Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని వేడ్కలు తీరె మిగిలెనొక వేడ్క
అప్పగింతలు మిగిలె మిగిలె కన్నీళ్ళు.

నింగిలో నిముషాన మురిసె మేఘాలు
నవ్వుముఖముల పులుముకొనెను దుఃఖాలు.

కుండనిండినయట్లు గుండెల్లు నిండె
కుండ పగిలినయట్లు పొంగె దుఃఖాలు.

గుండె కరుగగ తల్లిదండ్రులేడ్చేరు
తమ పట్టి చేపట్టి అప్పగించేరు.

ఆకసమ్మే ఏడ్చె, భూదేవి ఏడ్చె
దిక్కులన్నియు నేడ్చె ఏడ్వదొక సీత.

పూలపల్లకిలోన పూలమాలికలా
ఆ తల్లి ఊరేగె ఆ వీధులందు.

పూలమాలిక వెంట గండు తుమ్మెదలా
ఆ తండ్రి ఊరేగ ఆ తల్లి వెంట.

ఓరకుంటను అతడు చూచెనో యేమొ?
ఆ తల్లి సిగ్గుతో మొగ్గయై పోయె!

‘‘నన్నడవి కంపినటులేల ఏడ్చేరు!
నా రేడు సూరీడు నా నోము పండె.

కంట నీరము వలదు- తండ్రి ఊర్కొనుడు!
కన్నీరులే వలదు- తల్లి ఊర్కొనుము!’’

అనుచు ధైర్యము చెప్పె నందరికి సీత
ఎందరేడ్చిన గాని ఏడ్వదా సీత. ***
అయపోయంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087