Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూలసెజ్జతోడ నటకు వచ్చెను సీతమ్మ
పూల సెజ్జ నడిచెననగ నడిచెను సీతమ్మ.

ఒక శ్యామల సుమరాజమ్మన రాఘవుడొప్పెను
దానినంద జనకపుత్త్రి తన చేతిని సాచెను.

ఒక ఎర్రని మందారమ్మన లక్ష్మణుండునుండెను
దానినంద ఊర్మిళమ్మ తన కేలును సాచెను.

పూలు పూల తాకినటుల తాకిరి వారటుల!
కాని పూలు ఊడి రాక తెరిచెనంత కనుల!

‘‘ఇది ఏమిటి? ఈ పువ్వులకింతలేసి కన్నులు?
ఇది ఏమిటి? ఈ పువ్వులు వింతగవోవుట నిదురలు?

నసలే నవకుమారులో? రాజులె పూలైనారో?
పూలకె కన్నులు మొలవగ కన్నుగలిపి చూచెనో?’’

అనుకొనుచును ఆశ్చర్యమునందు వారు మునిగిరి
చుక్కలంటి చెక్కిళ్ళను తమ చేతుల జేర్చిరి.

‘‘ఈ కనె్నలు విరికన్నులతోడ కన్ను కలిపిరేల?
పొదల పాటునున్న మమ్ము పూజేతుల కదిపిరేల?

వనమే వనజాక్షులగుచు ఈ తోటను తిరిగేనో?
పూలే పూబోణులగుచు మధువుగొంచు వచ్చేరో?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087