Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ధనువును అతడు గెలువ- ఒక ధనువాతని గెలుచును
ఎవరి నెవరు గెలువనేమి? శక్తిశక్తిగలియును.

చూపులు చూపులు కలిసెను- హృదయమ్ములు పులకించెను
‘‘నీవేనా? నీవేనా?’’ యునుచు కనులు భాషించెను.

జన్మ ధన్మమంచు సీత- యెంచె నతడు భర్తయైన
శుభకరమ్ము జీవితమని- యెంచె రాముడామె వలన.

అతడు నడిచె ధనువు కడకు- అంత కలిగె కంపనమ్ము
అది భూమిదొ? భూమిజదో? తెలుపుట కష్టమ్ము.

శక్తి కడు శక్తివోలె వింటి కడకు చేరెనతడు
తనకు తానె మ్రొక్కినట్లు మ్రొక్కెనంత వింటి కతడు.

ఆ చేతను ఆ వింటిని అందుకొనెను రాఘవుండు
మత్తకరీంద్రమ్మొక్కటి మాలనందు కొన్నట్టుల.

సీతచేత రామువోలె నీలి నీలి సుమహారము
రాముచేత సీతవోలె సదాశివుని విల్లమ్ము.

ఆ ధనువును పిడికిలించి రాముడు పైకెత్తెను.
తన నడుమునె పిడికిలించెననగ సీత పులకించెను.

నారి వంక చూచెనతడు- నారిని ముడి వేసెను
‘‘ఘీంకార’’మ్మటుల ధనుష్టంకారము చేసెను.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087