Others

సంతాన వరదాయని గరుడపంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణ శుక్ల పక్ష పంచమికి ‘‘నాగ పంచమి’’తోపాటు ‘‘గరుడ పంచమి’’ అని కూడా పేరు. ఈ దినం నాడు గరుడ పూజ ఆచారంగా ఉంది. గరుత్మంతుడు మహా విష్ణువుకు వాహనంగా ప్రసిద్ధుడు. మహాబలశాలి. విష్ణువు ఎక్కడికి వెళ్ళాలన్నా గురుడవాహనుడై వెళ్ళి, ఆపన్నుల రక్షణ గావిస్తారు.
వ్యాస మహర్షి విరచిత అష్టాదశ పురాణాలలో మరణానంతర నరక లోక వర్ణన, పాపాలకు విధించ బడే శిక్షలు, ప్రాయశ్చిత్తాలు, పుణ్య సాధనా మార్గాలు, పితృకార్య వివరాలతో 19వేల శ్లోకాలు గల గరుడ పురాణం ఒకటి. అధర్వణ వేదంలో గరుడోపనిషత్తులో విషదహార అని వైనతేయ ప్రస్తావన ఉంది. కశ్యప ప్రజాపతి తన భార్యలైన వినత, కద్రువలకు సంతాన ప్రాప్తికై పుత్ర కామేష్టి యాగం చేసిన ఫలితంగా, సతుల కోరికలపై కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు పుడతాయి. కద్రువ అండాల నుండి వాసుకి, ఆది శేషుడు, ఆదిగా వేయి పాములు జన్మిస్తాయి.
వినత తొందర పడి ఒక అండాన్ని చిదుమగా, కాళ్ళు లేని, మొండెం మాత్రమే గల అనూరుడు జన్మిస్తాడు. దానితో తన సవతికి దాసీగా ఉండాలని అనూరుడు శాపమిచ్చి, రెండవ అండం జాగ్రత్తగా దాచితే, దానినుండి జన్మించిన వాడే దాస్య విముక్తి కలిగిస్తాడని చెపుతూ, సూర్యునికి అనూరుడు రథ సారథిగా వెళతాడు. తర్వాత గరుత్మంతుడు జన్మిస్తాడు. శ్రావణ శుద్ధ పంచమి నాడు గరుత్మంతుడు అమృతాపహరణం చేసినందున గరుడ పంచమి అనే పేరు వచ్చింది. గరుడుడు అమృతం తెచ్చి తన సవతి తల్లికి ఇచ్చి కన్నతల్లికి దాస్యవిముక్తి గావించాడు. అయితే ఇంద్రునితో గరుడుని ఒడంబడిక కారణంగా, అమృతం నాగులకు లభించలేదు. కనుక వారు అతృప్తులైనారు.
అసంతృప్తులైన నాగులకు తృప్తి కలిగించడం కోసం వాటికి పూజలు జరపడం విరోధితో జతపడిన పర్వంగా భావిస్తారు. పురాణ గాధలు చూస్తే నాగులకు, గరుడుడికి విరోధమున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విరోధంలో గరుడుడే విజేతగా నిలుస్తాడు. భారత దేశంలోకొన్ని చోట్ల గరుడుడే పరాజితుడైనట్లు గాథలున్నాయి. గరుత్మంతుడికి, నాగరాజైన తక్షకుడికి ఒకసారి యుద్ధం జరగగా, గరుడుడు ఓడి పోవడం జరిగింది. నాగ ప్రతిమ గల యంత్రపు బిళ్ళను మెడలో వేలాడ తీసుకుని ఉండే షరతుపై ఇరువురికి రాజీ కుదిరింది. వంగదేశంలో ఈ పురాణ కథ ఉంది. సర్పరాజుకు, గరుత్మంతుడు నమస్కరిస్తూ ఉన్నట్లు శిల్ప ఖండాలు కూడా నేపాళం తదితర ప్రాంతాలలో ఉన్నాయి. వ్రత రత్నాకరంలో గురుడ పంచమి ప్రస్తావన ఉంది. పంచాంగాలలో సైతం నాగ పంచమి, గరుడ పంచమి రెంటినీ పేర్కొంటారు. విష్ణువుకు గరుడుడు వాహనం కావడం వల్ల వైష్ణవాలయాలలో ఆ వాహనాలు ఉండడం వాటి మీద స్వాముల ఊరేగింపులు జరపడం పరిపాటి. సర్వశక్తి సంపన్నుడై ఉండీ, సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనాలను తెంపి, మహా విష్ణువుకు వాహనంగా వినుతికెక్కిన వినతా పుత్రుడైన వైనతేయుడు ప్రాత:స్మరణీయుడు.

- సంగనభట్ల రామకిష్టయ్య