Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకసమ్మే వంగి భూమి మెడలోన
కట్టినట్టుల తాళికట్టె రాముడు

ముత్యాలు సీతమ్మ చేత పగడాలు
పగడాలు రామయ్య చేత నీలాలు.

ఒకరి చేతుల నొకరు పోసికొన్నారు
తలయె జలదవ్మౌచు కురిసెనో యనగ.

బాసలను సేసలను కలబోసినారు
తలంబ్రాలుగా వారు పోసికొన్నారు.

రంగురంగుల కలలు రంగైన కలలు
కలలందు కలవోలె కరిగె సీతమ్మ.

సీత చేతను అతడు తొడిగె నుంగరము
బంగారు బ్రతుకునే తొడిగెనో యనగ.

బ్రహ్మముడులను వారు బంధింపబడిరి
కాదు బ్రహ్మమె వారిలో బందియాయె.

ఏడు అడుగులు నడిచె సీత రామునితో
ఏడేడు జన్మాల బంధమ్మె యనగ.

సీత చేతిని రాముడందు కొనినాడు
భూమి చేతిని సూర్యుడంచు కొనెననగ.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087