Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలవలె, కొమ్మలవలె నిల్చుట ఎందులకో?
అచ్చెరువున మునిగినట్టి అచ్చర భామినులొకో?’’

అని దిగ్గున లేచినారు అంత రామలక్ష్మణులు
తోకల కదిలించగానె పాములు పడగెత్తినటులు.

కనులు కనులు కలిసికొనెను చూపులు ఘర్షించెను
ఏదో తెలియని మోహం వారల ముంచెత్తెను

సీత చేతి స్పర్శచేత రాముడు పులకించెను
రాముని కనుచూపు సోకి సీత కరిగిపోయెను.

ఊర్మిళమ్మ చేయి సోకి లక్ష్మణుండు కరిగిపోయె
అతని కంటి చూపులంటి ఆమె రగిలిపోయె.

‘‘ఇది ఏమిటి నామోమె! రాలెనెటుల మీసమ్ములు!’’
అనుచు రాఘవుండు చూచె జానకి ముఖ కమలమ్ము!

అటుల ఊర్మిళయును లక్ష్మ
ణులును చూచుకొనినారు.

‘‘ఇది ఏమిటి? ఈ అందం? ఎంత విశ్వమోహనమ్ము?
ఇది ఏమిటి? ఈ చూపు? వశీకరణ మంత్రమ్ము?

సుమమనుకొని సుకుమారుని గిల్లి పలకరించితినే!
ఏమిటోయి ఈ గారడి? ఎటుల జరిగె నీ రీతిని?’’
ఇంకా వుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087