Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటరాని బొమ్మయాయె పూలకొమ్మయాయెను
పెదవి విప్పలేని శిలగ రాముండై పోయెను.

పూలసెజ్జ నచటె వదిలి జానకి పరుగులు దీసెను
ఆమె వెంట ఊర్మిళయును వారి వెంట చెలులును.

పూలను విడి పరుగుదీసినారు పరిమళాలవోలె
పూలు మిగిలె, తోట మిగిలె, శూన్యమ్మే మిగిలె.

పువులు రాలునేమొగాని పరిమళమ్ము రాలదు
జాణలు వీడిరి కాని జాణతనము వీడదు.

ఇది ఏమిటి చోద్యమ్ము! విధిలీలలు విచిత్రమ్ము!
రామలక్ష్మణుల మదిలో కాముడు కాలిడెను!

ఏదో కోల్పోయినటుల వారలెంతొ వగచిరి
వెనుదిరుగుచు వౌనియున్న తావున కేతెంచిరి.

ముసిముసి నవ్వుల దేలెడు వారల గని ముని నవ్వెను
వారలెరుగ జాలరైరి ఆ నవ్వునకర్థమ్మును.
రేయంతయు నిదుర లేక కుంకుమ పూలాయె కళ్ళు
తెలవారగ కునికి కలల కౌగిళ్ళను దేలిరి.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087