Others

అష్టమిలో అంతరార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనఘాష్టమి శ్రీకృష్ణజన్మాష్టముల దినం శివశక్తుల సమ్మేళన సంరంభం
అర్థరాత్రి నిశీదవ్యాప్తి అవిద్యల అదృశ్యం కోటి కోడి ఆదిత్యుల వెలుపల ఆవిర్భావం
అష్టమినాటి అర్కుని సింహరాశిలోవైష్ణవ రోహిణీ నక్షత్ర సమయముంలో జననం
అనంతుని రాసక్రీడల రసమయ రహస్యం రాధేశ్యాం అంతర్యామితో తాదాత్మ్యం

అష్టదిక్కుల దిగ్గజముల చాలకా విశ్వభ్రమణకారకా విశ్వరూపధారకా
అష్టసిద్ధి ప్రదాయకా అష్టాంగయోగ బోధకా అష్టషట్టమహిషుల ఆరాధ్యదైవమా
అనాహత అంతరాత్మ వేణుగానం ప్రణవనాదం మాధవుని అధరముల మధురం
అనంతపద్మనాభులై అష్టదళ పద్మమధ్యమున సంస్థితుడైన సచ్చిదానందుడా

అండపిండ బ్రహ్మాండములలో భాసించు భవభయ హరుడైన హరిపై భక్తి
ఆధ్యాత్మిక ఆదిదైవిక, ఆదిభౌతిక తాపత్రయము కావల అక్షర అమృతబాండకుక్షి
అనంగుని పుష్పమాణ వర్షం అణచలేదు అతివల కామకాంక్షలేని విరహతాపం
అవంతీ మధురామాయానగర కావల సాగర మధ్యమున ద్వారకలోనీ దివ్యధామం

అష్టమి దినమున అంతరంగంలో అనంతుడి తిష్ట శాఆథ్మనిష్టలో నున్న కృష్ణ తృష్ణ
ఆంతర్యములో అంగుష్టమాత్రమున నున్న వేఱెడు వామనుడు యశోదఅష్టగర్బవాసి
అష్టమసిద్ధులను గ్రహించి అరిష్టములు తొలగించి అష్టైశ్వరములను గ్రహించు గోవిందనామం
అంత్యకాలంలో అనంతుని నిరాకార ఓం కార ధ్యాన ప్రకాశం పరమానందభరితం

అనంత క్షీరసాగర మధ్యమునకు చేరుటయే నదీనదములకు చివరశాంతి లభ్యం
అశ్రువులు అగచాట్లు అష్టదరిద్రములు అవశ్యం అదృశ్యమగుట తథ్యం
అచ్యుతుడి చిత్తములో చింతన చేసిన చిదంబర రహస్య దర్శనం
ఆది మధ్యాంత రహితుని ఆశ్రయిస్తే అంతరంగము ఆత్మానంద భరిత అమృతభాండం

ఆపదలందు ఆదుకను అనాధ రక్షక ఆపద్బాంధవుడు గోవిందుడు
అందరిలో అంతర్యామి సర్వజీవుల వ్యష్టి సమిష్టి విశ్వసృష్టి కారకుడు విశ్వనాథుడు
అవ్యాజ సర్వోతృష్ట సహజ శుద్ధ ప్రేమమయ అప్రమేయ స్వరూపుడు
అప్రతి ప్రభావ చరాచర జగత్తునకు అధికుడైన ఆదిదేవుడు జగన్నాధుడు

అనంతవీర్య అమిత విక్రమ సర్వాత్మాంతర అంతర్యామి అయినట ఆదిదేవా
అనంత రూపములతో ధర్మసంరక్షణార్థం ఆవిర్భవించిన అవతారకా!
అభివిజ్వల ద్ద్రవంతి అసౌదిత్య అస్మదీయ ప్రళవాగ్ని ప్రత్యక్ష బ్రహ్మరూపా
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా గురురూప యోగీశ్వరీశ్వరా

అష్టమి దినమున వాసుదేవుని జననం జగత్తునకు ప్రమోదకారణం
అభేద దర్శనం అద్వైత సిద్ధాంత సారామాశ్యం అమరం అద్వితీయం
అమరత్వం వైపు అనంత పయనం అనుభవం కాదు అనుభూతే ఆత్మానందరూపం
ఆత్మ అనంతమని ఆకాశమంతా వరించిదన్నది అవగతమైతే అజ్ఞాన తిమిరం అంతర్థానం

- ఆర్. లక్ష్మణమూర్తి 7207074899