Others

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బదులు పలుకక ఊరకుండుట చూచి సరస్వతీదేవి ముందుకు సాగి
(కామరూప దేశము ఇప్పటి అస్సాము రాష్టమ్రు. వంగ దేశమునకు (ఇప్పటి బెంగాలు రాష్ట్రము) ఈశాన్య దిక్కున ఉన్నది- ప్రాగ్జ్యోషితపురము)
కామరూపదేశాధిపతి
ఓ భీమరాజతనయా! దమయంతీ! ఇటు చూడుము. ఈతడు ‘ప్రాగ్జ్యోషాధీశుడు. ఇందువదనా! ఈ రాజు చేయు పోరులలో కత్తితో వైరికరుల (శత్రురాజుల ఏనుగులను) కుంభస్థలములను చీల్చి అందలి ఎముకల ప్రదేశములయందలి ప్రకాశించుచున్న ముత్యాలను రణరంగములో గుఱ్ఱపుగట్టల రాపిడికి నలిగిన భూమిలో కీర్తిపంటకై దున్నిన పొలములలో (రణరంగములో) విత్తనములు చల్లుచున్నట్లుగా ఒప్పుచుండును. ఓ రాజీవాక్షీ! ఈ రాజుయొక్క ప్రతాపము అగ్నితో సమానము. ఇతని కత్తిదెబ్బలకు రక్త్ధారలు గారుచున్న వైరులను చూచిన పచ్చివెదుళ్ళ అడవులను అగ్ని కాల్చుచున్నట్లుండును. అందుండి ఎగసివచ్చు నల్లన పొగ ఇతని సేనాముఖమందలి గుఱ్ఱపుదండు రాపిడి నల్లధూలి అని భ్రమింపజేయును. ఈతడు అంతటి ప్రశాశవంతుడు. ఈతని వరించుము.’’
అని అనగా దమయంతి భావమునెఱింగిన ఆమె సహోదరి భారతీదేవిని చూచి ‘‘ఓ దేవీ! ఈ వసుధావల్లభుని మీద పల్లవాధరకు ఉల్లంబు పల్లవించుట లేదు. పలు మాటలేల? అడుగో! ఆ ఉత్కళ దేశాధీశుడు! అతని గుణవిశేషములను అభివర్ణింపుము’’అని అనగా ఆ విరించి రాణి
ఉత్కలుడు
ఓ రమణీ! దమయంతీ! ఇటు చూడుము. ఇతడు ‘ఉత్కళ దేశాధిపుడు’ (ఓఢ్ర దేశము- నేటి ఒరిస్సా రాష్టమ్రు) మహావీరుడు. ప్రతాపశాలి. ఇతడెంతటివాడంటే ఇతనికి నమస్కరించిన వైరిభూపతుల కిరీటముల అంచులయందలి ఇంద్రనీల మణులనెడి తుమ్మెదలను తగులుచున్న పాదపంకజములు కలవాడు. ఘోర యుద్ధములలో ఈతని బాహుపరాక్రమమును చూచుటకై ఆకసమునందు దేవతలు వత్తురు. వారి చూపునకు అడ్డముగా ఇతని గుఱ్ఱములు రేపెడి ధూలి పటలము ఆకాశమును ఆవరించుటచేత వారు. మనస్సులలో ఖేదపడుదురు. ఈతడు మహాదాత అయినందున కల్పవృక్షమును యాచకులు యాచించుట మానిరి. ఆ కల్పవృక్షము అవమానమునకు కలిగిన తలంపును పండ్ల భారముచేత కలిగిన తలంపుగా వహించుచున్నది. ఈ రాజు శరణుచొచ్చువారేగానీ నెదురు పోరాడువారు లేరు’’అని వర్ణించి చెప్పగా
ఎడతెఱపి లేక సర్వదా ఆ నలమహారాజునే ధ్యానించచున్నట్టి దమయంతిని ఎఱింగి ఎఱంగని చందంబున భావించుచు ఆ వాగ్దేవి ఈ ఉత్కలాధీశురుని దాటి ఒక రాజును చూపి
కీకటాధీశ్వరుడు
ఓ లలనా! ఈతడు కీకటాధీశ్వరుడు. ఇతని వీక్షింపుము. ఈ రాజు పెక్కు చెఱువులు త్రవ్వించాడు. వాని ప్రాంతములందు ఆరామాలను నెలకొల్పినాడు. పథికులు (బాటసారులు) ఆ ఆరామ వృక్షముల క్రింద విశ్రమించి సేదతీరుదురు. ఆహ్లాదిస్తారు. ఆ చెఱువుల వలన ఈతనికి మహాకీర్తి వచ్చినది. నీలాలవంటి రంగుగల నల్లగలువలు వెదజల్లుచున్న వాసనలకు పక్షి సంఘము మధురముగా క్రీంకారములు చేయుచూ, క్రీడించుచూ సుఖముగాయున్నవి. ఈతడు అట్టి ధర్మకార్యనిరతుడు.
ఓ తరుణీ! విశ్వమందంతయూ నారాయణుని ఉదరమందున్నది. ఇతని కీర్తి వెల్లువ పొడిచి విశ్వమంతయూ వ్యాపించి గుహవంటి నారాయణుని ఉదరము నిండినది. అంతట అందలి లోకములు ఆ వెల్లువచుట్టు తిరుగ (సుడియ) సాగినవి. తదనంతరము ఆ ఉదరంబునగూడా ఇముడక ఆ కీర్తి ఆతని నాభిలో రంధ్రముచేసికొని వెలువడినది. అదే నారాయణుని నానీపుండరీకమని వ్యవహరింపబడు ఆ తెల్లని పదార్థము.’’అని వాగ్దేవి పలుకగా
ఆ పలుకులు వినిన దమయంతి అనాదర ముద్రితంబైన మనస్సుతో ఆ కీకటాధీశ్వరుని వరింపలేదు.
- ఇంకాఉంది