నదో చూడాలి. వెంటనే కశ్మీర్‌ను జమ్ము, లఢక్, కశ్మీర్‌లోయ అనే మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించాలి. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఎలను రద్దు చేయాలి. లక్షలాది కశ్మీరీ పండిట్లకు శ్రీనగర్‌లో నివాసం కలిపిస్తే పరిస్థితి కొంతైనా మారుతుంది. పాకిస్తాన్, చైనాల పట్ల మోదీ సర్కారు కఠినంగా వ్యవహరించాలి. ఆక్రమిత కశ్మీరుకు వెంటనే విముక్తి కలిగించాలి. ఇంతకన్నా కశ్మీర్ సమస్యకు వేరే పరిష్కారం లేదు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్