Others

పూజా ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిమ మానవుని దగ్గర నుంచి నాగరికత పెరిగి రాకెట్ యుగంలోకి వెళ్లుతున్న నేటి వరకు మనిషి ఏదో ఓ రూపంలో భగవంతుడిని ప్రార్థిస్తుంటాడు. కొందరు తమ కోసం తాము బాగుండాలని, తనకు అన్ని విధాల సంతోషాలు చేకూరాలని ప్రార్థిస్తే ఇంకొందరు తమ చుట్టూ ఉన్నవారు బాగుండాలని వారు సుఖసంతోషాలతో జీవించేలా చేయమని ప్రార్థిస్తుంటారు. మరికొందరు సర్వేజనా సుఖినోభవన్తు అందరూ బాగుండాలి అని కూడా ప్రార్థిస్తుంటారు. కానీ ప్రార్థన మాత్రం ఒక్కటే.
ప్రార్థననే పూజగా భావిస్తే ఆపూజలో భగవంతునికి ఉపచారాలు చేస్తుంటారు. ఆ ఉపచారాలను ఆచరించటం లో కొంతమంది పుస్తకాలు దగ్గరపట్టుకని గంధాన్ ధారయామి, అక్షతాన్ ధారయామి అంటూ బొట్టు, వస్త్రాలు, తిండి చేతులు కడగడం ఇలా ఎన్నో ఉపచారాలను దేవునికి చేసేసినట్టు మంత్రాలు చదివేస్తుం టారు. మరో ప్రక్క పూలను వేసేస్తుంటారు. మధ్యలో కనుక సెల్ వస్తే హలో అంటూ మాట్లాడేస్తుంటారు. మరి కొందరు వంట వండేస్తూ కూడా భగవంతునికి పూజ చేస్తేస్తుంటారు.
కానీ భగవంతుని నిరంతరం మనసులో ధ్యానం విడువక చేస్తూ నిత్యోపచారాలు చేయాలని పెద్దలు అంటారు. ఓ భక్తురాలు కృష్ణ విగ్రహానికి స్నానం చేయంచి తుడిచి బట్టలు కట్టి తిలకం దిద్ది ఇలాఉపచారాలు చేస్తూ చేస్తూ కృష్ణ బాల్య చేష్టలను రమ్యంగా పాడుతూ పాడుతూ కృష్ణుని విగ్రహానికి పాలు పడుతూ ఉందట. ఉన్నట్టుండి ఆమెకు కృష్ణుడికి ఎక్కువ పాలు పట్టేసాను. అయ్యో అజీర్తి చేసి కక్కుకుంటాడేమో అనిపించి కృష్ణా నాయనా కృష్ణా ఇపుడు నేనే ఏమి చేసేది అని ఆమె ఎంతో బాధ పడిందట. వెంటనే ఆ విగ్రహం లోంచి పాలు చిన్నపిల్లలు కక్కినట్టు బయటకు వచ్చేసి చిన్న త్రేన్పు వచ్చిందట. అది చూసి ఆ తల్లి హమ్మయ్య ఇపుడు ఇక కృష్ణుడికి ఏమీ కాదని దిష్టి తీసేసిందట. ఆ తరువాత ఆ కృష్ణుడిని పడుకోబెట్టి జోల పాట పాడిందట. అది ఆ భక్తి పారవశ్యంలో చేసే చేష్టలు. కాని చిత్తం చెప్పుల మీద చేతలు శివుడిమీద ఉంచి పూజ చేస్తే ఇక భగవంతుడు ప్రార్థనను వింటాడా ? మీరే ఆలోచించండి.
అందువలన పూజా ప్రక్రియలో ఉన్నపుడు ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకొని, అంతర్ముఖులై, ప్రార్థనా నిమగ్నులు కావాలి. అంతేకాదు, ఆ ప్రార్థన మీద ధ్యాసను చివరివరకూ నిలుపగలిగాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మనస్సు పూర్వ సంస్కార బలమువలన బహిర్ముఖమై పరిపరివిధాల ప్రవర్తిస్తుంది. అలా దానిని విచ్చలవిడిగా వదిలేయకుండా, పగ్గాల్ని పట్టి లాగి అశ్వాన్ని అదుపు చేసినట్టుగా, ఏకాగ్రత అనే త్రాటితో బహిర్ముఖమై సంచరిస్తున్న ఆ మనస్సును ఎప్పటికప్పుడు అంతర్ముఖమొనర్చాలి.
అలా కాకుండా మనస్సును దాని ఇష్టానికి వదిలివేసి నిలకడలేని ధ్యాసతో, మనదృష్టిని ఒక చోటకూ, దేహదృష్టిని మరోచోటకూమరలించి, కేవలం వాచా చేసే ప్రార్థన మంఛి ఫలితాన్ని ఇవ్వదు. అంతేకాదు మానసిక ప్రార్థన ఎంత ప్రభావవంతమైనదంటే, బుద్ధునికాలంలో మత్తకుండలి అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు.
ఒకానొక వ్యాధివలన అతడు లేవలేనీ, మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. మరణావస్థ కలుగుతున్న సమయం లో అతడు కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైనాడు. బుద్ధుని ప్రసన్న కరుణారూపం స్మృతిపథంలోకి వచ్చింది. వెంటనే ఈ విధంగా ప్రార్థించాడు. ‘‘దయానిధీ ఇప్పుడు నీ దర్శనం కోసం నడిచి వచ్చే స్థితిలో లేను. చేతులెత్తి నమస్కరించే స్థితిలోనూ లేను. మాట పడిపోయినందువలన వాచా నీ స్తుతిని కూడా చేయలేకపోతున్నాను. బాగున్న సమయం లో ఎన్నో పాపభూయిష్టమైన కర్మలు చాలా చేశాను.
నా కోసం ఎంతో త్యాగం చేసిన తల్లిదండ్రులను, పెద్దలనూ, గురువులనూ నేను గౌరవించలేదు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపంతో తపించిపోతున్నాను. నా పుణ్యవృద్ధి కోసం నా మానసిక పూజను స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓ దయాసముద్రా, నా తప్పులన్నింటినీ క్షమించి శిక్షార్హుడవైన నన్ను క్షమార్హుడిని కావించి నన్ను అనుగ్రహించు’’ అని ప్రార్థించాడు. అంతర్ముఖమై భక్తిశ్రద్ధ ఏకాగ్రతలతోకూడిన ఆ ప్రార్థనవలన, మనశుద్ధితో చేసిన ఆ మానసిక పూజవలన అతని చిత్తంలో బలమైన పుణ్య సంస్కారాలు ఉద్భవించి, దేహాన్ని విడిచినప్పుడు ఆ పుణ్యబలం సహాయంగా నిలిచి అతనిలోని ఆత్మ దేవలోకానికి చేరింది.
అందుకే మనసా వాచా కర్మణా కూడా భగవంతుని నామాన్ని స్మరించినా చాలు పూజచేసినంత ఫలితం వస్తుంది. ఇతరులను భగవంతుని రూపంగా భావించి సేవించినా వారికి సాయం చేసినా చాలు భగవంతుడు మనలను మెచ్చుతాడు.

- చివుకుల రామమోహన్