Others

మార్గాలెన్ని ఉన్నా గమ్యమొక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవుల్లో ఉత్తమ జన్మ మానవజన్మ. ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి మనిషి అనే్వషణ సాగిస్తూ ఉంటాడు. వెతుకుతూ ఉంటాడు. బాగా వూహ తెలిసి పెరిగి పెద్దవాళ్లు అవుతుంటే జ్ఞానం విస్తరిస్తుంటుంది. ఆ సమయంలోనే తాను ఎవరు ఎక్కడ నుంచి వచ్చాడు ఎక్కడ వెళ్తాడు అన్న ప్రశ్నలు తనకు తాను వేసుకొంటూ నిరంతరం అనే్వషణ చేస్తుంటాడు.
చాలామందికి ఈ ప్రశ్నలు వచ్చినా వాటిని సంసార సాగరం ఈదడంలో మరిచిపోతూ ఉంటారు. మరికొందరు కొంత ఆలోచించి పుస్తక పఠనం సాగిస్తారు. మరికొంధరు గురువులను వెదికి వారికి శిష్యులై వారి మార్గంలో నడుస్తుంటారు. కొందరు ధ్యానం, తపం, యజ్ఞం ఇలాంటివి చేస్తుంటారు. జ్ఞాన సముపార్జనకు పెద్దలు భక్తి మార్గం సరియైనది అని అంటారు.
ఆ భక్తిమార్గంలో కూడా శ్రవణం, దాస్యం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం అనే విధాలున్నాయ. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్లినా వారు సత్ఫలితాలను పొందుతారు. నమ్మకమే వారిని ముందుకు నడిపించి జ్ఞానఫలాలను అందిస్తుంది. భక్తి సామ్రాజ్యంలో దాస్యానికి పెద్ద పీట వేసిన వారు ఆంజనేయుడు రాముని భక్తుడు. రాముని నామాన్ని అనవరతం స్మరణ చేసినవాడు. రాముని కోసం లంకలో ప్రవేశించినవాడు, సముద్రాన్ని దాటినవాడు. రాక్షస గణాలు మట్టుపెట్టినవాడు. చివరకు సీతమ్మను చూసి రామునికి ఆశ్వాసన కలిగించినవాడు. రాముని భక్తులు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తనను కొలువపోయనా, తనను స్మరించకపోయనా సరే రామ అన్న శబ్దం వారి నోట్లో వెలువడితే చాలు తనకు తానుగా వెళ్లి మారుతి వారి కష్టాలను దూరం చేసి వస్తాడు.
దాస్యభక్తిలోనే లక్ష్మణుడిని కూడా చెప్పుకోవచ్చు. అన్న కోసం రామునిపై ఉన్న పరమ ప్రేమ వల్ల లక్ష్మణుడు అరణ్యాల వెంట తిరుగుతాడు. రాముడు దుఃఖంలో ఉన్నప్పుడు. శత్రువులతో పోరాడేటపుడు తోడునీడగా ఉంటాడు. ఒక్కక్షణం కూడా ఏమర్చి ఉండడు. కొన్ని జానపద కథల ద్వారా నిద్రను కూడా దూరం చేసుకొని తన అన్నావదినలను రక్షణగా నిలబడ్డవాడు లక్ష్మణుడు. రాముడు ఎక్కడుంటే అక్కడే అయోధ్య అని నావించినవాడు.
గుహుడు కూడా రాముని సేవచేయడంలో అమితమైన ఆనందాన్ని పొందేవాడు. ఇలా భక్తుడు ఒక సేవకునిగా భావించి భగవంతునికి సేవ చేయడం దాస్య భక్తిగా చెప్పుకోవచ్చు. కాకపోతే సఖ్యం కూడా భగవంతునితో నెరప వచ్చు. కుచేలుడు దారిద్య్రావస్థలో మగ్గిపోయన వాడు. కానీ కృష్ణునితో స్నేహంలో అపార కుబేరుడు. అందుకే పిడికెడు అటుకులను తన చినిగిపోయన వస్త్రంలో కట్టుకొని కృష్ణుని దగ్గరకు వెళ్లి అవి కూడా ఇవ్వకుండా కృష్ణుని చూసిన ఆనందంలో మునిగిపోతే ఆ కృష్ణుడు కుచేలునికి రావించి తన పక్కన ఆసనాన్నిచ్చి కూర్చుండ బెట్టుకుని అతిథి మర్యాదలు చేసి పట్టు పీతాంబరాలను కట్టబెట్టి మృష్టాన భోజనాన్ని తినిపించి కుశల ప్రశ్నలు వేసి ఎంతో ఆనందాన్ని చ్చి ఏమీ అడగకుండానే ఐశ్వర్యవంతుడిని చేసి కుచేలుడిని పంపిస్తాడు కృష్ణుడు.
అటువంటి సఖ్యభక్తిలోను జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ‘‘నీవే తప్ప నితః పరంబెరుగ.. నిన్ను విడిచి నేనుండలేనయ్యా’’ అంటూ ‘నీవే సర్వస్వం’ అని శరణాగతిని వేడడం కూడా భక్తే. భక్తిలో ఏ మార్గంలో పయనించినా జ్ఞానం భగవంతుని సన్నిథి లభిస్తుందని భాగవతం చెప్తుంది. ఇటువంటి భక్తి గురించి ‘‘మొక్కవోని విశ్వాసంతో, శుచులై, భగవంతుని రూపకల్పనగావించి, అర్చించి, పూజించడం...’’ ‘కాయకభక్తి’ అంటారు వేదవ్యాసులు.
అత్యంత భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రచిత్తంతో భగవంతుని లీలను విజయాలను, ఆగ్రహానుగ్రహాలను కథలు- కథలుగా చెప్పుకుని వినడం వాచక భక్తి అంటారు గర్గమహర్షి.
మనసా, వాచా కర్మణా.. మనోవాక్కాయ కర్మలతో, పరమాత్మతో తాదాత్మ్యతకు భంగం వాటిల్లనివ్వకుండటం భక్తి.. మానసిక భక్తి అంటారు శాండిల్యుడు.
కనుక భక్తి అనే బీజం మనసున నాటుకుంటే చాలు జ్ఞాన సముపార్జనతోపాటు ముక్తి కూడా లభ్యమవుతుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు