Others

విత్తు ఒకటైతే పండు వేరగునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాడు విద్యారణ్యస్వామి స్థాపించిన హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన్ నుంచి వచ్చిన మేము బాలబాలికలను ధర్మపరాయణులు గాను, సత్యవాక్య పరిపాలకులుగాను జీవించేటట్టుచేసే మహాయజ్ఞాన్ని తలపెట్టాము. అందులో భాగంగా విద్యావిధానంలో మార్పులు తేవాలని సంకల్పించాము. ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొంటారని విశ్వసిస్తున్నాము.
- శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యులు
- హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం
- హంపీ విద్యారణ్య భారతీ స్వామి

వేప విత్తు నాటితే మామిడి పండ్లు వస్తాయా?
నిజమే కదా. విత్తు దేన్ని వేస్తామో ఆ విత్తుకు సంబంధించిన మొక్క అంకురించి పెరిగి చెట్టు, వృక్షంగామారి కాయలను, పండ్లను ఇస్తుంది. అంతేకానీ వేప చెట్టు బాగా పెంచి మామిడిపండ్లు రావడం లేదని వాపోతే ఏమి లాభం ? అంటారు నేటి హంపీ విద్యారణ్య భారతీ స్వామి.
ఎందుకంటే?
నేటి యువత విద్య అంతా పాశ్చాత్యదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడానికి లేదా స్వదేశంలో డాక్టర్లు లేదా ఇంజనీర్లకే అది ఇదీ కాదంటే సిఎలు కావడం ఎలా అన్నదాని మీద తల్లిదండ్రుల దృష్టి పెట్టి తమ పిల్లలను ఊహతెలియని వయస్సు నుంచి ఆంగ్ల విద్యావిధానాన్ని నేర్చుకోమని ఒత్తిడి చేస్తున్నారు. పొద్దున నుంచి రాత్రి దాకా కేవలం చదవడం, రాయడం తప్ప మరేమి కనిపించడంలేదు. అంటే బట్టీయం వేసే బడులను వెతికి వెతికి మరీ పంపిస్తున్నారు. అందరితో మేము టెక్నో స్కూల్ లో చదివిస్తున్నాం మా పిల్లలను అనితల్లిదండ్రులు గొప్పగా చెబుతుంటారు.
అట్లా చదివిన వారిలో చాలామంది యంత్రాల్లా మారుతున్నారు కానీ వారిలో సృజనాత్మక భావాలు అంకురించడం లేదు. వారు చెప్పారు. మేము చేశాము అన్న చందంలో వారి చదువులు ఉంటున్నాయి.
అందుకే ఫెయిల్ అన్న శబ్దం వినిపించగానే ఆత్మహత్యలు మొదలైపోతున్నాయి. ఎందుకు ఫెయిల్ అయ్యాం? అన్న వివేచన కూడా వారు చేయడంలేదు. రిజల్స్ అంటూ విద్యాసంస్థలు చెబుతాయి. పాస్ పర్సంటేజ్ అంటూ హోరు...మరునిముషంలో ఇంతమంది విద్యార్థులు అసువులు బాసారు అని చెబుతున్నారు..
దీనికి కారణం ఏమిటి?
ఉద్యోగం కోసమే చదువులా.. ఆ ఉద్యోగం రావడానికి ఇన్ని ఏళ్లు చదవాలా? కేవలం ఉద్యోగం డబ్బు రాబడి ఉంటే మనిషికి సరిపోతుందా? ఇక ఏమీ మనిషి కోరుకోడా? ఎవరైనా ఆలోచించారా ఈ దిశగా? అంటారు హంపీ స్వామి.
నిజమనిపిస్తోంది కదా.
పూర్వం విద్యావ్యవస్థలో చదువుకున్న వైద్యులు నాడీ పట్టుకుని చూసి మొత్తం శరీరంలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉందో చెప్పేవాళ్లు.
ముఖం చూసి శారీరిక అనారోగ్యంతో బాధపడుతున్నారా? లేక మానసిక అనారోగ్యంతో ఉన్నారా? అని కూడా చెప్పేవాళ్లు.
మరి ఇపుడు అలాంటి వాళ్లు ఉన్నారా?
లేరు ప్రతి దానికి స్పెషలైజేన్స్ డాక్టర్లు. ముక్కు, చెవి, కన్ను, గుండె , కాలు, చేయి ఇలా దేనికి దానికే డాక్టరు ప్రత్యేకం ఒకవేళ ఎవరైనా ముక్కు నొప్పి అని కంటి డాక్టరు దగ్గరకు వెళ్లితే ముక్కు చూడడం అది నాకు తెలియదు అంటాడు.
ఇంకోకొత్త జబ్బు ఏమిటంటే ...ఒకే జబ్బుకు డాక్టర్లు వేర్వేరుగా ఉంటారు. వారిలో ఒకరు ఇచ్చింది రెండవ వాళ్లు తప్పు అది వేసుకోకూడదు అంటుంటారు. వీళ్లు మరోటి రాసిస్తారు.
అంటే డాక్టర్లల్లో కూడా సఖ్యత లేదు.
అట్లానే ... ఇంజనీర్లు కూడా అంతే ఒకరి ఎస్టిమేషన్ మరొకరు బాగలేదంటారు. నిర్మాణాలు నాలుగు కాలాలపాటు నిలవవు. అన్నీ గుల్లబారినవే.
ఒక్క డాక్టర్లు, ఇంజనీర్లేకాదు.. ఏది చదివినా కార్పోరేటు సంస్థల్లో ఉద్యోగం కోసం పడిగాపులు తప్పనిసరి. .. పోనీ ఆ ఉద్యోగం వచ్చిందా అంటే అక్కడ మళ్లీ ట్రైనింగ్ .. అంతా ఉద్యోగం కోసమే చదివితే ట్రైనింగ్ ఎందుకు ఆలోచించారా?
పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారు సరిగా పని చేస్తున్నారా... వారిని పరిశీలిస్తే చాలు ఎంతెంత మంది అవినీతి పరులు.. లోకుల డబ్బును కొట్టేసి ఇంట్లో దాస్తున్నారు..
ఎందుకింత అవినీతికి పాల్పడుతున్నారు.. ఇదేనా వారు నేర్చుకున్న చదువు వారికి నేర్పింది ..
ఇది ఎపుడైనా ఆలోచించారా...
దీనికంతటికీ కారణం పిల్లలకు నేర్పిస్తున్న విద్య విధానంలోని లోపమే...
ఎందుకంటే పిల్లలకు మెకాలే నేర్పిన గుమాస్తా గిరి చదువులనే మనం నేర్పిస్తున్నాం... దానివల్లనే అవినీతి, మూస విద్యలు ఉద్యోగాలు చేసేవారు తయారు అవుతున్నారు.
విదేశీయులు మనదేశాన్ని ఏలారు.. వాళ్లు మన దేశంనుంచి వెళ్లి కూడా పోయారు. కానీ వారు చేయదల్చుకున్న సంస్కృతీ విధ్వంసకర చర్యలు మాత్రం ఇంకా ఆపలేదు. మనము దానిని ఇంకా గుర్తించలేదు. విదేశీయులు భారతదేశం అంతా ఏకతాటిపైన నడుస్తున్నది. హైందవానే్న నమ్ముతున్నది అంటే దానికి కారణం వారిలో ఉన్నది మతం కాదు ధర్మం. ధర్మపరాయణులు కనుకనే వారిని మనం ఎంత నాశనం చేసినా తిరిగి తిరిగి వారు పునర్జీవితులై వారి పూర్వ వైభవాన్ని సంతరింపచేసుకొంటున్నారు కనుక వారిని నాశనం చేయడం కాదు భారతీయుల సంస్కృతిని నాశనం చేయాలి అనే దురుద్దేశంతో విదేశీ ముష్కరులు ఆనాటి నుంచి నేటి దాకా మన ఆచార సంప్రదాయాలను సంస్కృతిని నాశనం చేసే చదువులను నూరిపోస్తున్నారు. వాటినే అద్భుతమనుకొని మనవారు వాటిని తలపై పెట్టుకొంటున్నారు. ఆ విధానం మారాలి.
పూర్వం లాగా చదువు సంధ్యలు సాగాలి. విద్యను అభ్యసించడానికి వెళ్లేవాళ్లకు ముందు ధర్మం గురించి, సత్యం గురించి, మానవత్వం గురించి చెప్పాలి. ఆ తరువాత పొట్టపోసుకొనే విద్యలను నేర్పిస్తే వారు పెరిగి పెద్దవారై మనుష్యులు గా మారుతారు. దేశకీర్తిని నలుదిశలా చాటుతారు. ప్రపంచం అంతా హైందవం అంటే ధర్మపరాయణ దేశంగా మారుస్తారు. అట్లా మార్చడానికి శక్తులుగా విద్యార్థులను తయారు చేయాలి.
ఇలాంటి మార్పు మన విద్యావిధానంలో అత్యవసరంగా రావాల్సిన అవసరం ఉంది. దీన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పాలి. వారి పిల్లలు డబ్బు సంపాదించే యంత్రాలు గా కాకుండా ధర్మపరాయణులు, సత్యవాక్కు ధారణులుగా చేయగలిగితే త్రేతాయుగపు రాముడిని నేడు కూడా ఎలా తల్చుకుంటున్నారో అదేవిధంగా ప్రపంచం ఉన్ననాళ్లు వీరి పిల్లల్ను తల్చుకుంటారు.
ఆదిశంకరాచార్యులు మతవిద్వేషాలు మాన్పి అందరినీ ఎలాగైతే ఏకతాటిపైన నిలిపారో ఇపుడు ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కో ఆదిశంకరాచార్యులుగావాలి. ఆ దిశగా విద్యావిధానం మారాలి.

-పి.వి.రమణారావు 9849998093